కరీంనగర్

నిమిషం ఆలస్యమైనా అంతే..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్ టౌన్, మే 13: ఈనెల 15న నిర్వహించనున్న ఎంసెట్‌కు హాజరయ్యే విద్యార్థులు ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రంలోనికి అనుమతించబోమని కో ఆర్డినేటర్ టి.పాపారావు స్పష్టం చేశారు. శుక్రవారం నిర్వహించిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ, ఆదివారం జరిగే పరీక్షకు ఎలాంటి అవాంతరాలు లేకుండా సజావుగా కొనసాగేలా చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. ఇంజనీరింగ్‌లో 11,816 మంది, అగ్రికల్చర్, మెడిసిన్ విభాగంలో 6,203 మంది విద్యార్థులు హాజరుకానున్నారని, వీరికోసం జిల్లాలో 37 పరీక్ష కేంద్రాలు ఏర్పాటుచేసినట్లు వెల్లడించారు. ఇంజనీరింగ్ కోసం 24, అగ్రికల్చర్, మెడిసిన్ కోసం 13 కేంద్రాలున్నాయన్నారు. ప్రైవేట్ విద్యాసంస్థల సహాయ నిరాకరణ నేపథ్యంలో జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్ విద్యాసంస్థల్లో ఎంసెట్ నిర్వహణకు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్ష ఉదయం 10గంటలనుంచి 1గంటవరకు అగ్రికల్చర్,మెడిసిన్ ప్రవేశపరీక్ష మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు జరుగుతుందని, విద్యార్థులు పరీక్ష సమయానికి గంటముందే కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. పరీక్షలో బ్లూలేదా బ్లాక్ బాల్‌పెన్ను మాత్రమే ఉపయోగించాలని, తప్పనిసరి హాల్‌టికెట్, ఆన్‌లైన్ అప్లికేషన్‌ఫామ్, గుర్తింపుకార్డు, షెకు,షెతెలకు చెందిన విద్యార్థులు కులదృవీకరణ పత్రాల జిరాక్స్ ప్రతులు తమవెంట తెచ్చుకోవాలన్నారు. ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులులోనికి అనుమతించబడవని, విద్యార్థుల సౌకర్యార్థం జిల్లాలోని అన్ని బస్‌స్టేషన లనుంచి పరీక్షకేంద్రాలకు బస్సు సౌకర్యం కల్పించినట్లు వివరించారు.