కరీంనగర్

అకాల వర్షం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగిత్యాల రూరల్, డిసెంబర్ 10: ఆదివారం అర్దరాత్రి కురిసిన అకాల వర్షానికి ఐకేపీ, మార్టెట్ యార్డులోని ధాన్యం పాక్షికంగా తడిసింది. దీంతో విక్రయానికి పంట ఉత్పత్తులు తరలించిన రైతులు ఆందోళన చెందుతున్నారు. ఉన్నట్టుండి ఓక్కసారిగా అర్దరాత్రి సమయంలో అకాల వర్షం రావడంతో కుప్పల పైన టార్పాలిన్ కవర్లు లేకపోవడంతో కొందరి రైతుల ధాన్యం కుప్పలు పాక్షికంగాతడిసాయి. అలాగే జగిత్యాల వ్యవసాయ మార్కెట్ యార్డులో వ్యాపారులు కొనుగోలు చేసి తూకాలు వేసిన బస్తాలు సైతం వర్షానికి తడిసిముద్దయ్యాయి. మండలంలోఏర్పాటు చేసిన ఐకేపీ ధాన్యం విక్రయాలు తుది దశకు రాగా మిగిలిన కొంత మంది రైతుల ధాన్యం పాక్షికంగా తడిసింది. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు.