కరీంనగర్

అసంతృప్తిలో జడ్పీటిసిలు...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, మే 31: తమకు ప్రాధాన్యత లేదని, నిధులు కూడా రావడం లేదంటూ గతకొంతకాలంగా అసంతృప్తితో ఉన్న జడ్పీటిసిలు మంగళవారం నాటి జడ్పీ సర్వసభ్య సమావేశానికి హాజరుకాకపోవడంతో సర్వసభ్య సమావేశం వాయిదా పడింది. 10.30 గంటలకు ప్రారంభం కావాల్సిన సర్వసభ్య సమావేశం 11 గంటల వరకు వేచి ఉన్నా జగిత్యాల ఎమ్మెల్యే జీవన్ రెడ్డితోపాటు 15మంది జడ్పీటిసి సభ్యులు మాత్రమే హాజరయ్యారు. దీంతో జడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ సమావేశాన్ని గంటసేపు వాయిదా వేశారు. తిరిగి మధ్యాహ్నం 12 గంటలకు సమావేశాన్ని ప్రారంభించగా, అప్పటికీ సభ్యులు రాకపోవడంతో కోరం లేని కారణంగా సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు జడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ ప్రకటించారు. మళ్లీ సమావేశ తేదీలను ప్రకటించనున్నట్లు ఆమె తెలిపారు. వాస్తవానికి గత సర్వసభ్య సమావేశాన్ని జడ్పీటిసిలు బైకాట్ చేయగా, జడ్పీ చైర్‌పర్సన్ తులఉమ వారికి నచ్చజెప్పడంతో వారు సమావేశానికి హాజరుకావడంతో ఆరోజు సభ కొనసాగిన సంగతి విధితమే.
వాయిదా వేయడం సిగ్గుచేటు: ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి
రైతులు జడ్పీ సర్వసభ్య సమావేశంపై ఎంతో ఆశగా ఎదురుచూస్తే, కోరం లేక సమావేశం వాయిదా వేయడం సిగ్గుచేటని సీనియర్ కాంగ్రెస్ నేత, జగిత్యాల ఎమ్మెల్యే తాటిపర్తి జీవన్‌రెడ్డి అన్నారు. సభ వాయిదా పడిన అనంతరం ఆయన మాట్లాడుతూ సభ్యులు రాకపోవడమంటే జడ్పీ చైర్‌పర్సన్‌పై అవిశ్వాసం వ్యక్తం చేసినట్లేనని అన్నారు. రెండు విడతలుగా మాత్రమే రుణమాఫీ చేశారని, మూడవ వితడ ఇప్పటికీ రుణమాఫీ చేయలేదని, దీంతో రైతులు తీవ్ర నిరాశలో ఉన్నారని తెలిపారు. ఈ సమయంలో సమావేశాన్ని వాయిదా వేయడం బాధాకరమని అన్నారు. రైతులు నిరాశలో ఉంటే అవతరణ వేడుకలు ఘనంగా ఏలా జరుపుకుంటారని ప్రశ్నించారు. తాగునీటి సమస్యను పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని ఆరోపించారు. కేంద్రం రాష్ట్రాన్ని నిర్లక్ష్యం చేస్తే, రాష్ట్రం జిల్లాలను నిర్లక్ష్యం చేస్తున్నదని విమర్శించారు. ఇంతవరకు ఒక్కపైసా సీనరేజ్ నిధులు రాలేదని, జడ్పీటిసిలు, ఎంపిటిసిలకు నిధులు లేవని అన్నారు. ఇక నుంచైనా జడ్పీ సమావేశం జరిగేలా చూడాలని జీవన్‌రెడ్డి కోరారు.