కరీంనగర్

పటిష్ట బందోబస్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, డిసెంబర్ 10: రాష్ట్ర శాసనసభ ఓట్ల లెక్కింపు మంగళవారం జరుగనున్న సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకో కుండా ఉండేందుకు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశామని కరీంనగర్ పోలీస్ కమీషనర్ వి.బి. కమలాసన్‌రెడ్డి అన్నారు. సోమవారం కమీషనరేట్ లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో కమలాసన్‌రెడ్డి మాట్లాడుతూ ఓట్ల లెక్కింపు సందర్భంగా అమలులో ఉన్న ఉత్తర్వులను పాటించాలని, ఓట్ల లెక్కింపు కోసం వివిధ స్థాయిల్లో 600మంది పోలీస్ అధికారులు, సిబ్బందిని వినియోగిస్తున్నామని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల ఓట్లలెక్కింపు సందర్భంగా మూడంచెల భారీ భద్రతను ఏర్పాటు చేశామని, సివిల్, ఏఆర్, కేంద్ర బలగాలను వినియోగిస్తున్నామని చెప్పారు. ఇందులో ఇద్దరు అడిషనల్ డీసీపీలు, 8మంది ఏసీపీలు, 17మంది సీఐలు, 37మంది ఎస్సైలు, ఏఎస్సైలు, హెడ్ కానిస్టేబుళ్ళు 77మంది, కానిస్టేబుళ్ళు 371మంది, హోంగార్డులు 90, మహిళా పోలీసులు 37మంది, కేంద్ర బలగాలు ఒక కంపెనీలను వినియోగిస్తున్నామని వివరించారు. అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా కమీషనరేట్ వ్యాప్తంగా 144 సెక్షన్ అమలులో ఉంటుందని నగర పోలీస్ కమీషనర్ వి.బి. కమలాసన్‌రెడ్డి తెలిపారు. 5గురు అంతకన్నా ఎక్కువమంది గుమిగూడి ఉండొద్దన్నారు. మంగళవారం ఉదయం నుండి బుధవారం ఉదయం 6గంటల వరకు ఈ ఉత్తర్వులు అమలులో ఉంటాయన్నారు.
బాణాసంచా పేల్చొద్దు
శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు ముందుజాగ్రత్త చర్యగా కమీషనరేట్ పరిధిలో బాణాసంచాలను పేల్చటం నిషేధించటం జరిగిందని తెలిపారు.
శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలే
అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటాం అని నగర పోలీస్ కమీషనర్ వి.బి. కమలాసన్‌రెడ్డి తెలిపారు. కమీషనరేట్ వ్యాప్తంగా శాంతిభద్రతకు ఎలాంటి విఘాతం కలుగకుండా పటిష్టమైన చర్యలు చేపట్టడం జరిగిందని, ప్రజలు ఎలాంటి మారణాయుధాలు కలిగి సంచరించటం పూర్తిగా నిషిద్దమన్నారు. తాత్కాలికంగా షామియానాలు, మండపాలు ఏర్పాటు చేయొద్దని,డీజే సౌండ్, మైక్‌లు,వినియోగించకూడదని తెలిపారు. ఈఉత్తర్వులు మంగళవారం ఉదయంనుంచి బుధవారం ఉదయం 6గంటలవరకు అమలులో ఉంటాయని నగర పోలీస్ కమీషనర్ కమలాసన్‌రెడ్డి వెల్లడించారు.