కరీంనగర్

రుద్రంగి అభివృద్ధే ధ్యేయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చందుర్తి, డిసెంబర్ 18: వేములవాడ నియోజకవర్గంలో నూతనంగా ఏర్పడ్డ రుద్రంగి మండలాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని నియోజకవర్గ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు అన్నారు. రుద్రంగి మండల కేంద్రంలో మంగళవారం కుల సంఘాలు, పార్టీ కార్యకర్తలతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇటీవల జరిగిన ఎన్నికల్లో రుద్రంగి గ్రామం నుండి గత ఎన్నికల కంటే ఈసారి మెజారిటీ ఓట్లను వేశారని గుర్తు చేశారు. రుద్రంగి గ్రామాన్ని దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తానన్నారు. ఇప్పటికే రుద్రంగి అభివృద్ధికి రూ.26 కోట్లను వెచ్చించడం జరిగిందన్నారు. నాగారం చెరువులో భూములు కోల్పోయిన కొంత మంది నిర్వాసితులకు త్వరలోనే నష్టపరిహారాన్ని అందిస్తామన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో టిఆర్‌ఎస్ పార్టీ అధిక సీట్లను గెలిచేవిధంగా ప్రతీ ఒక్కరు కృషి చేయాలన్నారు. అలాగే ఎంపి, ఎంపిటిసిలు, జడ్పీటీసీలు, సింగిల్‌విండో ఎన్నికల్లో కూడా ప్రభంజనం సృష్టించాలన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను స్థానిక గంగపుత్ర సంఘం నాయకులు తోకల తిరుమల్, రవి, గడ్డం మహేందర్, భూమేష్ తదితరులు చేపల వల, శాలువాలతో సన్మానించారు.

ఘనంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు
వేములవాడ, డిసెంబర్ 18: శ్రీరాజరాజేశ్వరస్వామి సన్నిధానంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు అత్యంత వైభవోపేతంగా జరిగాయి.మంగళవారం ఏకాదశిని పురస్కరించుకొని ఆలయాన్ని రంగురంగుల పూలతో అందంగా అలంకరించారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మంగళవాయిద్యాల మధ్య ఉత్సవమూర్తులను అద్దాల మండపంలోలు ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ అనంతపద్మనాభస్వామికి, రాజరాజేశ్వరస్వామికి వేదపండితులు అభిషేకాలను నిర్వహించారు. సహస్రనామార్చనలు, మంత్ర పుష్ఫం, వేదఘోష, మహదాశీర్వచనములు, సప్తహారతుల సమార్పణ తదితర పూజా కార్యక్రమాలు జరిగాయి.

ప్రసవాలు తగ్గితే అలవెన్స్‌లు కట్!
- జిల్లా వైద్యాధికారి రాంమనోహర్ రావు

కరీంనగర్, డిసెంబర్ 18: ప్రభుత్వాసుపత్రుల్లో ఇకపై ప్రసవాల సంఖ్య తగ్గితే అలవెన్స్‌లు కట్ చేయాల్సి ఉంటుందని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి రాంమనోహర్ రావు అన్నారు. మంగళవారం కరీంనగర్‌లో జిల్లాలోని వైద్యాధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వాసుపత్రుల్లో గత రెండు, మూడు నెలలుగా ప్రసవాల సంఖ్య తగ్గడానికి గల కారణాలు ఒకటి రెండుసార్లు సమీక్షించుకొని ప్రసవాల పెంపుకు కృషి చేయాలని ప్రాథమిక వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. జిల్లాలోని 16 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు, పర్యవేక్షక సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించడానికి గల కారణాలు ప్రభుత్వాసుపత్రుల్లో గత రెండు, మూడు నెలలుగా ప్రసవాలు తగ్గడంపై అధ్యయనం చేస్తూ పెంపొందించేందుకు మాతా,శిశు ఆరోగ్య కేంద్రాలకు గర్భవతులను ప్రసూతి కోసం పంపించాలని ఆదేశించారు.
లేనిచో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి, సూపర్‌వైజర్ ఇంటి అద్దె అలవెన్స్‌లు, ఇతర అలవెన్స్‌లు నిలిపివేయనున్నట్లు హెచ్చరించారు. పిహెచ్‌సిలు, సబ్‌సెంటర్‌ల నుంచి ప్రైవేటు ఆసుపత్రులకు ప్రసవాల కోసం పంపించినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. గర్భిణీలకు హిమోగ్లోబిన్ శాతం తక్కువ అయినట్లయితే ప్రత్యేక చర్యలు చేపట్టి పెంపుకు కృషి చేయాలని, నెలవారీగా ఈడిడి రూపొందించుకొని హైరిస్క్ కేసులను గుర్తించి గ్రామ ఆశా, ఆరోగ్య ఉపకేంద్ర ఎఎన్‌ఎంలు ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలన్నారు. వచ్చే నెల వరకు ప్రసవాల సంఖ్య ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో, మాతా, శిశు ఆరోగ్య కేంద్రాల్లో ఘననీయంగా పెంచకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి హెచ్చరించారు.