కరీంనగర్

విజేత ఎవరో..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్ టౌన్, డిసెంబర్ 10: రాష్ట్ర పాలన వ్యవస్థకు మూలస్థంభాలైన శాసన సభ్యుల ఎన్నిక ప్రక్రియ చివరి అంకానికి సమయం ఆసన్నమైంది. గెలుపుపై ధీమాతో ఉన్న అనేక మంది అభ్యర్థుల భవితవ్యం నేడు తేలనుంది. మరికొద్దిసేపట్లో ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు అధికార యంత్రాంగం పూర్తి చేసింది. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన నాటి నుంచి మొదలు నేటి లెక్కింపు పూర్తయ్యే వరకు ఆయా పార్టీల నుంచి పోటీ చేసిన అభ్యర్థులు, ఓటర్లు, రాజకీయ విశే్లషకుల్లో సైతం గెలుపోటములపై ఉత్కంఠ నెలకొంది. టికెట్లు ఆశించటంతో పాటు దక్కించుకోవటం, ప్రచారం చేయటం, ఓటర్లనాకర్షిస్తూ తమవైపు తిప్పుకోగా, ఎన్నికల్లో వారి ఓట్లన్నీ తమకేననే ధీమాతో ఉన్నా, రోజురోజుకు మారిన రాజకీయ సమీకరణలు అటు అభ్యర్థులతో పాటు, ఆయా పార్టీల్లో సైతం తీవ్ర అలజడిని రేపాయి. పోటాపోటీగా జరిగిన ప్రచారం, హోరాహోరీగా జంపింగ్ జపాంగ్‌లను తమవైపు తిప్పుకుని, బలాన్ని పెంచుకునే యత్నం చేసినా, అది తుదకంటా నిలవలేదనే వ్యాఖ్యలు వెల్లువెత్తాయి.
అయినా, అలుపెరగని పట్టుదలతో అభ్యర్థులు ఎవరి ప్రయత్నాలు వారు చేశారు. తమకు అనుకూలంగా స్టార్ క్యాంపెయిన్‌లు సైతం నిర్వహించారు. ఈ తరుణంలో వారి గెలుపోటముల గ్రాఫ్ హెచ్చుతగ్గులవుతున్నా, వాటిని తమకనుకూలంగా మార్చుకునేందుకు పడరాని పాట్లు పడ్డారు. ప్రత్యర్థుల వ్యూహాలను అంచనాలు వేస్తూ, వాటినధిగమించేందుకు ప్రతివ్యూహాలు పన్నుతూ గెలుపే లక్ష్యంగా ప్రచార పటాటోపం నిర్వహించారు. ఓటర్లను మెప్పించి, ఒప్పించి పోలింగ్ బూతులకు చేర్చి తమకే ఓట్లు వేసేలా అష్టకష్టాలు పడ్డారు. అయినా, వారిలో ఎక్కడో మూలన ఉన్న టెన్షన్ పట్టి పీడిస్తూనే ఉండగా, ఇది మరికొద్దిసేపట్లో మొదలయ్యే లెక్కింపు పూర్తయ్యే వరకు అలాగే కొనసాగనుంది. వీటన్నిటిని అధిగమించి, ఓటరు దేవుని కరుణ పొందిన వారు విజేతగా నిలవనుండగా, నేటి ఉదయం 10గంటల కల్లా అన్ని వర్గాల్లో నెలకొన్న ఉత్కంఠకు తెరపడనుంది.