కరీంనగర్

ఉగ్రవాదుల దిష్టిబొమ్మ దగ్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెద్దపల్లి, ఫిబ్రవరి 15: కాశ్మీర్‌లోని అవంతిపుర రహదారిలో భారత సైనికులపై ఉగ్రదాడిని నిరసిస్తూ జవాన్లమృతికి కారణమైన ఉగ్రవాదుల దిష్టిబొమ్మను విశ్వహిందూ పరిషత్, భజరంగ్‌దళ్ ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా కేంద్రంలోని కమాన్‌కూడలిలో ఉగ్రవాదుల దిష్టిబొమ్మను దగ్దం చేశారు. అనంతరం పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాశ్మీర్‌లో జరిగిన ఆత్మహుతి దాడిలో వీర మరణం పొందిన జవాన్లకు ఆత్మశాంతి కలగాలని వేడుకున్నారు. ఈకార్యక్రమంలో జిల్లా సేవా ప్రముఖ్ రాపర్తి గోపి, దుర్గప్రసాద్, విష్ణు, శ్రీనివాస్, కుమార్, వంశీ, అరవింద్, సంతోష్, సురేష్, గోవర్థన్, శివకృష్ణ, రవి, లోకేష్, మహంతకృష్ణ, మధు, హిందూ వాహిని సాయిలు, తదితరులు పాల్గోన్నారు. అలాగే స్థానిక ఆదర్శకో ఆపరేటీవ్ సోసైటీ ఆధ్వర్యంలో ఉగ్రవాదుల దాడులలో అమరులైన అమరవీరులకు నివాళులర్పించారు. పెద్దపల్లి బ్రాంచ్‌లో రెండు నిమిషాలు వౌనం పాటించిన అనంతరం శ్రద్దాంజలి ఘటించారు. ఈకార్యక్రమంలో బ్రాంచ్ మేనేజర్ మహ్మద్ అన్వర్, కిషన్, అనిల్, గణేష్‌లతో పాటు పలువురు పాల్గోన్నారు.
పెద్దపల్లి రూరల్‌లో..
పెద్దపల్లి రూరల్: జమ్ముకాస్మీర్‌లో జరిగిన మానవ బింబు దాడిలో అశువులు బాసిన వీర జవాన్లకు మండలంలోని చందపల్లి గ్రామంలో సావిత్రి బాయ్ పూలే పెద్దపల్లి జిల్లా అధ్యక్షురాలు శిలారపు రజిత ఆధ్వర్యంలో గురవారం చందపల్లిలో నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో రజిత, శ్రీలత, ప్రత్యూష. యశోద, మల్లమ్మ, కమల, శ్రీలత, చంద్రకళ, వందన, కవిత తదితులు పాల్గొన్నారు.
ప్రభుత్వ కళాశాలలో విద్యార్థుల వౌనం
సుల్తానాబాద్, ఫిబ్రవరి 15: జమ్మూ-కాశ్మీర్‌లో పిఆర్‌పిఎఫ్ జవాన్లపై జరిగిన దాడిలో 43 మంది వీర జవానులు మృతి చెందడం బాధాకరమంటూ శుక్రవారం సుల్తానాబాద్ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు రెండు నిమిషాలు వౌనం పాటించి వారి ఆత్మకు శాంతి కలుగాలని భగవంతున్ని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ శ్రీ్ధర్ రావు, టిఆర్‌ఎస్ నాయకులు అయిల సాంబమూర్తి, బండి సంపత్ గౌడ్, లెక్చరర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.
సుల్తానాబాద్‌లో కొవ్వొత్తులతో ర్యాలీ
సుల్తానాబాద్: ఉగ్రవాదుల దాడిలో అసువులు బాసిన అమరజవాన్లకు శుక్రవారం రాత్రి సుల్తానాబాద్ తెలంగాణ చౌరస్తాలో పోలీసులు, అధికారులు, పట్టణ ప్రజలు, ముస్లీం నాయకులు ఘనంగా కొవ్వొత్తులతో నివాళులర్పించారు. అనంతరం తెలంగాణ చౌరస్తా నుండి బస్టాండ్ వరకు కొవ్వొత్తులతో శాంతి ర్యాలీ నిర్వహించారు. అలాగే సుల్తానాబాద్ శ్రీవాణి జూనియర్, డిగ్రీ కళాశాలలో విద్యార్థులు అమరజవాన్లకు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐ కె.రాజేష్, తహశీల్దార్ మదుసూధన్, ఎఎస్‌ఐ తిరుపతి, ఆర్‌ఐ రవీందర్, ఎంపిటిసి పల్లా సురేష్, కోడెం అజయ్, తుమ్మ రాజ్‌కుమార్, మెంగాని చంద్రశేఖర్, ఊషణ అనే్వష్, ముత్యం రమేష్, కొమ్ము చిన్న తిరుపతి, చిలగాని విశ్వనాథ్, కామని రాజేంద్ర ప్రసాద్, గుర్రం రాజయ్య, శెట్టి శ్రీనివాస్, డాక్టర్ ఖలీం, బైరగోని ప్రభాకర్, గంధం రాకేష్, ముస్లీం నాయకులు ఫరుూం, రఫీక్, అహ్మద్, పలువురు పాల్గొన్నారు. శ్రీవాణిలో జరిగిన కార్యక్రమంలో కరస్పాండెంట్ రేకులపల్లి విజయ్ కుమార్, ప్రిన్సిపాల్స్ బండారి కమలాకర్, సదానందం, వైస్ ప్రిన్సిపాల్ కుమార్, బాలు, చిలగాని విశ్వనాథ్, తుమ్మ రాజ్ కుమార్ పలువురు పాల్గొన్నారు.
కొదురుపాకలో మానవహారం
బోయినిపల్లి: జమ్మూ-కాశ్మీర్‌లో ముస్కర్ల దాడిలో మృతి చెందిన 44 మంది వీర జవాన్ల ఆత్మకు శాంతి చేకూరాలని ఘనంగా నివాళులర్పించారు. బోయినిపల్లి మండలం కొదురుపాక ఎక్స్ రోడ్‌పైన శుక్రవారం మానవహారం చేపట్టారు. జమ్మూ-కాశ్మీర్‌లో మృతి చెందిన మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ భారత సైన్యానికి ఆత్మస్థైర్యం కల్పించేందుకు, ముష్కరుల దాడిని తీవ్రంగా నిరసిస్తూ అరవింద విద్యాలయం విద్యార్థులు కొదురుపాక పురవీధులగుండా నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కరీంనగర్-కామారెడ్డి ప్రధాన రహదారిపై మానవహారం చేపట్టారు. కొవ్వొత్తులతో వీర జవాన్లకు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరాస్పండెంట్ కంది మమత, ఉపాధ్యాయులు, విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు.
వీణవంకలో..
వీణవంక: జమ్మూ-కాశ్మీర్‌లోని పుల్వామా ప్రాంతంలో గురువారం జరిగిన అమరవీరులపై దాడులు అమానుషమని పేర్కొంటూ శుక్రవారం వీణవంక మండలంలోని ఘన్ముక్ల ఉన్నత పాఠశాల విద్యార్థులు వౌనం పాటించి అమరులై జవానులకు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
గంగాధరలో..
గంగాధర: జమ్మూ-కాశ్మీర్‌లో మానవబాంబు దాడిలో అశువులు బాసిన అమరజవాన్లకు గంగాధర మండల కేంద్రంలో వివిధ వర్గాల ప్రజలు శుక్రవారం ఘనంగా నివాళులర్పించారు. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో అమరజవాన్ల చిత్రపటాల వద్ద మండల పార్టీ నాయకులతో పాటు స్థానిక ఎంపిటిసి పెర్క శ్రావణ్, కిసాన్‌మోర్చ జిల్లా ఉపాధ్యక్షుడు తూం నారాయణ, బిజెపి సీనియర్ నాయకులు గోపాల్ రెడ్డిల ఆధ్వర్యంలో అమరజవాన్లకు ఘనంగా నివాళులర్పించారు. అలాగే గంగాధర సర్పంచ్ మడ్లపల్లి గంగాధర్ ఆధ్వర్యంలో అమరజవాన్లకు కొవ్వొత్తుల ద్వారా నివాళులర్పించారు. అలాగే మండలంలోని వివిధ ప్రభుత్వ పాఠశాలలతో పాటు వివిధ సంఘాల ఆధ్వర్యంలో అమరజవాన్లకు ఘనంగా నివాళులర్పించారు. దేశం కోసం అసువులు బాసిన అమరజవాన్ల కుటుంబాలకు ప్రతీ ఒక్కరు అండగా నిలువాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని పలువురు వక్తలు కోరారు.

ఉపాధిహామీ పనులపై
కేంద్ర బృందం పరిశీలన

గంభీరావుపేట, ఫిబ్రవరి 15: గ్రామాల్లో జరుగుతున్న ఉపాధీహామీ పనులను శుక్రవారం పరిశీలించారు. కేంద్ర బృంద అధికారి సుధాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో మండల స్థాయి అధికారులు గంభీరావుపేట మండలంలోని నర్మాల, నాగంపేట, గోరంటాల, సముద్రలింగాపురం గ్రామాల్లో ఇప్పటీవరకు జరిగిన ఉపాధీహామి పనులను పర్యవేక్షించారు. ఇప్పటీవరకు జరిగిన పనుల రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా కేంద్ర బృంద అధికారి మాట్లాడుతూ గ్రామాల్లో ఉపాధీహామి పథకం ద్వారా అధికారులు సూచించిన పనులు కాకుండా, గ్రామంలో గ్రామ సభ నిర్వహించి తద్వారా అవసరమైన పనులను గుర్తించి ఉపాధీహామి ద్వారా పనులు చేసుకోవాలని సూచించారు. ఉపాధీహామీ పనుల్లో మహిళా సంఘాలు భాగస్వాములు కావాలని కోరారు. ఉపాధీహామి పథకం ద్వారా ప్రభుత్వం అందించే రూ. 175లు సరిపోతున్నాయా లేదాని అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా పనుల వద్ద తాగునీరు తదితర సౌకర్యాలు కల్పిస్తున్నారా లేదా అధికారుల నుండి ఏవైన ఇబ్బందులు వున్నాయాని పలువురిని వాకబుచేశారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఎడబోయిన రాజు, ఉపసర్పంచ్ పురం శోభారాణి, ఎంపీడీవో వంగ సురేందర్‌రెడ్డి పాల్గొన్నారు.

మోతె రిజర్వాయర్‌కు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు

రామడుగు, ఫిబ్రవరి 15: మోతె రిజర్వాయర్ నిర్మాణం వల్ల ఏర్పడే ముంపు నివారణకు రిజర్వాయర్ లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు సాగుతున్నాయని కరీంనగర్ పార్లమెంటు సభ్యులు వినోద్ కుమార్ అన్నారు. శుక్రవారం మండల సర్వసభ్య సమావేశం ఎంపిపి మార్కొండ కిష్టారెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన ఎంపి మాట్లాడుతూ 270 కోట్ల రూపాయల వ్యయంతో వరద కాలువకు నాలుగు తూములు ఏర్పాటు చేసి గ్రావిటీ ద్వారా నియోజకవర్గంలోని చెరువు, కుంటలు నింపి పల్లెలు సస్యశ్యామలంగా చేయడానికి ఆ వైపుగా ప్రణాళిక సిద్ధమైందని తెలిపారు. ఇందుకుగాను స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రజలు సహకరించాలని కోరారు. షానగర్, రామడుగు, దేశరాజుపల్లి, రుద్రారం గ్రామాల చెరువులు నింపుకొని పంటలు పండించుకునే విధంగా నారాయణపూర్ చెరువు నీటిని మోతె వాగులోకి వదలాలని, దేశరాజుపల్లి సర్పంచ్ కోల రమేష్ ఎంపి దృష్టికి తీసుకువచ్చారు. రామడుగు గ్రామంలోని విఠలేశ్వర వేణుగోపాల స్వామి దేవాలయ భూమిని కలిగేటి వీరయ్య అనే వ్యక్తి ఆక్రమించుకొని గుడి వద్దకు వెళ్లిన భక్తులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని గ్రామస్థులు ఈ సందర్భంగా ఎంపికి ఫిర్యాదు చేశారు. ఇటీవల ఎన్నికైన ఎమ్మెల్యేతో పాటు సర్పంచ్‌లను శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, జిల్లా పరిషత్ చైర్మన్ తుల ఉమ, గ్రంధాలయ చైర్మన్ ఏనుగు రవీందర్ రెడ్డి, తదితరులు ఉన్నారు.
ప్రారంభం కాని రెవెన్యూ కార్యాలయం
మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన రెవెన్యూ కార్యాలయం ఎంపి, ఎమ్మెల్యే చేతుల మీదుగా శుక్రవారం ప్రారంభించాల్సి ఉండగా, అనివార్య కారణాల వల్ల నిల్చిపోయింది. కాగా కలెక్టర్ సెలవులో ఉండటమే ప్రధాన కారణంగా చెప్పుకుంటున్నారు.