కరీంనగర్

ఎత్తులు.. పై ఎత్తులు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, మార్చి 13: పట్ట్భద్రులు, ఉపాధ్యాయ శాసనమండలి ఎన్నికల పోరు ఉమ్మడి నియోజకవర్గ పరిధిలోజోరందుకుంది. గెలుపే లక్ష్యంగా అభ్యర్థులు ఎవరి యత్నాల్లో వారు మునిగి తేలుతున్నారు. ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ, ఓటర్లకు హామీల వర్షం కురిపిస్తున్నారు. స్వతంత్ర అభ్యర్థులతో పాటు, ప్రధాన పార్టీల మద్ధతుతో బరిలోకి దిగిన వారంతా సొంత ఏజెండా, వ్యక్తిగత మేనిఫెస్టోలు ప్రకటిస్తూ గెలుపుకోసం తండ్లాడుతున్నారు. రెండు వేర్వేరు స్థానాలకు జరుగుతున్న పోటీలో ఉపాధ్యాయ స్థానంపై అంతగా దృష్టి సారించలేకపోతుండగా, పట్ట్భద్రుల స్థానం మాత్రం ప్రతిష్టాత్మకంగా మారింది. రెండు ప్రధాన జాతీయ పార్టీలు బలపర్చిన అభ్యర్థులతో పాటు, అధికార తెరాస మద్ధతుతోపోటీలో నిలిచిన మరో అభ్యర్థి, యువతెలంగాణ అభ్యర్థుల మద్యే ప్రధాన పోటీ నెలకొంది. గెలుపుపై ధీమాను వ్యక్తం చేస్తున్న అభ్యర్థులు పక్కా ప్రణాళికతో పట్ట్భద్రుల ఓట్లు పొందేందుకు వ్యూహాలు రూపొందించుకుంటున్నారు. గత పక్షం రోజులుగా తీవ్రమైన ప్రచారంలో బీజేపి అభ్యర్థి ఒకడుగు ముందు వరుసలో ఉండగా, ఇప్పటికే ఉమ్మడి నాలుగు జిల్లాల పరిధిలో80శాతానికి పైగా ఓటర్లను కలిసినట్లు ఆపార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. పోలింగ్ బూత్‌ల వారీగా 300లకు పైగా మండలాల్లో సమావేశాలు నిర్వహించినట్లు ఆ పార్టీ అభ్యర్థి పొల్సాని సుగుణాకర్‌రావు ప్రకటించారు. సుదీర్ఘ రాజకీయ అనుభవానికి తోడు, అనేక ఉద్యమాల్లో ప్రత్యక్షంగా పాల్గొని క్షేత్రస్థాయిలో సైతం పేరు సంపాదించారు. ఈధీమాతోనే ఈ ఎన్నికల్లో తన గెలుపు ఖాయమంటూ తేల్చి చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ అరాచకాలతో ఏకపక్ష పాలన కొనసాగుతున్న తరుణంలో, ప్రశ్నించే గొంతుకగా మారేందుకు మండలి బరిలోకి దిగినట్లు వెల్లడిస్తున్న కాంత్రెస్ అభ్యర్థి, మాజీ మంత్రి తాటిపర్తి జీవన్‌రెడ్డి కూడా గెలుపుపై భరోసాతో ప్రచారం సాగిస్తున్నారు. ఎదుటి వ్యక్తులు చేస్తున్న ఆరోపణలు తిప్పికొడుతూ, గెలిస్తే తాను చేయబోయే పనులపై కర,గోడ ప్రతుల ద్వారా విస్తృత ప్రచారం సాగిస్తున్నారు. తెలంగాణ ఉద్యమంపై తన వ్యాఖ్యానాలతో, తన పంచ్ డైలాగులతో ఉద్యమ ద్రోహులను ఆటాడుకున్న మహిళా జర్నలిస్టుగోగినేని రాణి రుద్రమదేవి గెలుపే ధ్యేయంగా వినూత్నంగా ప్రచారం సాగిస్తున్నారు. నిత్యం రెండు నుంచి మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పట్ట్భద్రులను కలుస్తూ, తన ఏజెండా వివరిస్తూ మద్ధతు కూడగడుతున్నారు. ముఖ్యంగా యువజనులు, నిరుద్యోగుల మద్ధతు రోజురోజుకు పెరుగుతుంది. తెరాస మద్ధతుతోతన ఉద్యోగానికి రాజీనామా చేసి, మండలి పోరులో నిలిచిన ఎం.చంద్రశేఖర్ గౌడ్ గెలుపు నాదేనంటూ ప్రచారం సాగిస్తున్నారు. సీ ఎం కేసీ ఆర్ అండదండలతో పెద్దల సభకు పోటీ చేస్తున్నట్లు ప్రకటించగా, తన గెలుపుకోసం అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపిలు, స్థానిక ప్రజాప్రతినిధులు సంయుక్తంగా ప్రయత్నాలు చేస్తున్నారని, దీనికితోడు ప్రభుత్వ సంక్షేమ పథకాలు గెలుపుకు బోనస్‌గా మారబోతున్నాయని, ఇప్పటికే ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేసిన దృష్ట్యా నా విజయం నల్లేరుపై నడకలా ముందుకు సాగుతుందనే విశ్వాసంతో ఉన్నారు. ఈనేపథ్యంలో మండలి పోరులోకరీంనగర్ పట్ట్భద్రుల స్థానం అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది.

పార్లమెంటు ఎన్నికలలో టిఆర్‌ఎస్‌కు పోటీ లేదు
* కరీంనగర్ ఎంపిగా భారీ మెజారిటీతో గెలిపించుకుంటాం
* ఎమ్మెల్యే సుంకె రవిశంకర్
గంగాధర, మార్చి 13: రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థులకు వచ్చే పార్లమెంటు ఎన్నికలలో కాంగ్రెస్, బిజెపి పార్టీల నుండి సరి తూగే అభ్యర్థులు ఎవరు లేరని, వచ్చే పార్లమెంటు ఎన్నికలలో కరీంనగర్ ఎంపిగా బోయినిపల్లి వినోద్ కుమార్‌ను భారీ మెజారిటీతో గెలిపిస్తామని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అన్నారు. బుధవారం గంగాధరలో చొప్పదండి నియోజకవర్గ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఎమ్మెల్యే రవిశంకర్‌తో పాటు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌లు మాట్లాడుతూ టిఆర్‌ఎస్‌కు టిఆర్‌ఎస్సే పోటీ అని, ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికలలో సాధించిన మెజారిటీ కన్నా డబుల్ మెజారిటీని పార్లమెంటు ఎన్నికలలో సాధించుకోవాల్సిన అవసరం పార్టీ కార్యకర్తలపైన ఉందన్నారు. ఎంపి స్థానాలను పోటీ చేయడానికి ప్రతిపక్షాలకు అభ్యర్థులే లేరని వారు పేర్కొన్నారు. ఆదర్శవంతమైన పాలన అందిస్తున్న కేసిఆర్ పట్ల ప్రజల్లో పూర్తి విశ్వాసం ఉందని, కార్యకర్తలు ప్రజలకు మరింత చేరువ కావాలన్నారు. ఈ నెల 17న కరీంనగర్‌లో జరిగే ముఖ్యమంత్రి కేసిఆర్ బహిరంగ సభకు చొప్పదండి నియోజకవర్గం నుండి 40 వేల మందిని తరలించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టడం జరిగిందన్నారు. కార్యకర్తలను బహిరంగ సభకు తరలించిన విధంగానే ఇంటికి చేర్చాల్సిన బాధ్యత నాయకులపైన ఉందన్నారు. చొప్పదండి నియోజకవర్గంలోని గంగాధర, రామడుగు, కొడిమ్యాల మండలాల్లో రైతులు సాగు చేసిన పంటలు ఎండిపోకుండా ఎల్లంపల్లి ప్రాజెక్టు నుండి నారాయణపూర్ రిజర్వాయర్‌కు ఒక టిఎంసి నీటిని విడుదల చేసి పంటలు కాపాడిన ముఖ్యమంత్రికి సమావేశంలో కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ చెన్నాడి సుధాకర్ రావు, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ ఏనుగు రవీందర్ రెడ్డి, జడ్పీటీసీలు సాంబయ్య, శ్రీలత, లచ్చిరెడ్డి, ఎంపిపిలు మాధవ్, శ్రీలత, సింగిల్‌విండో చైర్మన్లు వీర్ల వెంకటేశ్వర్ రావు, మురళీకృష్ణా రెడ్డి, రైతు సమన్వయ కమిటి అధ్యక్షులు వెల్మ మల్లారెడ్డి, పుల్కం గంగన్నతో పాటు సాగి మహిపాల్ రావు, కృష్ణా రావు తదితర చొప్పదండి నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సర్వం సిద్ధం
* పది పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి
* ప్రశాంత వాతావరణంలో పరీక్షల నిర్వహణ
* 5నిమిషాల ఆలస్యమైనా అనుమతి
* సమస్యాత్మక కేంద్రాల వద్ద ప్రత్యేక చర్యలు
* కేంద్రాల్లో 144సెక్షన్ అమలు
కరీంనగర్ టౌన్, మార్చి 13: ఈనెల 16నుంచి నిర్వహించనున్న పదో తరగతి పరీక్షల కోసం జిల్లా విద్యాశాఖ సర్వం సిద్ధం చేసింది. ప్రశాంత వాతావరణంలోసజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు అధికార యంత్రాంగం వెల్లడిస్తోంది. వేసవికాలం సమీపిస్తున్న నేపథ్యంలో విద్యార్థుల కోసం తాగునీటి వసతి, కేంద్రాల్లో వైద్య బృందాలు, గదుల్లో చీకట్లు తొలగించేందుకు విద్యుత్ దీపాల ఏర్పాటు, తదితర చర్యలు పూర్తి చేసినట్లు అధికారులు పేర్కొంటున్నారు. పరీక్షలు పకడ్భందీగా నిర్వహించేందుకు ప్లయింగ్, సిటింగ్ స్వ్కాడ్‌లను ప్రతి కేంద్రంలో ఏర్పాటు చేస్తున్నట్లు, సమస్యాత్మక కేంద్రాల్లో ప్రత్యేక బృందాలు నియమించినట్లు, ప్రతి కేంద్రంపై ప్రత్యేక పర్యవేక్షణ కొనసాగుతుందని, జిల్లా విద్యాధికారితో పాటు మండల తహసీల్దార్ కూడా పరీక్ష కేంద్రాలు తనిఖీ చేసేలా ఉన్నతాధికారులు ఆదేశాలు జారీచేశారు. కేంద్రాల్లోకి విద్యార్థులు, ఇన్విజిలేటర్లు, ఇతర సిబ్బంది సెల్‌ఫోన్‌లు తీసుకెళ్ళటం నిషేదించగా, ఎక్కడా మాస్ కాపీయింగ్ జరుగకుండా పటిష్టమైన చర్యలు చేపట్టారు. మాస్‌కాపీయింగ్ జరిగితే ఆయా కేంద్రంలోవిధులు నిర్వహించే చీఫ్ సూపరెండెంట్‌లే బాధ్యత వహించాలనే ఆదేశాలు జారీ అయ్యాయి. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు పరీక్షలు జరుగనుండగా, 5నిమిషాలు ఆలస్యమైనా విద్యార్థులను పరీక్ష కేంద్రంలోనికి అనుమతించనున్నారు. ఈసారి జిల్లావ్యాప్తంగా 14,200మంది విద్యార్థులు హాజరుకానుండగా, వీరిలో బాలురు 7,522మంది, బాలికలు 6,678మంది బాలికలున్నారు. కాగా, ప్రైవేట్ పాఠశాలల నుంచి 7,615మంది పరీక్ష రాయనుండగా, ప్రభుత్వ పాఠశాలల నుంచి 6,585మంది ఉన్నారు. వీరితో పాటు 617మంది ప్రైవేట్‌గా పరీక్ష హాజరుకాబోతున్నారు. వీరికోసం 71 కేంద్రాలు ఏర్పాటు చేశారు. వీటిలో కరీంనగర్ డివిజన్ పరిధిలో49, హుజురాబాద్ పరిధిలో22 కేంద్రాలున్నాయి. పరీక్షల నిర్వహణ కోసం 71మంది చీఫ్ సూపరెండెంట్లు, 71మంది డిపార్టుమెంటల్ అధికారులు, ఒక రాష్ట్ర స్థాయి పరిశీలకుడు, 5ప్లయింగ్ స్క్వాడ్ బృందాలు, 17మంది కస్టోడియన్‌లు, 637మంది ఇన్విజిలేటర్లను నియమించారు. వీరందరికి ఈనెల 10వ తేదీనే ఉత్తర్వులు జారీ చేయగా, పరీక్షల నిర్వహణపై శిక్షణ కూడా అందజేశారు. ఎలాంటి అవకతవకలు, అవాంఛనీయ సంఘటనలు, మాస్ కాపీయింగ్ లాంటి ఘటనలకు తావివ్వకుండా పకడ్బంధీగా పరీక్షలు నిర్వహిస్తే, విద్యార్థుల్లోని ప్రతిభ వెలికితీయటంతోపాటు, విద్యాబోధనలో జిల్లాస్థానం గుర్తించవచ్చనే భావనతోనే జిల్లా యంత్రాంగం గట్టి చర్యలకు దిగినట్లు విద్యాశాఖ వర్గాలు పేర్కొంటున్నాయి.

తెలంగాణ వరప్రదాయిని ఎస్సారెస్పీ

* ఎడారి కాకుండా నాడు పోరు
* బాబ్లీపై నిర్మాణాలకు వ్యతిరేకంగా ధర్నా
* ధర్మాబాద్ కోర్టుకు హాజరమయ్యాం
* న్యాయస్థానం తీర్పును గౌరవిస్తాం
* కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్

కరీంనగర్, మార్చి 13: తెలంగాణ ప్రాంత రైతుల భూములు ఎడారిగా మారుతుండడం చూస్తూ ఉండలేక ఆనాడు బాబ్లీ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ధర్నా చేశామని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. తెలంగాణకు వరదాయిని అయిన శ్రీరాంసాగర్ ప్రాజెక్టు వరద రాకుండా బాబ్లీపై నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టులకు నిర్మాణానికి వ్యతిరేకంగా ధర్నా చేపట్టడం జరిగిందని ఆనాడు అక్రమంగా లాఠీచార్జ్ చేసి తీవ్రంగా గాయపరిచారని, శ్రీరాంసాగర్ పైన ఆధారపడి ఉన్న లోయర్ మానేర్ డ్యాం మిడ్‌మానేర్ ప్రాజెక్టులకు నీరు రాకుండా అడ్డుపడ్డారని ముఖ్యమంత్రి సూచన మేరకు బుధవారం ధర్మాబాద్ కోర్టుకు హాజరయ్యామన్నారు. ఎనిమిదేళ్ల కింద నాన్ బెయిలబుల్ వారంట్ జారీ చేయడం దారుణమని అన్నారు. బాబ్లీ కేసులో ధర్మాబాద్ కోర్టుకు హాజరైన కరీంనగర్, రాజేంద్రనగర్, జక్కల్ ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, ప్రకాష్ గౌడ్, హన్మంత్ షిండే, మాజీ ఎమ్మెల్యేలు చింతకుంట విజయరమణారావు, కె.ఎస్.రత్నం తదితరులు మహారాష్టల్రోని వివాదాస్పద ప్రాజెక్టు బాబ్లీ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ధర్నా చేసేందుకు వెళ్లిన వారిలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబుతో పాటు గంగుల కమలాకర్, మరో 14 మందికి ధర్మాబాద్ కోర్టు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. గత సంవత్సరం డిసెంబర్ 21న మహారాష్టల్రోని ధర్మాబాద్ కోర్టుకు హాజరయ్యారు. బాబ్లీ ప్రాజెక్టు నిర్మాణం చేపడితే ఉత్తర తెలంగాణ ఎడారి అవుతుందనే ఉద్ధేశంతో ఆనాడు ఆందోళనకు దిగిన తెలుగుదేశం పార్టీ నాయకులపై మహారాష్ట్ర ప్రభుత్వం కేసులు నమోదు చేసిందని అన్నారు. గోదావరి నదిపై శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఎగువన మహారాష్ట్ర ప్రభుత్వం బాబ్లీ గ్రామం వద్ద 2005లో బాబ్లీ ప్రాజెక్టుకు నిర్మాణం తలపెట్టిందని, బాబ్లీతో పాటు 14 చిన్న, మధ్య తరహా ప్రాజెక్టులను మహారాష్ట్ర సర్కార్ నిర్మాణం చేపట్టిందని ఓ వైపు న్యాయస్థానంలో కొనసాగుతుండగానే మరోవైపు రాజకీయంగా తీవ్ర వివాదాస్పదమైందని తెలిపారు. దీంతో బాబ్లీ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా 2010 జూలై 16న బాబ్లీ సందర్శనకు అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకులు చంద్రబాబుతోపాటు టిడిపి నేతలు వెళ్లారు. అయితే బాబ్లీ పరిసరాలలో మహారాష్ట్ర ప్రభుత్వం 144 సెక్షన్ విధించడంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయన్నారు. మహారాష్ట్ర పోలీసులు, చంద్రబాబు సహా నేతలందరినీ అరెస్ట్ చేసి ధర్మాబాద్ ఐటిఐకి తరలించారు. అక్కడ కనీస సౌకర్యాలు కూడా కల్పించలేదన్నారు. దీంతో అప్పట్లో సరిహద్దువరకు తరలివచ్చిన టిడిపి కార్యకర్తలపై లాఠీ చార్జి చేశారు. ఈ లాఠీచార్జిలో తీవ్ర గాయపడగా ఉమ్మడి ఏపి రాష్ట్ర భూ భాగంలోకి చొరబడి ప్రజలను చితకబాదిన ఘటన పెద్ద సంచలనంగా మారిందని,అయితే నేతలపై కేసులు ఏమీ పెట్టలేదని చెప్పి ప్రత్యేక విమానంలో తెలుగుదేశం నేతలను హైదరాబాద్‌కు తరలించారని వెల్లడించారు. కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ వెంట టిఆర్‌ఎస్ నాయకులు నందెల్లి మహిపాల్, ప్రేమ్‌కుమార్ ముందాడ, అనీల్ కుమార్ తదితరులు ఉన్నారు.

పాఠశాలలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం చేయరాదు

* జాయింట్ కలెక్టర్ శ్యామ్ ప్రసాద్‌లాల్

కరీంనగర్, మార్చి 13: మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ టీచర్స్, పట్ట్భద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం పాఠశాలలో, వసతి గృహాలలో, ప్రభుత్వ స్థలాలలో చేయరాదని జాయింట్ కలెక్టర్ శ్యామ్ ప్రసాద్‌లాల్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. పాఠశాలలో, ప్రభుత్వ మైదానాలలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం చేసినచో, ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన కిందకు వస్తుందని, కోడ్ ఉల్లంఘన కింద చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఆయన ఆ ప్రకటనలో తెలిపారు. కొందరు ప్రభుత్వ ఉపాధ్యాయులు, టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థులకు అనుకూలంగా ప్రచారం చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, ప్రభుత్వ ఉపాధ్యాయులు ఎన్నికల బరిలో ఏ అభ్యర్థికి అనుకూలంగా ప్రచారం నిర్వహించరాదని, ప్రచారంలో పాల్గొంటే అట్టి ఉపాధ్యాయులను ఫ్లయింగ్ స్క్వాడ్స్, సర్లేలెన్స్ టీమ్‌లు, వీడియో సర్వేలెన్స్ టీమ్‌ల ద్వారా గుర్తించి క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని జాయింట్ కలెక్టర్ ఆ ప్రకటనలో హెచ్చరించారు.