కరీంనగర్

కౌంటింగ్ కేంద్రాల్లో భద్రత కట్టుదిట్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగిత్యాల, డిసెంబర్ 10: శాసన సభ ఎన్నికల లెక్కింపు జరుగుతున్న విఆర్‌కె కళాశాల వద్ద కట్టుదిట్టమైన భద్రత చర్యలు చేపట్టినట్లు జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ ఎ. శరత్ తెలిపారు. మంగళవారం కౌంటింగ్ కేంద్రాన్ని కేంద్ర ఎన్నికల సంఘం పరిశీలకులు డాక్టర్ రామస్వామితో కలిసి పరిశీలించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని 3నియోజక వర్గాల ఎన్నికల ఫలితాల లెక్కింపు జరుగుతున్నందున అన్ని నియోజక వర్గాల కౌంటింగ్ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్. సీసీ కెమేరా ,లెడ్ టీవీ,బ్లాక్‌బోర్డు డిస్ల్పె ఏర్పాటు చేశామని,మైక్రో అబ్జర్వర్, కౌంటింగ్ సూపర్‌వైజర్ , అసిస్టెంట్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మాట్లాడతూ కంట్రోల్ యూనిట్, అడ్రస్ ట్యాగ్‌సీల్, పోలింగ్ స్టెషన్ నెంబర్, సంతకాలు సరిచూసుకోవాలన్నారు.పోటీలోఉన్న అభ్యర్థుల ఏజెంట్లకు బూత్ ప్రకారంగా వచ్చె ఫలితాలను తెలియజేయడంతోపాటు ప్రతి రౌండ్‌కు ఏజెంట్ల సంతకాలను సేకరిస్తు బాధ్యతల పక్కాగా నిర్వహిస్తు కౌంటింగ్ హల్‌లో ఇతర విషయాలపై దృష్టి సాదించకుండ అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈకార్యక్రమంలో సాదరణ కేంద్ర ఎన్నికల పరిశీలకులు డాక్టర్ ఎన్ రామస్వామి, జాయింట్ కలెక్టర్ బి. రాజేశం, రిటర్నింగ్ అధికారులు పాల్గొన్నారు.