కరీంనగర్

సిరిసిల్లలో మంత్రి కేటీఆర్ పర్యటన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిరిసిల్ల, డిసెంబర్ 7: సిరిసిల్ల నియోజకవర్గంలో రాష్ట్ర అపద్ధర్మ మంత్రి, స్థానిక టీఆర్‌ఎస్ అభ్యర్థి కె.తారకరామారావు శుక్రవారం పర్యటించారు. ఈమేరకు మధ్యాహ్నాం పోలింగ్ కేంద్రాల వద్దకు రాగా, ఓటర్లు, ముఖ్యంగా ప్రజలు, తెరాస శ్రేణులు మంత్రితో కరచాలనం చేయడానికి పోటీలు పడ్డారు. హైదరాబాద్ నుండి వచ్చిన మంత్రి తంగళ్ళపల్లి మండల కేంద్రంలో, అలాగే సిరిసిల్ల పట్టణంలోని బీవైనగర్, వెంకంపేట తదితర ప్రాంతాలలోని పోలింగ్ కేంద్రాలలో కేటీ ఆర్ పర్యటించి పోలింగ్ కేంద్రాలను సందర్శించి, పోలింగ్‌ను పరిశీలించారు.
ఓటేసారు..
కమలాపూర్‌లో మంత్రి ఈటల.. సింగాపురంలో సతీష్
హుజూరాబాద్, డిసెంబర్ 7: హుజూరాబాద్ టిఆర్‌ఎస్ అభ్యర్థి, ఆపద్దర్మ మంత్రి ఈటల రాజేందర్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులు కమలాపూర్ మండల కేంద్రంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల పోలింగ్ కేంద్రంలో శుక్రవారం అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. హుజూరాబాద్ మండలంలోని సింగాపురంలో ఎంపీ కెప్టెన్ లక్ష్మికాంతరావు, ఎంపిపి వొడితల సరోజినిదేవి, హుస్నాబాద్ టిఆర్‌ఎస్ అభ్యర్థిగా బరిలో ఉన్న వొడితల సతీష్‌కుమార్ కుటుంబ సమేతంగా సింగాపురంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. కుమార్తె పూజిత తొలిసారి ఓటు హక్కు వినియోగించుకోవడం విశేషం.