కరీంనగర్

నేడు మున్సిపాలిటీల సదస్సు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్ టౌన్, జూలై 31: రాష్ట్రంలో మొదటిసారిగా నిర్వహిస్తున్న రాష్టస్థ్రాయి మున్సిపాలిటీల సదస్సు నగరంలో నేడు ప్రారంభం కానుంది. స్థానిక స్టార్ హోటల్ ప్రతిమ మల్టీప్లెక్స్‌లో జరుగనున్న ఈ సమావేశానికి రాష్ట్ర ఐటి, మున్సిపల్‌శాఖ మంత్రి కె.తారకరామారావుతో పాటు మున్సిపల్ శాఖ డైరెక్టర్ దానకిషోర్‌లు పాల్గొని, మున్సిపాల్టీల అభివృద్ధిపై ప్రధానంగా 8 అంశాలపై చర్చలు జరుపనున్నారు. ఈసదస్సును విజయవంతం చేసేందుకు నగరపాలక సంస్థ మేయర్ రవీందర్‌సింగ్, కమిషనర్ కృష్ణ్భాస్కర్‌లు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల మేయర్లు, చైర్మెన్లు, వైస్ చైర్మన్లు, కమిషనర్లు, ప్రత్యేకాధికారులు విధిగా హాజరుకావాలంటూ పురపాలకశాఖ డైరెక్టర్ ఇప్పటికే అన్ని మున్సిపాల్టీలకు సర్క్యులర్‌లు జారీచేశారు. ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భావానంతరం మొదటిసారిగా నిర్వహిస్తున్న ఈ సమావేశంలో నగరాలు, పట్టణాల్లో నెలకొన్న ప్రధాన సమస్యలైన పారిశుద్ధ్యం, నీటి సరఫరా, వీధి దీపాల నిర్వహణ, మున్సిపల్ ఆదాయ వనరుల పెంపు, రెవెన్యూ వసూళ్ళు, పారిశుద్ధ్యంతో సాలిడ్ వేస్ట్ తయారు చేస్తుండటం ద్వారా కలుగుతున్న లాభాలు, ఇంటింటా చెత్తసేకరణ కొనసాగుతున్న తీరు, డంప్‌యార్డుల నిర్వహణ, టాయిలెట్ల నిర్మాణంపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్న తీరు, తదితర అంశాలపై చర్చించనున్నట్లు బల్దియా కమిషనర్ కృష్ణ్భాస్కర్ తెలిపారు. నీటి సరఫరా విభాగంలో మిషన్ భగీరథ, ఒక్క రూపాయికే నల్లా కనెక్షన్ అమలు, ఇతర నీటి సరఫరా అభివృద్ధి పనులపై కూడా ప్రత్యేకంగా చర్చ జరిగే అవకాశాలున్నాయి. తాజాగా కొనసాగుతున్న హరితహారంలో ఇప్పటివరకు జరిగిన ప్రగతి, మొక్కలు నాటడంలో మున్సిపల్ శాఖ మొదటిస్థానంలో ఉండగా, దీనిని కొనసాగించేందుకు మరింత ఉత్సాహంగా హరితహారం కొనసాగించటంపై మంత్రి ప్రస్తావించనున్నట్లు సమాచారం. ఇప్పటివరకు నాటిన మొక్కలు, వాటిని సంరక్షించేందుకు తీసుకుంటున్న చర్యలపై అన్ని మున్సిపాల్టీల నుంచి వచ్చే ప్రతినిధులు నివేదికలు తీసుకురావాలని ఆదేశించగా, దీనిపై ప్రత్యేక దృష్టి సారించినట్లు స్పష్టమవుతోంది. అలాగే, పట్టణాలను సుందరీకరించే నేపథ్యంలో మోడల్ మున్సిపాల్టీ, మోడల్ వార్డులపై ప్రత్యేకంగా ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. రాష్టవ్య్రాప్తంగా 72 మున్సిపాల్టీల నుంచి ప్రతినిధులు హాజరుకానున్న దృష్ట్యా ఇందుకనుగుణంగా నగరపాలక సంస్థ తగిన ఏర్పాట్లు చేయటంలో నిమగ్నమయ్యారు.