కరీంనగర్

హుజూరా‘బాద్‌షా’ ఎవరో?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హుజూరాబాద్, డిసెంబర్ 8 : పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఈ నెల 11 న జరిగే కౌంటింగ్ పైనే అందరి దృష్టి కేంద్రీకృతమైంది. దాదాపు మూడు నెలల పాటు హోరెత్తిన ప్రచారం పాటు పోలింగ్ కూడా పూర్తయి అభ్యర్థుల భవితవ్యం అంతా ఈ వి ఎం లలో నిక్షిప్తమై ఉంది. హుజూరాబాద్ లో ప్రధాన పోటీ టి ఆర్ ఎస్ అభ్యర్థి ఈటల రాజేందర్, కాంగ్రెస్ అభ్యర్థి పాడి కౌశిక్‌రెడ్డిల మధ్యే ఉంది. నువ్వా నేనా అనే రీతిలో ఇద్దరు అభ్యర్థులు తలపడ్డారు. నిజానికి అసెంబ్లీ రద్దు నాడున్న రాజకీయ పరిస్థితి, తదనంతరం ఎన్నికల నోటిఫికేషన్ నాటికి పూర్తిగా మారిపోయింది. అంతకుముందు ఏకపక్షంగా టి ఆర్ ఎస్ కు అనుకూలంగా ఉందనుకున్న వాతావరణం నువ్వా? నేనా? అన్నట్టుగా జరిగింది. హోరాహోరీ ప్రచారంతో ప్రధాన పార్టీల ప్రచారంతో వాతావరణం వేడెక్కింది. నియోజకవర్గంలో 84 శాతం ఓటింగ్ నమోదైంది. పెరిగిన ఓటింగ్ ఎవరికి అనుకూలంగా మారుతుందనేది చర్చనీయాంశమైంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోనే పోలింగ్ ఎక్కువగా జరిగింది. నియోజకవర్గంలో జమ్మికుంట, హుజూరాబాద్ పట్టణాలు మున్సిపాలిటీలుగా ఉన్నాయి. ఈరెండింటిలిలో 35453 మంది ఓటర్లుండగా, ఇందులో 24,315 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. మున్సిపల్ పరిధిలోని ఓటర్ల తీర్పు కూడా ఫలితాలను ప్రభావితం చేయనుందని ఇదే గెలుపును శాసిస్తుందనే ప్రచారం కూడా జరుగుతోంది. లబ్దిదారుల ఓట్లు టి ఆర్ ఎస్ అభ్యర్థికి వేసారా? లేదా? ప్రభుత్వ వ్యతిరేక ఓటుకు కాంగ్రెస్ పొందగలిగిందా? అనే చర్చ రాజకీయ వర్గాల్లో ఉత్కంఠను రేపుతోంది. ఇండిపెండెంట్లు ఎన్ని ఓట్లు పొందారు? బిజెపి అభ్యర్థికి ఎన్ని ఓట్లు వస్తాయి? అనే చర్చ జరుగుతోంది. ఎవరు బయటపడ్డా కొద్ది మెజారిటీతోనే అనే చర్చ తటస్థులు చేస్తుండగా, తాము భారీ మెజారిటీతోనే గెలుస్తామనే ధీమాను ఇరు ప్రధాన పార్టీలు వ్యక్తం చేస్తున్నాయి. ఇటు సోషల్ మీడియాలో తామే గెలుస్తామంటూ ఇరు పార్టీల కార్యకర్తలు సోషల్ వార్ చేస్తున్నారు. పలువురు పందాలు కూడా కాస్తున్నారు. పోలింగ్ అనంతరం ఈ వి ఎం లను హుజూరాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూంలలో భద్రపరిచారు. ఏది ఏమైనా ఈనెల 11న కరీంనగర్‌లో జరిగే కౌంటింగ్‌తో అభ్యర్థుల భవితవ్యం తేలనుంది.

ప్రజల్లోనే ఉంటా
- కాంగ్రెస్ నేత పొన్నం
కరీంనగర్ రూరల్, డిసెంబర్ 8: ప్రజా క్షేత్రంలో గెలుపు, ఓటములు సహజమని గెలిచిన ఓడిన ప్రజల్లోనే ఉంటానని కరీంనగగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ అన్నారు. శనివారం కరీంనగర్ రూరల్ మండలం ఆరెపల్లిలో దర్గలో మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం మాట్లాడుతూ రాష్ట్రంలో జరిగిన శాసనసభ ఎన్నికల్లో మాహాకూటమి విజయం సాధిస్తుందని దీమా వ్యక్తం చేశారు. కరీంనగర్ నియోజకవర్గంలో నేను గెలిచిన ఓడిన ప్రజల్లోనే ఉండి వారి సమస్యల కోసం పోరాడుతానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండలాధ్యక్షుడు మూల రవీందర్‌రెడ్డి, ఆరెపల్లి మాజీ సర్పంచ్ సుధాకర్‌రెడ్డి, గౌరయ్య తదితరలు పాల్గొన్నారు.
తమీ.. ఎట్లున్నది..?
*పోలింగ్ ముగిసినా.. వీడని ఉత్కంఠ *ఓటింగ్ సరళిపై అభ్యర్థుల ఆరా
*పల్లెలు, పట్టణాల వారీగా పరిశీలన* లెక్కల్లో మునిగి తేలుతున్న అనుచరులు
*అభ్యర్థుల ఇళ్ళలో కొనసాగుతున్న అంచనాలు

కరీంనగర్, డిసెంబర్ 8: రెండు మాసాలకు పైగా కొనసాగిన ముందస్తు ఎన్నికల యుద్ధం ఎట్టకేలకు శుక్రవారంతో ముగిసింది. రాష్ట్ర ప్రభుత్వం రద్దైన నాటి నుంచి మొదలు పోలింగ్ ముగిసే వరకు అవిశ్రాంతంగా పోరాడుతూ, ప్రచారం చేసిన అభ్యర్థులు ఓట్ల పండగ ముగియటంతో హమ్మయ్యా ఒక ఘట్టం ముగిసిందంటూ ఊపిరి పీల్చుకుంటూ, శారీరక విశ్రాంతి తీసుకుంటున్నారు. అయితే, పోలింగ్ ముగిసినా, ఆయా పార్టీలు, అభ్యర్థుల్లో ఉత్కంఠ మాత్రం ఇంకా వీడటం లేదు. దీంతో, ఓటింగ్ సరళి ఎట్లుంది తమ్మి అంటూ అనుచరుల వద్ద వాకబు చేస్తున్నారు. గతంలో కంటే ఈసారి పోలింగ్ శాతం పెరుగగా, పెరిగిన ఓట్లతో వారికి కలిగే లాభ నష్టాలపై అంచనాలు వేస్తున్నారు. పోలైన ఓట్ల సరళిలో ఎవరికెంత శాతం పడే అవకాశాలున్నాయనే అంశం అందరి నోళ్ళలోనానుతోంది. గ్రామాలు, పట్టణాలు, నగరాల వారీగా పోలింగ్ శాతం సేకరిస్తూ, వార్డులు, డివిజన్ల వారీగా పోలైన ఓట్లలో ఎవరికెన్ని గ్యారెంటీగా వస్తాయనే లెక్కల్లో బిజీ అయ్యారు. నిన్నటి దాకా రాత్రింబవళ్ళు తెరుచుకుని, కార్యకర్తలు, నాయకులతో కిటకిటలాడిన ఆయా పార్టీలు, అభ్యర్థుల కార్యాలయాలు తాజాగా వెలవెలబోతుండగా, గెలుస్తున్నామనే ధీమా ఉన్న అభ్యర్థుల ఇళ్ళలో సందడి నెలకొంది. పోలింగ్ శాతం, పోలైన ఓట్ల వివరాలు గ్రామాలు, డివిజన్ల వారీగా సేకరిస్తూ, తమకు పడే ఓట్లశాతంపై అభ్యర్థులు తమ ఇళ్ళలో అంచనాలు రూపొందిస్తూ, క్రోడీకరిస్తున్నారు. ముఖ్యంగా తమకు అనుకూలమైన ప్రాంతాల్లోని పోలైన ఓట్లశాతం పరిశీలిస్తూ, కార్యకర్తల అంచనాలు కూడా పరిగణలోకి తీసుకుంటున్నారు. తమకు పెట్టనికోటల్లాంటి ప్రాంతాలతో పాటు మరికొన్నిచోట్ల అధికశాతం ఓట్లు పోలవటంపై సుదీర్ఘ విశే్లషణలు చేస్తున్నారు. తమకు పెటెంటులాంటి ప్రాంతాల్లో కూడా ప్రత్యర్థులు ప్రలోభాలతో ఓటర్లను ఆకర్షించే యత్నం చేయగా, వారి ఓట్లపై కూడా అంచనాలు వేస్తున్నారు. ఈసారి రైతుబంధు, రైతు బీమా, కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ తోపాటు పింఛన్‌లు పొందుతున్న వృద్దుల నిర్ణయాలపై ఆరాతీస్తున్నారు. ప్రధానంగా పోటాపోటీ నెలకొన్న కరీంనగర్, హుజురాబాద్, పెద్దపల్లి, ధర్మపురి, జగిత్యాల, కోరుట్ల, వేములవాడ, మంథని అసెంబ్లీనియోజకవర్గాల్లో పోలింగ్ ముగిసినా, ఇంకా అభ్యర్థులను టెన్షన్ వీడటం లేదు. స్థానిక సంస్థల్లో పంచాయితీ, ప్రాదేశిక ఎన్నికల మాదిరి ప్రతి ఓటుపై నిశీతంగా పరిశీలిస్తూ, అభ్యర్థులు ఎవరికి వారే అంచనాలు రూపొందించుకుంటున్నారు. గెలుపు అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్న చోట్ల గెలవబోయే అభ్యర్థులు నిబ్బరంగా ఉండగా, ఇటు, అటు అన్నట్లుగా ఉన్న చోట మాత్రం అభ్యర్థుల పరిస్థితి దయనీయంగా మారింది. ఇన్నాళ్ళు ఓట్లకోసం చేపట్టిన ఎడతెగని ప్రచారంలో కూడా ఎదుర్కోని ఉత్కంఠను, పోలింగ్ అనంతరం ఎదుర్కుంటున్నట్లు అభ్యర్థులు పేర్కొంటుండగా, మరో 48గంటల పాటు ఇదే పరిస్థితిని భరించాల్సిందేనంటూ , ఎవరికి వారే అంచనాలతో ముందుకు సాగుతున్నారు.

పోస్టల్ బ్యాలెట్ పేపర్లను..
పరిశీలకుల సమక్షంలో తెరవాలి
- కౌంటింగ్ సిబ్బందితో కలెక్టర్ శరత్

జగిత్యాల, డిసెంబర్ 8: పోస్టల్ బ్యాలెట్ పేపర్లను పరిశీలకుల సమక్షంలో తెరవాలని కౌంటింగ్ సిబ్బందికి ఆర్‌వో శిక్షణ, ఇవ్వాలని, సూక్ష్మ పరీశీలకులను నియమించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ అన్నారు. శనివారం మూడు నియోజకవర్గాల కౌంటింగ్ ప్రక్రియపై వీఆర్‌కే కళాశాలలో అధికారులతో కలెక్టర్ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గానికి కౌంటింగ్ కోసం 20 టేబుళ్లు ఆర్‌వోకు ఒక టేబుల్, వీవీప్యాడ్ ఓటింగ్ కంపార్ట్‌మెంట్ బూత్‌లు ఒకే హాల్‌లో ఉంటాయని ప్రతి టేబుల్‌కు ఒక సూపర్‌వైజర్‌ను, ఇద్దరు అసిస్టెంట్ సూపర్‌వైజర్లను ఏర్పాటు చేయాలని అన్నారు. ఎల్‌ఈడీ స్క్రీన్ 5టేబుళ్లకు ఒక వెబ్‌క్యామ్, వీడియోగ్రఫీ, రౌండ్ ప్రకారం బ్లాక్‌బోర్డుపై రాయాలని అన్నారు. కౌంటింగ్ వద్ద నోడల్ అధికారులుగా కోరుట్ల నియోజకవర్గానికి రామానుజాచారి, ధర్మపురి జాయింట్ కలెక్టర్ బీ.రాజేశం, జగిత్యాలకు ప్రతాప్‌సింగ్‌లను నియమించామని అన్నారు. కౌంటింగ్ సజావుగా సాగేందుకు అవసరమైన సౌకర్యాలు, ఏర్పాట్లను చూసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ధర్మపురి జనరల్ పరిశీలకులు దెందూప్ షెర్పా, జాయింట్ కలెక్టర్ రాజేషం, నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు గౌతం పోట్రు, నరేందర్ భిక్షపతి, డీఆర్వో అరుణశ్రీ, ఏఈఆర్వోలు తదితరులు పాల్గొన్నారు.

ప్రముఖ కవయిత్రి డా.రాణీప్రసాద్‌కు..
బాల సాహిత్య పురస్కారం
- 10న గుంటూరులో స్వీకారం
సిరిసిల్ల, డిసెంబర్ 8: సిరిసిల్లకు చెందిన ప్రముఖ బాల సాహితీవేత్త, సృజన్ పిల్లల ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్ డా.కందేపి రాణిప్రసాద్ ప్రతిష్టాత్మక మంగాదేవి బాల సాహిత్య పురస్కారానికి ఎంపికయ్యారు. ఈమేరకు ఈనెల 10న గుంటూరులో ఈ పురస్కారంను కవయిత్రి రాణిప్రసాద్ అందుకోనున్నారు. శ్రీవెంకటేశ్వర బాలకుటీర్ వారి లలిత కళా ఉత్సవాల్లో భాగంగా ఈనెల 10వ తేదీన గుంటూరులో ఘనంగా పురస్కారంతో సత్కరించనున్నారు. బాలల్లో సమగ్ర వికాసం కొరకు తమ సృజన్ చిల్డ్రన్ హస్పిటల్ ద్వారా నిరంతరం కృషి చేస్తున్నందుకు గాను రాణీప్రసాద్‌కు ఈ పురస్కారాన్ని అందచేస్తున్నారు. రాణీప్రసాద్ గత 30 సంవత్సరాలుగా బాల సాహిత్యంలో చేస్తున్న కృషికి ఈ పురస్కారం లభించింది. పురస్కారం కింద రూ.25 వేలు నగదు, జ్ఞాపిక, ప్రశంసా పత్రం అందచేస్తారు. ఆసుపత్రి ఆవరణలో మొత్తం అంగుళం ఖాళీ వదలకుండా బాల గేయాలు, పొడుపు కథలు, సైన్స్ చార్టులు, వ్యర్థ పదార్థాల టీచింగ్ ఎయిడ్స్‌తో నిండి అవిరామంగా సందర్శకులను ఆకర్షిస్తుంటుంది. రాణీప్రసాద్ బాల సాహిత్యంలో మొత్తం 29 పుస్తకాలను రచించారు. పిల్లల కోసం మూడు బేల బొమ్మలు, 600 సైన్స్ చార్టులు తయారు చేశారు. వాటికి గాను గిన్సీన్ తెలుగు వరల్డ్ రికార్డు, వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు, జీనియస్ వరల్డ్ రికార్డులు లభించాయి. ‘కళాప్రపూర్ణ’,‘బాల సాహితీ కౌముది’, ‘బా సాహితీ పూర్ణిమ’ బిరుదులను సొంతం చేసుకున్నారు. తెలుగు విశ్వవిద్యాలయం పురస్కారంతో పాటు అనేక బాల సాహితీ పురస్కారాలను ఇప్పటికే అందుకున్నారు.

పోలింగ్ ముగిసింది.. లెక్కింపు మిగిలింది

- గణాంకాలతో అభ్యర్థులు బిజీ
ధర్మపురి, డిసెంబర్ 8: తెలంగాణ శాసనసభ మూడవ సాధారణ ఎన్నికల ప్రక్రియ పూర్తయింది. రీపోలింగ్ అవసరం లేనందున ఇక ఓట్ల లెక్కింపు మిగిలింది. ఈనెల 11న చేపట్టనున్న లెక్కింపు, ఫలితాల కోసం ఈసారి ఎక్కువ సమయం లేక, ఇక రెండు రోజులే ఉండడంతో పోటీ చేసిన అభ్యర్థులు, వారి అనుచర గణాలు తమకు రానున్న ఓట్ల గురించి కాకి లెక్కలతో కుస్తీలు పడుతూ కాలక్షేపం చేస్తున్నారు. జిల్లాలో పలు విధ ప్రత్యేకతలను సంతరించుకుని, ఇరువురు మాజీ అమాత్యులు - జువ్వాడి రత్నాకర్ రావు, తాడిపర్తి జీవన్ రెడ్డిల స్వస్థలాలు కలిగి, గుజ్జుల రామకృష్ణారెడ్డి, సానా మారుతిలు మరో ఇరువురు మాజీ శాసనసభ్యుల జన్మస్థలాలు కలిగి, ధర్మారం, వెల్గటూరు, పెగడపెల్లి, గొల్లపెల్లి, ధర్మపురి, బుగ్గారం సంపూర్ణ మండలాలతో ధర్మపురి నామాంకితయై ఎస్సీ రిజర్వుడు శాసనసభా నియోజకవర్గంలో అభ్యర్థులు వివిధ గ్రామాలలో తమకు రానున్న ఓట్ల గురించి, తమతమ కార్యకర్తల, అనుచరుల ద్వారా నివేదికలు పొంది గణాంకాలతో లెక్కలు కట్టడంలో తనమునకలై ఉన్నారు. షెడ్యూల్డు కులాల కేటగిరీకి స్థిరీకరించబడిన ధర్మపురి సెగ్మెంట్‌కు జరిగిన మూడవ సాధారణ ఎన్నికలలో ప్రధాన పార్టీలకు చెందిన ధర్మపురి సిట్టింగ్ శాసనసభ్యుడు కొప్పుల ఈశ్వర్ (తెరాస), అడ్లూరి లక్ష్మణ్ కుమార్ (ఇండియన్ నేషనల్ కాంగ్రెస్), కన్నం అంజయ్య (్భరతీయ జనతా పార్టీ)తోపాటు మొత్తం 11మంది అభ్యర్థులు ప్రస్తుతం ధర్మపురి శాసనసభా స్థాన అభ్యర్థులుగా పోటీ చేశారు. ధర్మపురి నియోజకవర్గం ఆరు సంపూర్ణ మండలాలతో రూపు దిద్దుకోగా, ప్రధాన పార్టీల అభ్యర్థులు గత ఎన్నికలలో పోటీపడిన, పాతవారే కావడం విశేషం. ప్రధానంగా ఈశ్వర్, లక్ష్మణ్ కుమార్‌ల మధ్యే తీవ్ర పోటీ నెలకొంది. ఆరు మండలాలో ఓటర్లు ఏఏ అంశాలకు ప్రభావితులైనారో, ఏ అభ్యర్థికి ఏ ప్రాతిపదికపై ఓటు వేశారో, వారిపై ప్రభావం చూపిన అంశాలు ఏమిటో అర్థంకాక, ఓటర్ల మనోభావాలు ఏమాత్రం బహిర్గతం కాక, ఓటర్ల నాడి ఏవిధంగా ఉంటుందో ఏమాత్రం అంతుచిక్కని స్థితిలో తమశక్తియుక్తులను ఫణంగా పెట్టి రణరంగంలో కాలుదువ్విన అభ్యర్థులు ఓటింగ్ సరళిని విశే్లషిస్తూ, చేసిన లెక్కలే చేస్తూ, తలలు పట్టుకుంటున్నారు. తాము ఎక్కడికి వెళ్ళినా ప్రజలు ఆదరణ చూపుతున్నారని భావించిన అభ్యర్థులంతా ఆదరణ ఓట్లుగా మారిందో లేదోనని ఆరా తీస్తున్నారు. ప్రస్తుత ప్రభుత్వ అభివృద్ధి, వైఫల్యం, సానుకూలత, వ్యతిరేకత, కూటమి పొత్తులు, సానుభూతి, ప్రధాన ప్రచారాంశాలుగా మారిన వేళ, ప్రధాన ప్రత్యర్థులైన ఈశ్వర్, లక్ష్మణ్ కుమార్‌లు ఓటింగ్ సరళిని విశే్లషింప చేస్తూ, గెలుపుపై ఎవరికి వారే ధీమాతో ఉన్నారు. అమీ తుమీ తేల్చుకునేందుకు తమ అమ్ముల పొదలలోగల అస్త్రాలను వినియోగించిన వేళ... ఈసారి ఎన్నికలు ప్రతిష్ఠాత్మకం కాగా, అభ్యర్థులు, వారి మద్దతు దారులు, కార్యకర్తలు, ప్రధానంగా బంధుగణం వివిధ అంశాల ఆధారంగా తమకు రానున్న ఓట్ల గురించి విశే్లషించడంలో నిమగ్నమై ఉన్నారు.
ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు
*పటిష్ట భద్రత నడుమ ఈవీఎంలు *ఏర్పాట్లు పరిశీలించిన ఎన్నికల అధికారి
కరీంనగర్ టౌన్, డిసెంబర్ 8: మూడు మాసాల నుంచి కొనసాగుతున్న ఎన్నికల ప్రచారానికి తెరపడి, శుక్రవారం నాడు పోలింగ్ కూడా ముగియగా, చివరి ఘట్టమైన ఓట్ల లెక్కింపుప్రక్రియ మిగిలింది. ఈనెల 11న ఓట్లు లెక్కించి, విజేతలను ప్రకటించనున్న నేపథ్యంలో జిల్లా ఎన్నికల అధికారులు పకడ్బంధీ ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలోని నాలుగు అసెంబ్లీ స్థానాలైన కరీంనగర్, చొప్పదండి, మానకొండూర్, హుజురాబాద్ లకు సంబంధించి, ఓట్ల లెక్కింపు నగరంలోని ఎస్సారార్ ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాలలో నిర్వహించనుండగా, ఇందుకు సంబంధించి అవసరమైన ఏర్పాట్లు పూర్తి కావచ్చినట్లు అధికారులు పేర్కొంటున్నారు. లెక్కింపుకు సంబంధించి 14 టేబుళ్ళు ఏర్పాటు చేసినట్లు, 754మంది సిబ్బంది లెక్కింపులో పాల్గొననుండగా, వారందరికీ గుర్తింపుకార్డులు అందజేయనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి సర్ఫరాజ్ అహ్మద్ తెలిపారు. ఉదయం 8గంటలకు ప్రారంభమయ్యే లెక్కింపులో భాగంగా ముందుగా పోస్టల్ బ్యాలెట్‌లు అరగంట పాటు లెక్కించిన అనంతరం, ఈవిఎంల లోని ఓట్లు లెక్కించనున్నట్లు పేర్కొన్నారు. మూడంచెల వ్యవస్థతో పాటు ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాలు బిగించి, నిరంతర పహార చేపట్టినట్లు తెలిపారు. విద్యుత్ లేకున్నా ఈ కెమెరాలు పనిచేస్తాయని, అలాగే, బీఎస్‌ఎఫ్ బలగాలతో పాటు ఎస్‌పిఎఫ్ సిబ్బంది కూడా ఈవిఎంల పహారాలో పాలు పంచుకుంటున్నారు. ఇతరులెవ్వరూ లోనికి వెళ్ళకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు.కాగా, వీటితో పాటు ఉమ్మడి జిల్లా పరిధిలోని పెద్దపల్లి, మంథని, రామగుండం అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు మంథని జెఎన్‌టియు కళాశాలలో, జగిత్యాల జిల్లాకు సంబంధించిన జగిత్యాల, ధర్మపురి, కోరుట్ల అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు నూకపల్లి సమీపంలోని విఆర్‌కె ఇంజనీరింగ్ కళాశాలలో, రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించి రెండు సెగ్మెంట్ల లెక్కింపు బద్దెనపల్లిలోని సాంఘీక సంక్షేమ పాఠశాలలో, హుస్నాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్ లెక్కింపు సిద్ధిపేట జిల్లాలోని పొన్నాల సమీపంలో గల ఇందూరు ఇంజనీరింగ్ కళాశాలలో చేసేందుకు తగిన ఏర్పాట్లు చేసినట్లు ఎన్నికల యంత్రాంగం తెల్పింది.

యాష్కీపై దాడి సరికాదు
- కాంగ్రెస్ సీనియర్ నేత జువ్వాడి ఖండన
కోరుట్ల, డిసెంబర్ 8: ఏఐసీసీ ప్రధానకార్యదర్శి, మాజీ ఎంపీ మదుయాష్కీపై దాడి చేయడం సరికాదని ఆయనపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని కాంగ్రెస్ సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణారావు అన్నారు. శనివారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మెట్‌పల్లి పట్టణంలోని టీఆర్‌ఎస్ నాయకులు, కాంగ్రెస్ టికెట్ రాని కొందరు వర్గీయులు కుమ్మక్కై మాజీ ఎంపీ మదుయాష్కీపై దాడి చేసి కారు అద్దాలు పగలగొట్టడం, ధర్నా చేయడం అప్రజాస్వామికమన్నారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్ నాయకుల ఆగడాలు, ఆకృత్యాలు శృతిమించాయని రేవంత్‌రెడ్డి, మదుయాష్కీలాంటి నాయకులపై జరిగిన దాడులే ఇందుకు నిదర్శనమన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్య కూటమి అధికారంలోకి వస్తుందని కోరుట్లలో భారీ మెజార్టీతో గెలుస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో జడ్పీటీసీ కొంటం రాజు, కౌన్సిలర్లు తిరుమల గంగాధర్, ఎమ్మెరి నాగభూషణం, రియాజ్ నాయకులు ఖయ్యూం, రాజరెడ్డి, గడ్డం వెంకటేష్, ఏఆర్ అక్బర్, తునికి భాస్కర్, కరణ్‌సింగ్‌లు పాల్గొన్నారు.