కరీంనగర్

గల్ఫ్‌లో పాపయ్యపెల్ల వాసి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిరిసిల్ల, ఆగస్టు 5: జీవనోపాధి కోసం గల్ఫ్‌కు ఉపాధి బాట పట్టిన చెన్నమవేని రాములు(41) గుండెపోటుతో మృతి చెందడంతో ఆయన కుటుంబ సభ్యుల్లో రోదనలు మిన్నంటాయి. సిరిసిల్ల మండలం తాడూర్ పంచాయతి పరిధిలోని పాపయ్యపల్లెకు చెందిన రాములు కొద్ది రోజుల క్రితం అప్పులు చేసి ఉపాది కోసం దుబాయ్ వెళ్ళారు. అయితే ఊహించని విధంగా ఆయనకు గుండెపోటు వచ్చి మృతి చెందడంతో శుక్రవారం ఇంటికి సమాచారం అందడంతో కుటుంబు సభ్యులు రోదనలకు గురవుతున్నారు. ఈ సంఘటనతో పాపయ్యపల్లెలో విషాదం అలుముకుంది.