తెలంగాణ

హైకోర్టు విభజనపై కెసిఆర్ రాజకీయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: హైకోర్టు విభజన విషయంలో తెలంగాణ సిఎం కెసిఆర్ రాజకీయాలు చేస్తున్నారని, న్యాయాధికారులను సస్పెండ్ చేసినా ఆయన పెదవి విప్పడం లేదని బిజెపి తెలంగాణ శాఖ అధ్యక్షుడు లక్ష్మణ్ విమర్శించారు. నగరంలోని ఇందిరాపార్కు వద్ద ఆందోళన చేస్తున్న తెలంగాణ న్యాయవాదులకు ఆయన మద్దతు ప్రకటించిన సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, హైకోర్టు విషయమై తెలుగు రాష్ట్రాల సిఎంలు ఒకసారి కలిసి మాట్లాడుకుంటే సమస్య తొలగిపోతుందన్నారు. హైకోర్టు కోసం కెసిఆర్ దిల్లీలో దీక్ష చేస్తే, తాము హైదరాబాద్‌లో సిఎం క్యాంపు ఆఫీసు వద్ద ఆందోళన చేస్తామన్నారు.