కృష్ణ

జాతీయ లోక్ అదాలత్‌లో ’కృష్ణా‘కు ప్రథమ స్థానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, ఫిబ్రవరి 11: జాతీయ మెగా లోక్ అదాలత్ నిర్వహణలో కృష్ణాజిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. శుక్రవారం నిర్వహించిన లోక్ అదాలత్‌లో 6వేల 224 కేసులకు గాను 5వేల 548 కేసులు పరిష్కారమయ్యాయి. ఇందులో 5వేల 85 క్రిమినల్ కేసులు, 389 సివిల్ కేసులు, 74 ప్రీలిటిగేషన్ కేసులు ఉన్నాయి. పరిష్కారమైన కేసులకు సంబంధించి బాధితులకు రూ.11,19,42,488ల పరిహారం త్వరలో అందనుంది. జిల్లా కేంద్రం మచిలీపట్నంలోని జిల్లా ప్రధాన న్యాయస్థానంతో పాటు విజయవాడ, గుడివాడ, నూజివీడు, నందిగామ, అవనిగడ్డ, ఉయ్యూరు, బంటుమిల్లి, గన్నవరం, మైలవరం, తిరువూరు, కైకలూరు న్యాయస్థానాల్లో బెంచ్‌లు ఏర్పాటు చేసి పెండింగ్ కేసులను కక్షిదారుల సమక్షంలో రాజీ మార్గాన పరిష్కరించారు. జిల్లా కేం ద్రం మచిలీపట్నంలోని జిల్లా న్యాయస్థానంలో ఏర్పాటు చేసిన జాతీయ మెగా లోక్ అదాలత్‌ను ప్రధాన న్యా యమూర్తి వై లక్ష్మణరావు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెం డింగ్ కేసుల సత్వర పరిష్కారానికి లో క్ అదాలత్‌లు దోహదం చేస్తాయన్నారు. రాజీ మార్గం ద్వారా పరిష్కారమయ్యే కేసుల వల్ల సమయంతో పాటు సొమ్మును ఆదా చేసుకోవచ్చన్నారు. చిన్న చిన్న కేసుల్లో కక్షిదారులు పంతాలకు పోకుండా లోక్ అదాలత్‌ల ద్వారా తమ తమ కేసులను రాజీమార్గం ద్వారా పరిష్కరించుకోవడం ఎంతో ఉత్తమమన్నారు. దీని వల్ల సమయంతో పాటు సొమ్ము అదా అవుతుందన్నారు. లోక్ అదాలత్‌ను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని న్యాయమూర్తి లక్ష్మణరావు కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి పిఆర్ రాజీవ్, న్యాయమూర్తులు రామకృష్ణ, మల్లిఖార్జునరావు, జయరాజు, రజని, శ్రీనివాస్ శర్మ, పలువురు న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు.

పట్టణ వౌలిక సదుపాయాల కల్పనకు కృషి
మచిలీపట్నం (కోనేరుసెంటర్), ఫిబ్రవరి 11: పట్టణ వౌలిక సదుపాయాల కల్పనకు పనులు వేగవంతంగా జరుగుతున్నాయని మున్సిపల్ చైర్మన్ మోటమర్రి బాబాప్రసాద్ అన్నారు. స్థానిక లక్ష్మీటాకీసు సెంటరు నుండి మూడు స్తంభాల సెంటరు వరకు ఉన్న విజయవాడ రోడ్డులో రూ.18లక్షల వ్యయంతో 100 స్తంభాలను ఏర్పాటు చేసే పనులను శనివారం చైర్మన్ బాబాప్రసాద్ కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. 100 స్తంభాలతో పాటు పాత బల్బుల స్థానంలో ఎల్‌ఇడి బల్బులను అమర్చటం జరుగుతుందన్నారు. దేశంలోనే పట్టణాన్ని ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దుతామన్నారు. ఈ కార్యక్రమంలో ఫ్లోర్ లీడర్ పల్లపాటి సుబ్రహ్మణ్యం, కౌన్సిలర్ మోదుగుమూడి శేషుబాబు, టిడిపి నాయకుడు పామర్తి నరేష్, ఏఇ ప్రభాకర్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
లోక్ అదాలత్‌లో 187 కేసుల పరిష్కారం
మైలవరం, ఫిబ్రవరి 11: జాతీయ న్యాయ సేవాధికార సంస్థ న్యూఢిల్లీ ఆదేశానుసారం స్థానిక జూనియర్ సివిల్ జడ్జి, మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ ఎస్ వరలక్ష్మి ఆధ్వర్యంలో శనివారం స్థానిక కోర్టు ఆవరణలో లోక్ అదాలత్ నిర్వహించారు. ఈకార్యక్రమంలో 183 క్రిమినల్ కాంపౌండబుల్ కేసులు, నాలుగు సివిల్ కేసులు రాజీ చేసినట్లు ఆమె ఒక ప్రకటనలో తెలిపారు. అనంతరం జరిగిన న్యాయ విజ్ఞాన సదస్సులో న్యాయవాదులు, కక్షిదారులు, ప్రజలు పాల్గొన్నారు.

కూచిపూడి నాట్యానికి కృష్ణా వర్సిటీ ప్రాధాన్యం
కూచిపూడి, ఫిబ్రవరి 11: రానున్న విద్యా సంవత్సరంలో కృష్ణా విశ్వవిద్యాలయం కూచిపూడి నాట్యానికి ప్రాముఖ్యతనిచ్చే కార్యక్రమంలో భాగంగా మాస్టర్ ఆఫ్ ఫర్ఫార్మింగ్ ఆర్ట్ (యంఎ) కోర్సును ప్రారంభించనున్నట్లు కృష్ణా విశ్వవిద్యాలయం ఉప కులపతి ఆచార్య సుంకరి రామకృష్ణారావు తెలిపారు. శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో నాట్యక్షేత్రం కూచిపూడిలో నిర్వహిస్తున్న శ్రీ సిద్ధేంద్రయోగి నాట్యోత్సవాలు సందర్భంగా శనివారం నాటి కార్యక్రమానికి ఉపకులపతి రామకృష్ణారావు ముఖ్య అతిథిగా విచ్చేశారు. శ్రీ కనకదుర్గ ధర్మప్రచార పరిషత్ సంచాలకుడు డా. వేదాంతం రాజగోపాల చక్రవర్తి మాట్లాడుతూ కూచిపూడి గ్రామం కేంద్రంగా ప్రతి యేటా ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కళారత్న ఏబి బాలకొండలరావు, అఖిల భారత కూచిపూడి నాట్య కళామండలి కార్యదర్శి పస్తుమర్తి కేశవప్రసాద్, అమెరికాకు చెందిన కలంకారీ కళాకారిణి మేరికోర్ పాల్గొన్నారు.
17న ట్రాన్స్‌పోర్టు కార్మికుల ధర్నా
బంటుమిల్లి, ఫిబ్రవరి 11: జిల్లా మోటారు ట్రాన్స్‌పోర్టు వర్కర్స్ యూనియన్ బంటుమిల్లి శాఖ రౌండ్ టేబుల్ సమావేశం స్థానిక కామ్రెడ్ గుండాబత్తుల ఆంజనేయులు స్మారక భవనంలో ఆకునూరి వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ట్రాన్స్‌పోర్టు రంగ కార్మికులపై ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను ఎండగడుతూ పెంచిన చలానాలు తగ్గించాలని, ఫిట్‌నెస్ పెనాల్టీలు రద్దు చేయాలని తదితర అంశాలపై తీర్మానాలు ఆమోదించారు. ఈ సమావేశంలో జిల్లా నాయకుడు పోలి నాయుడు మాట్లాడుతూ ఈనెల 17న ట్రాన్స్‌పోర్టు కార్మికులు జిల్లా వ్యాప్తంగా ధర్నా, ఆందోళనలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో ఆటో, టాక్సీ, ట్రక్కు వర్కర్స్ యూనియన్ నాయకులు ఆకుల కృష్ణ, నాగబాబు, జి వెంకన్న, అర్జా వెంకట సురేష్, నాగమల్లి, సిఐటియు డివిజన్ అధ్యక్ష, కార్యదర్శులు మాజేటి శివ శ్రీనివాసరావు, పరుచూరి ధనశ్రీ, ఎల్ అజైయ్ ఘోష్ తదితరులు పాల్గొన్నారు.

కనువిందు చేసిన కూచిపూడి నృత్యం
కూచిపూడి, ఫిబ్రవరి 11: స్థానిక శ్రీ సిద్ధేంద్రయోగి మందిర 11వ వార్షికోత్సవం సందర్భంగా 5వ రోజైన శనివారం విశాఖపట్నంకు చెందిన సంగీత నాటక అకాడమి కళారత్న అవార్డు అందుకున్న ఎబి బాలకొండలరావు శిష్య బృందం ప్రదర్శించిన కూచిపూడి నాట్యాంశాలు కనువిందు గావించాయి. ఈ సందర్భంగా బాలకొండలరావు కుమారుడు ఆదిత్య బుల్లి బ్రహ్మం, శ్రీవర్ష, పూషణ్, రోషణ్, వందిత పలు అంశాలపై నృత్యభినయంతో కళాకారులు నవరసాలను ప్రదర్శించారు. ఈ కార్యక్రమాలకు కృష్ణా విశ్వవిద్యాలయం ఉప కులపతి ఆచార్య ఎస్ రామకృష్ణారావు, కనకదుర్గ ధర్మప్రచార పరిషత్ డైరెక్టర్ డా. వేదాంతం రాజగోపాల చక్రవర్తి, అఖిల భారత కూచిపూడి నాట్య కళామండలి కార్యదర్శి పసుమర్తి కేశవప్రసాద్, కళారత్న ఏబి బాలకొండలరావు తదితరులు జ్యోతి ప్రజ్వలనం చేసి కార్యక్రమాలను ప్రారంభించారు. కళాకారులను, నాట్యాచారిణిని నిర్వహకులు అతిథులు ద్వారా దుశ్శాలువాలు, జ్ఞాపికలతో ఘనంగా సత్కరించారు.
అసైన్డ్ భూముల సాగుదార్లకు
పరిహారం చెల్లించాలి
మచిలీపట్నం (కోనేరుసెంటర్), ఫిబ్రవరి 11: ప్రభుత్వ భూముల్లోనే బందరు పోర్టు నిర్మాణ పనులను వెంటనే చేపట్టాలని, పరిశ్రమలు, కారిడార్ పేరుతో ఇచ్చిన నోటిఫికేషన్ రద్దు చేయాలని సిపిఐ నాయకులు డిమాండ్ చేశారు. శనివారం ఇక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో నాయకులు మాట్లాడుతూ బందరు పోర్టును ఆరు నెలల్లో నిర్మిస్తామని వాగ్దానం చేసి గద్దెనెక్కిన టిడిపి ప్రభుత్వం మూడు సంవత్సరాలు అవుతున్నా పోర్టు నిర్మాణం ఒక కొలిక్కి రాలేదని విమర్శించారు. ప్రభుత్వ భూములలో పోర్టు నిర్మాణం వెంటనే చేపట్టాలన్నారు. ఆ ప్రభుత్వ భూముల్లో ఎసైన్డ్ భూములను, అలాగే తరతరాలుగా సాగుచేసుకుటున్న లబ్ధిదారులకు 2013 చట్టం ప్రకారం నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సిపియం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు చౌటపల్ల రవి, పట్టణ కమిటీ సభ్యుడు సిహెచ్ జయరావు తదితరులు పాల్గొన్నారు.