కరీంనగర్

భారీ వర్షాలతో నిలిచిన బొగ్గు ఉత్పత్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోదావరిఖని, జూలై 11: గత ఐదు రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షంతో రామగుండం పారిశ్రామిక ప్రాంతం తడిసి ముద్దయ్యింది. దీంతో సింగరేణి రామగుండం మూడు రీజియన్లలోని ఓపెన్ కాస్టు ప్రాజెక్ట్‌ల ద్వారా బొగ్గు ఉత్పత్తులు పూర్తిగా నిలిచిపోయాయి. అంతేగాకుండా ఓబి మట్టి పనులు కూడా జరుగడం లేదు. సింగరేణి ఓసిపిలలో ఒక రోజుకు 51వేల టన్నుల బొగ్గు ఉత్పత్తిని తీయాల్సి ఉంది. గురువారం సాయంత్రం నుంచి కురుస్తున్న ఈ వర్షంతో గడిచిన నాలుగు రోజులుగా ఓసిపిల నుంచి జరగాల్సిన 2లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. దీని మూలంగా సింగరేణి పరిశ్రమకు ఇప్పటికే కోట్లాది రూపాయల నష్టం ఏర్పడినట్లు తెలుస్తోంది. విస్తారంగా కురుస్తున్న వర్షాలకు రామగుండం మండలంలోని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌కు వరద తాకిడి పెరుగుతుంది. ఎగువ ప్రాంతాల్లోని వర్షపు నీరంతా ప్రాజెక్ట్‌కు చేరుకోవడంతో ఉధృతి ఎక్కువగా కనిపిస్తోంది. ఫుల్ రిజర్వాయర్ ప్రాజెక్ట్ లెవల్ 148 కాగా ప్రస్తుతం 138.3 క్రస్ట్ లెవల్‌లో నీటి మట్టం ఉంది. దీంతో ప్రాజెక్ట్‌లో 3.31 శతకోటి ఘనటపు అడుగులు (టిఎంసి)ల నీరు నిలువ ఉన్నట్లు ఫ్లడ్ మానిటరింగ్ అధికారులు తెలిపారు. కడెం ప్రాజెక్ట్ నుంచి సోమవారం సాయంత్రం 40వేల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి విడుదల చేయగా ఎల్లంపల్లికి 8వేల క్యూసెక్కుల వరద నీరు ఇన్‌ఫ్లో అవుతుంది. 158 క్యూసెక్కుల నీటిని హైదరాబాద్ సుజల స్రవంతికి ఎల్లంపల్లి నుంచి నీటిని సరఫరా చేస్తున్నారు.