కరీంనగర్

ప్రజలు కరువుతో అల్లాడుతున్నా పట్టించుకోని ప్రభుత్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సుల్తానాబాద్, మే 13: ప్రజలు కరువుతో అల్లాడుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం విచారకరమని, కరువు మండలాలుగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఈ నె 16న మండల కేంధ్రాల్లోని తహశీల్దార్ కార్యాలయం ఎదుట టిడిపి ఆధ్వర్యంలో పెద్దఎత్తున ధర్నాలు చేపట్టడం జరుగుతుందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు చింతకుంట విజయరమణారావు అన్నారు. శుక్రవారం సుల్తానాబాద్‌లో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ సాగు, తాగునీరు లేక ప్రజలు అల్లాడుతున్నా పట్టించుకోవడం లేదన్నారు. కరువు బారిన పడిన రైతులను ఆదుకోవాలన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ఈ జిల్లా నుండి నీళ్లను తీసుకెళ్తూ మెదక్, ఖమ్మం, గజ్వేల్‌లో చెరువులను నీటితో నింపుతూ జిల్లాను ఎడారిగా మారుస్తున్నారన్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు నుండి పెద్దపల్లి నియోజకవర్గంతో పాటు జిల్లాలోని అన్ని చెరువులు, కుంటలు నింపాలన్నారు. అలాగే కరువు సహాయక చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. కరువును నిరసిస్తూ ఈ నెల 16న చేపట్టనున్న ధర్నాలను విజయవంతం చేయాలని విజయరమణారావు పిలుపునిచ్చారు. సమావేశంలో సాయిరి మహేందర్, పాల రామారావు, పన్నాల రాములు, అమిరిశెట్టి రాజలింగం, వెగోళం అబ్బయ్యగౌడ్ పాల్గొన్నారు.