కరీంనగర్

శీఘ్రంగా.. రాజన్న దర్శనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేములవాడ, మార్చి 1 : భక్తుల పాలిట దక్షిణ కాశిగా పేరుగాంచిన శ్రీ రాజరాజేశ్వర స్వామి సన్నిధానం లో మార్చి మూడో తేది నుంచి మహా శివరాత్రి జాతర ప్రారంభం కానున్నది. వేడుకలకు వచ్చే భక్తులందరికి శీఘ్రంగా..సంతృప్తికరంగా శ్రీ లక్ష్మీ గణపతి స్వామి వారిని, శ్రీ రాజరాజేశ్వర స్వామి, శ్రీ రాజరాజేశ్వరి దేవి అమ్మవార్ల దర్శన భాగ్యం కల్పించడం లక్ష్యంగా చేసుకున్నట్లు అలయ ఈ,వోదూస రాజేశ్వర్ తెలిపారు. మూడురోజులపాటు జరిగే జాతర ఉత్సవాల సందర్భంగా సామాన్య భక్తులకు అవసరమైన అన్ని వసతులు కల్పించేలా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు వివరించారు.జాతర ఏర్పాట్ల గురించి ఇవో రాజేశ్వర్‌తో ఆంధ్రభూమి ముఖాముఖి నిర్వహించింది. ఏర్పాట్లు వివరాలు ఆయన మాటల్లో....
ప్రశ్న: మహా శివరాత్రికి జాతరకు మీ కార్యాచరణ ఏమిటీ?
ఈవో: మహాశివరాత్రి జాతర నిర్వహణకు రూ.1కోటి 50లక్షలతో బడ్డెట్ కేటాయింపునుకు దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు ఆదేశాలిచ్చారు. ఈ దఫా భక్తులు అధికంగా వచ్చే అవకాశం ఉంది.అందుకు అవసరమైయ్యే అన్ని వసతులను కల్పించాలన్న లక్ష్యంగా చేసుకున్నాం.జాతర పనుల ఏర్పాట్లు తుదిదశకు చేరుకున్నాయి.
ప్రశ్న: సామాన్య భక్తులకు ఎలాంటి వసతులు కల్పిస్తున్నారు?
ఈవో: సామాన్య భక్తులకు పెద్దపీట వేయాలని ఇప్పటికే దేవాదాయ శాఖ కమిషనర్,జిల్లా పాలనాధికారికి సూచించారు. ఉత్సవాలకు వచ్చే భక్తులకు పరిశుభ్రమైన నీటి అందుబాటులో ఉండటంతో పాటు గాలి,వెలుతురు వచ్చే క్యూలైన్ల ఏర్పాటు చేస్తున్నాం. ఉత్తర ద్వారం గుండా భక్తులు లోనికి వెళ్లగానే గరిష్ఠంగా 20నిమిషాల్లో భక్తులు దర్శనం చేసుకొని వచ్చేలా క్యూలైన్ల ఏర్పాట్లు చేస్తున్నాం.స్నాన ఘాట్టాలను పెంచాం. భక్తులు విశ్రాంతి తీసుకునే విధంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అన్ని శాఖల అధికారుల సమన్వయం,సహకారంతో అవసరమైన వసతులు కల్పించేందుకు సిద్దంగా ఉన్నాం.
ప్రశ్న: సాంస్కృతికోత్సవాల ప్రత్యేకతలు ఏమిటీ?
ఈవో: అధ్యాత్మిక చింతన కోసం భక్తుల కాలక్షేపం కోసం శివార్చన ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని గత సంవత్సరం మాదిరిగానే ఏర్పాట్లు చేస్తున్నాం. అధ్యాత్మికోపన్యాసాలు,పురాణ ప్రవచనాలు,చిన్నారులు నృత్యప్రదర్శనలు, ఓగ్గుప్రదర్శనలు,వినోదాత్మకంగా నిలిచే పలు కార్యక్రమాలు నిర్వహించనున్నాం.్భక్తులను ఆకట్టుకునేలా సాంస్కృతిక కార్యక్రమాలుంటాయి.
ప్రశ్న : సమన్వయ,సహకారాల్లో మీ ప్రణాళిక ఏమిటీ?
ఈవో: అన్ని శాఖల సమన్వయం ఎంతో అవసరం. ఇప్పటికే పోలీసులు,పురపాలక శాఖలతో పాటు అన్ని శాఖలతో తరచు సమీక్షాసమావేశాలను జరిపాం.జిల్లా పాలానాధికారితో పాటు ఎమ్మెల్యే రమేశ్‌లు వివిధ శాఖల అధికారులకు దిశానిర్ధేశం చేశారు. అందరి సహయ సహకారాలతో మహాశివరాత్రి జాతరను (మిగతా 3వ పేజీలో)

ఘనంగా చేపట్టాలనే లక్ష్యంగా చేసుకున్నామని తెలిపారు.
ప్రశ్న: శివరాత్రి సన్నాహాక సమావేశాలపై మీ కార్యాచరణ ప్రణాళిక ఎలా ఉంది?
ఇవో : మహాశివరాత్రి జాతర ఉత్సవాల్లో అత్యంత విశేషమైనది.మహాశివరాత్రి అందులోనూ సోమవారం వస్తున్నది.్భక్తులు ముక్కంటి దర్శనార్థం అధికంగా వచ్చే అవకాశం ఉంది. ప్రతీ ఒక్కరు శీఘ్రంగా,సంతృప్తికంగా స్వామివారిని దర్శించుకుని వళ్ళేలా చర్చలు చేపడుతున్నాం. ప్రస్తుతం లఘు దర్శనం ఏర్పాటు చేయాలి జిల్లా పాలానాధికారి సూచించారు. ఇందుకు తగ్గట్టుగా ప్రణాళికలు రూపొందించాం.

అభినందన్ విడుదలతో
ఘనంగా సంబురాలు
కరీంనగర్ టౌన్, మార్చి 1: ఓవైపు పాకిస్తాన్‌లో యుద్ధ మేఘాలు కుమ్మకుంటున్న తరుణంలో ప్రధాని మోదీ దెబ్బతోపాకిస్తాన్ దిగివచ్చి, భారత వాయుసేన పైలట్ అభినందన్‌ను విడుదల చేయటంతోనగరంలోపలు పార్టీలు, ప్రజాసంఘాల సంబురాలు అంబురాన్నంటాయి. పలు పార్టీలు, విద్యార్థి సంఘాలు, స్వచ్ఛంధ సంస్థలు, దేశభక్తుల ఆధ్వర్యంలో నగరంలోని తెలంగాణ చౌక్‌లో శుక్రవారం రాత్రి టపాసులు పేల్చి, మిఠాయిలు పంచారు. ఈసందర్భంగా బీజేపి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న బీజేపి రాష్ట్ర నాయకుడు బాస సత్యనారాయణరావు మాట్లాడుతూ, భారతదేశ పక్షాన నిలిచిన అమెరికా, చైనాల దౌత్య విజయాలతోవాయుసేనాని విక్రం అభినందన్ వర్థమాన్‌ను పాక్ విడుదల చేసిందన్నారు. దేశ చరిత్రలో భారత సైనికున్ని పాక్ విడుదల చేయటం మోదీ చేసిన తీవ్ర ఒత్తిడి మేరకు ప్రపంచ దేశాలను ఉగ్రవాద వ్యతిరేకంగా పోరాడే విధంగా నాయకత్వం వహించటం వలననే పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పోరాట యోధుడు అభినందన్‌ను విడుదల చేయక తప్పలేదన్నారు. ఈఘనత ప్రధాని నరేంద్ర మోదీదేనన్నారు. ప్రజల మద్ధతుతోనే ఇది సాధ్యమైందన్నారు. మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు రాపర్తి విజయ మాట్లాడుతూ, విక్రం అభినందన్ విడుదల కావటం దేశంలోని ప్రతి తల్లి తమ బిడ్డ రాకకోసం చూసినట్లుగా ఉందన్నారు. అభినందన్‌ను కన్నతల్లికి దేశం మొత్తం రుణపడి ఉందన్నారు. టీ ఆర్ ఎస్వీ జిల్లాశాఖ ఆధ్వర్యంలోస్థానిక తెలంగాణ చౌక్‌లోనిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు ఏనుగు రవీందర్‌రెడ్డి మాట్లాడుతూ, పాక్ కస్టడీ నుంచి వింగ్ కమాండర్ అభినందన్ విడుదల కావటం దేశ ప్రజలు సాధించిన గొప్ప విజయమన్నారు. అత్యంత ధైర్య సాహసాలతోఅనేక ఇబ్బందులకు గురైన ఆయన విడుదల పట్ల యావత్ దేశం సంబురాలు జరుపుకుంటుందన్నారు. ఈకార్యక్రమంలోటీ ఆర్ ఎస్వీ జిల్లా అధ్యక్షుడు ఫహాద్, నాయకులు యూసుఫ్, తిరుపతినాయక్, దాసరి వెంకటరెడ్డి, సందమల్ల రవితేజ, సుదర్శన్, కోల చందన్, రవివర్మ, తబ్రీస్,నరుూంతో పాటు పలువురు పాల్గొన్నారు. ఏబివిపి ఆధ్వర్యంలో నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు.

పాతూరి నామినేషన్

కరీంనగర్ టౌన్, మార్చి 1: పట్ట్భద్రుల, ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీలకు జరుగునున్న ఎన్నికలకు ఐదోరోజు ఆరు నామినేషన్లు దాఖలయ్యాయి. ఉపాధ్యాయ స్థానానికి ముగ్గురు,పట్ట్భద్రుల స్థానానికి ముగ్గురు అభ్యర్థులు ఎన్నికల అధికారులకు నామపత్రాలు సమర్పించారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి శాసన మండలి చీప్ విప్ పాతూరి సుధాకర్‌రెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్సీ బట్టాపురం మోహన్‌రెడ్డి, చిట్యాల రాములు, పట్ట్భద్రుల నియోజకవర్గ స్థానానికి రిటైర్డ్ జాయింట్ కలెక్టర్ కె.కృష్ణారెడ్డి, ప్రైవేట్ ఉపాధ్యాయ సంఘాల నేతలు షబ్బీర్ అలీ, వై.శేఖర్‌రావులు శుక్రవారం నామినేషన్లు వేశారు. అనంతరం నిర్వహించిన విలేఖరుల సమావేశంలోపలువురు అభ్యర్థులు మాట్లాడుతూ, తమను గెలిపిస్తే నిరుద్యోగ పట్ట్భద్రులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తామని, దీర్ఘకాలంగా నెలకొన్న ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి పెద్దపీట వేస్తామంటూ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థులు ప్రకటించారు. శాసన మండలి చీప్ విప్ పాతూరి సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ, తన ఉపాధ్యాయ నాయకత్వ జీవితంలో ఎన్నో జీవోలు తెచ్చి, ఉపాధ్యాయులకు సేవలందించినట్లు, అలాగే ఈసారి కూడా పదవీ విరమానంతరం ఉపాధ్యాయులకు గొడ్డలి పెట్టులా మారిన కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం పథకాన్ని రద్దు చేసి, ఓల్డ్ పెన్షన్ స్కీం అమలు చేసేందుకు కృషి చేస్తానని ప్రకటించారు. 18 ఉపాధ్యాయ సంఘాలు, 8 అధ్యాపక సంఘాల మద్ధతుతో మరోసారి ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా గెలిచితీరుతానని స్పష్టం చేశారు. మోడల్ స్కూల్ ఉపాధ్యాయుల వేతనాలు 010 పద్దుకింద ట్రెజరీ ద్వారా వేతనాలు చెల్లించేందుకు తగిన చర్యలు చేపట్టేలా పోరాటం చేయనున్నట్లు స్పష్టం చేశారు. తనకు కేటాయించే అభివృద్ధి నిధులు ఉపాధ్యాయ శిక్షణా కేంద్రాల నిర్మాణానికే విడుదల చేసినట్లు, విద్యారంగ అభివృద్ధి కోసం మరో ఆరేళ్ళ పాటు తన జీవితాన్ని దారబోసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు.