కరీంనగర్

‘సెస్’లో రూ.78 కోట్లతో అభివృద్ధి ప్రణాళిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిరిసిల్ల, మే 13: సిరిసిల్ల సహకార విద్యుత్ సరఫరా సంస్థ(సెస్) పరిధిలో అభివృద్ది పనులకు రూ.78 కోట్లతో ప్రణాళిక రూపొందించారు. సెస్ అభివృద్ది కార్యకలాపాలపై ఈనెల 17న రాష్ట్ర ఐటి, మున్సిపల్ శాఖా మంత్రి కె.తారకరామారావు సమీక్షా సమావేశం నిర్వహిస్తున్న నేపథ్యంలో ముందస్తుగా సెస్ పాలక మండలి శుక్రవారం సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా మంత్రి కెటి ఆర్ వ్యక్తిగత కార్యదర్శి కె.శ్రీనివాస్ ఈ సమావేశానికి హాజరై మంత్రి ముందుకు తీసుకరావల్సిన అంశాలపై చర్చించారు. సెస్ చైర్మన్ డి.లక్ష్మారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. సెస్ పరిధిలో విద్యుత్ అంతరాయాలు, లోవోల్టేజీ సమస్య తీర్చడానికి 750 కొత్త ట్రాన్స్‌ఫార్మర్లను కొనుగోలు చేయనున్నట్టు చైర్మన్ వెల్లడించారు. అలాగే సెస్ పరిధిలోని తొమ్మిది మండలాలలో స్వంత భవణాలు నిర్మించాలని నిర్ణయించారు. ఇప్పటికే మండల కేంద్రాలలో స్వంత భవణాలతో సెస్ సేవాకేంద్రాలు ఉన్నందున అవి ప్రస్తుతం పాత పడగా, ఎల్లారెడ్డిపేట లాంటి కేంద్రంలో భవనం లేదు. ఈ స్థితిలో అన్ని మండలాలల్లో సెస్ భవణాలు నిర్మించాలని నిర్ణయించారు. సిరిసిల్ల సెస్ స్టోర్స్‌లో సిసి కెమెరాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అలాగే పాత విద్యుత్ స్థంబాలు తుప్పి పట్టిపోయినందున వాటిని తొలగించి కొత్తవి వేయాలని, అలాగే అవసరమైన చోట కొత్తగా పోల్సు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇంకా మంత్రి ముందుకు తీసుకోవాల్సిన అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశంలో మంత్రి వ్యక్తిగత కార్యదర్శి కె.శ్రీనివాస్, సెస్ చైర్మన్ లక్ష్మారెడ్డి, వైస్ చైర్మన్ లగిశెట్టి శ్రీనివాస్, పాలకమండలి సభ్యులు దేవేందర్ యాదవ్, కుంబాల మల్లారెడ్డి, సెస్ మేనేజింగ్ డైరెక్టర్ నాంపల్లి గుట్ట పాల్గొన్నారు.