కరీంనగర్

మారేడుగొండలో చెరువు శిఖం భూమి ఆక్రమణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెద్దపల్లి రూరల్, మే 31: చెరువు శిఖం భూమిని ఆక్రమించడమే కాకుండా మిషన్ కాకతీయ పనులు జరగకుండా అడ్డుతగలడాన్ని నిరసిస్తు మండంలోని మారేడుగొండ గ్రామస్థులు మంగళవారం ఆందోళన నిర్వహించారు. మారేడుగొండ గ్రామ సమీపంలోని చెరువు శిఖం భూమిని కొంత మంది ఆక్రమించుకొని పంటలు సాగు చేసుకుంటున్నారు. ఇటీవల మిషన్ కాకతీయ కింద పనులు ప్రారంభించగా ఆక్రమించుకున్న భూముల్లో నుంచి మట్టి తీయకుండా ఆక్రమణదారులు అడ్డుకుంటున్నారు. ఈ విషయంలో అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోక పోవడంతో ఆయకట్టు రైతులు, గ్రామస్తులు మంగళవారం ఉదయం పెద్దపల్లి-కాల్వశ్రీరాంపూర్ ప్రధాన రహదారిపై రాస్తారోకో చేపట్టారు. దీనితో దిగి వచ్చిన స్థానిక తహశీల్దార్ అనుపమరావు, ఎస్సై రాజ్‌కుమార్ మారెడుగొండ గ్రామానికి చేరుకొని ఆందోళకారులకు సర్ది చెప్పి, ఆందోళన విరమింపజేశారు. చెరవు శిఖం భూమి సర్వే నిర్వహించి, శిఖం భూమి ఆక్రమించుకున్న వారి నుంచి స్వాధీనం చేసుకోవడంతో పాటు మిషన్ కాకతీయ పనులకు ఆటంకం జరగకుండా చర్యలు చేనడుతమని తహశీల్దార్ అనపమరావు హామీ ఇచ్చారు. ఈ ఆందోళన కార్యక్రమంలో సర్పంచ్ కౌముటం శంకర్, ఉప సర్పంచ్ లక్ష్మి-జయ్, వార్డు సభ్యులు, చెరువు ఆయకట్టు రైతులు పాల్గొన్నారు.

ఉత్తమ క్రీడాకారుడిగా ఎంపికైన ఇల్లంతకుంట ఆనంద్
ఇల్లంతకుంట, మే 31: మండల కేంద్రానికి చెందిన పండుగ ఆనంద్ ఖో-ఖో క్రీడలో రాణించి ఇటీవల భారత ఖో-ఖో జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించి దేశాన్ని గెలిపించిన ఆనంద్‌ను తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం ఆయనను ఉత్తమ క్రీడాకారుడుగా ఎంపిక చేసింది. ఇల్లంతకుంట వాస్తవ్యుడు కావడంతో ఆయనను మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, ఎంపిపి ఐలయ్య యాదవ్, జడ్పీటిసి సిద్ధం వేణు తదితరులు అభినందించారు. ఆయన ఎంపిక పట్ల ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు.