కరీంనగర్

జిల్లాలో ప్రశాంతంగా పోలింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, డిసెంబర్ 7: జిల్లాలో శుక్రవారం జరిగిన శాసనసభ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగాయని, మొత్తంగా 77.97% ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారని జిల్లా ఎన్నికల అధికారి సర్ఫరాజ్ అహ్మద్ తెలిపారు. జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల పరిధిలో 9,11,025 మంది ఓటర్లు ఉండగా, శుక్రవరం మొత్తంగా 7,10,351 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని ఆయన పేర్కొన్నారు. కరీంనగర్ నియోజకవర్గంలో 2,87,021 ఓటర్లకు గాను 1,95,180 మంది ఓటర్లు, చొప్పదండి నియోజకవర్గంలో 2,12,276 మంది ఓటర్లకు గాను 1,67,277 మంది ఓటర్లు, మానకొండూర్ నియోజకవర్గంలో 2,02,504 మంది ఓటర్లకు గాను 1,72,730 మంది ఓటర్లు, హుజూరాబాద్ నియోజకవర్గంలో 2,09,224 మంది ఓటర్లకు గాను 1,75,164 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారని ఆయన తెలిపారు. జిల్లాలో ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ శాతాన్ని ప్రతీ రెండు గంటల కోసారి ఆయన నియోజకవర్గాల వారిగా రిటర్నింగ్ అధికారులు పంపించారని తెలిపారు. కరీంనగర్ నియోజకవర్గంలో ఉదయం 9 గంటలకు 10 శాతం, 11 గంటలకు 18.09 శాతం, మద్యాహ్నం 1 గంటలకు 34.08 శాతం, 3 గంటలకు 46 శాతం, సాయంత్రం 5 గంటలకు 68 శాతంగా నమోదైందని, చొప్పదండి నియోజకవర్గంలో ఉదయం 9 గంటలకు 10 శాతం, మధ్యాహ్నం 3 గంటలకు 56.80 శాతం, 5 గంటలకు 78.8 శాతం, మానకొండూర్ నియోజకవర్గంలో ఉదయం 9 గంటలకు 8.5 శాతం, 3 గంటలకు 56.10 శాతం, 5 గంటలకు 85.29 శాతం, హుజూరాబాద్ నియోజకవర్గంలో ఉదయం 9 గంటలకు 10 శాతం, 3 గంటలకు 65 శాతం, 5 గంటలకు 83.72 శాతం నమోదైందని, మొత్తంగా జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో 77.97 శాతం ఓట్లు పోలయ్యాయని జిల్లా ఎన్నికల అధికారి తెలిపారు. జిల్లాలో పోలింగ్ సందర్భంగా ఈవీఎంలలో పని చేయని 9 బ్యాలెట్ యూనిట్లను , 8 కంట్రోల్ యూనిట్లను, 24 వీవీ ప్యాట్‌లను మార్చినట్లు జిల్లా ఎన్నికల అధికారి తెలిపారు. కరీంనగర్ నియోజకవర్గంలో 4 బ్యాలెట్ యూనిట్లు, 3 కంట్రోల్ యూనిట్లు, 4 వీవీ ప్యాట్‌లను మార్చినట్లు తెలిపారు. అలాగే చొప్పదండిలో 2 బ్యాలెట్ యూనిట్లు, 2 కంట్రోల్ యూనిట్లు, 4 వీవీ ప్యాట్‌లు, మానకొండూర్‌లో 3 బ్యాలెట్ యూనిట్లు, 3 కంట్రోల్ యూనిట్లు, 5 వీవీ ప్యాట్‌లు, హుజూరాబాద్‌లో 11 వీవీ ప్యాట్‌లు మొరాయించడంతో వెంటనే మార్చినట్లు ఆయన తెలిపారు.