కరీంనగర్

త్వరలోనే మిషన్ భగీరథ ద్వారా నీటి సరఫరా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామగుండం, మే 13: సింగరేణి బొగ్గు గని కార్మిక వాడల్లో కలుషిత నీటి సరఫరాతో ఒక్క సారిగా వందలాది మంది అతిసార ప్రబలి ఆసుపత్రి పాలు కావడంతో సింగరేణి యాజమాన్యం ఈ ఘటనను సీరియస్‌గా తీసుకుంది. గోదావరిఖని కార్మిక వాడల్లోని గృహాలకు స్వచ్ఛమైన గోదావరి నీటిని సరఫరా చేసేందుకు సిద్ధమవుతుంది. త్వరలోనే గోదావరిఖనిలోని బొగ్గు గని కార్మిక కుటుంబాలకు మిషన్ భగీరథ ద్వారా స్వచ్ఛమైన గోదావరి నీటిని రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆర్జీ-1 సిజి ఎం సిహెచ్.వెంకటేశ్వర్ రావు తెలిపారు. శుక్రవారం గోదావరిఖనిలోని సింగరేణి సిజి ఎం కాన్ఫరెన్స్ హాల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుంచి సింగరేణికి 2 టి ఎంసిల నీరు సరఫరా కోసం ఒప్పందం జరిగిందని, రామగుండం పట్టణ సమీపంలో మున్సిపల్ కార్పొరేషన్ వాటర్ గ్రిడ్ ద్వారా ఏర్పాటు చేసుకుంటున్న పంప్ హౌస్ నుంచి సింగరేణి కార్మిక కుటుంబాలకు కూడా తాగునీటిని సరఫరా చేసేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు పేర్కొన్నారు. గోదావరిఖనిలోని కార్మిక వాడలకు సింగరేణి నుంచి సరఫరా అయిన తాగునీరు ఎలాంటి కలుషితమైన నీరు కాదని, ఆర్‌డబ్ల్యూ ఎస్ జరిపిన పరీక్షల్లో తేటతెల్లమయిందని, అయినప్పటికీ కార్మిక కుటుంబాలకు ఇస్తున్న తాగునీటి పైప్‌లైన్ కనెక్షన్లకు అక్రమంగా వేలాదిగా పైప్‌లైన్లు ఏర్పాటు చేసుకున్నారని, దీని మూలంగానే ఏదైనా లీకేజీ జరిగి ఈ సమస్య తలెత్తి ఉంటుందన్న భావన వ్యక్తం చేశారు. అయితే తాత్కలికంగా సింగరేణి కార్మిక కుటుంబాలు కంపెనీ సరఫరా చేస్తున్న నీటిని తాగునీటికి తప్ప, ఇతరత్రా అవసరాలకు వినియోగించుకోవాలని, త్వరలోనే సమస్యలన్నింటిని పరిష్కరించి శాశ్వతంగా కార్మిక గృహాలకు తాగునీటి సరఫరా జరిగేలా చర్యలు తీసుకుంటామని, అప్పటి వరకు ట్యాంకర్ల ద్వారా మంచినీటి సరఫరా జరుగుతుందని వివరించారు. విలేకరుల సమావేశంలో పర్సనల్ మేనేజర్ శ్రీనివాస్, సివిల్ డిపార్ట్‌మెంట్ అధికారి సూర్య నారాయణతోపాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.