రాష్ట్రీయం

నాలుగేళ్లలో ఇళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అర్హులందరికీ డబుల్ బెడ్ రూంలు *దీపం పంపిణీలో మంత్రి కెటిఆర్

హైదరాబాద్, డిసెంబర్ 26: రానున్న నాలుగేళ్లలో రాష్ట్రంలోని అర్హులందరికీ డబుల్ బెడ్ రూం ఇళ్లు సమకూర్చనున్నట్లు రాష్ట్ర పంచాయతీ, ఐటి మంత్రి కె తారకరామరావు ప్రకటించారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ ఆధ్వర్యంలో శనివారం నెక్లెస్‌రోడ్డులోని పీపుల్స్‌ప్లాజాలో స్వయం సహాయక బృందాల మహిళలకు దీపం పథకం కింద గ్యాస్ కనెక్షన్లు పంపిణీ చేశారు. మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ కేంద్రం సహకారంతో డబుల్ బెడ్ రూం ఇళ్లను నిర్మించనున్నట్టు తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పదివేల ఇళ్ల నిర్మాణానికి కార్యాచరణ సిద్ధం చేశామని, ఎస్‌హెచ్‌జిలకు ప్రస్తుతమిస్తున్న రూ. 5 లక్షల రుణాన్ని రూ.10 లక్షలకు పెంచనున్నట్టు తెలిపారు. నగరంలో దారిద్య్రరేఖకు దిగువనున్న వారందరికీ ఉచితంగా దీపం పథకం కింద గ్యాస్ కనెక్షన్లు అందిస్తామన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలోలేని విధంగా వృద్థులు, వితంతువులకు వెయ్యి, వికలాంగులకు రూ.1500 ఆసరా పెన్షన్లు అందిస్తున్నది కేవలం తెలంగాణేనని పేర్కొన్నారు. రాష్ట్రంలో గర్భిణి స్ర్తిలకు పౌష్టికాహారాన్ని అందించే కార్యక్రమానికి రూ.800 కోట్లు వెచ్చిస్తున్నట్టు తెలిపారు. నగరంలోని పేద, మధ్యతరగతి ప్రజలను తమ గమ్యస్థానాలకు చేర్చుతున్న ఆటోలకు రవాణా పన్ను రద్ధుచేసి డ్రైవర్లకు ప్రభుత్వం అండగా నిలిచిందన్నారు. అనంతరం కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ హైదరాబాద్‌లో మహిళా వర్శిటీ ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ముద్రా బ్యాంకు పథకాన్ని వినియోగించుకోవాలని సూచించారు. హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో 50శాతం సీట్లు మహిళలకే కేటాయించినట్టు తెలిపారు. మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ మాట్లాడుతూ నగరంలో స్వయం సహాయక బృందాలను మరింత బలోపేతం చేసేందుకు చర్యలు చేపడుతామన్నారు. డిప్యూటీ సిఎం మహమూద్ అలీ మాట్లాడుతూ హైదరాబాద్ అభివృద్దిలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం అవసరమన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, ఎమ్మెల్సీ మహ్మద్ సలీం, జిహెచ్‌ఎంసి కమిషనర్ బి జనార్దన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
** స్వయం సహాయక గ్రూపులకు చెక్కులు అందిస్తున్న మంత్రి కెటిఆర్ **