రాష్ట్రీయం

ఆంధ్రవాళ్లపై ఈగ వాలనివ్వలేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంక్షేమంలో పక్షపాతం చూపించలేదు
సంక్రాంతి జరిగాకే జిహెచ్‌ఎంసి ఎన్నికలు
తెలంగాణ మంత్రి కెటిఆర్ వెల్లడి

హైదరాబాద్, డిసెంబర్ 31: తెలంగాణ రాష్ట్రం వస్తే ఆంధ్రులను ఇక్కడి నుంచి వెళ్లగొడతారంటూ కొందరు విషం చిమ్మి ఓట్లు పొందారని, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఆంధ్రులు ఎవరిపైనైనా ఎక్కడైనా ఒక్క దాడి జరిగిందా? అని పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె తారకరామారావు ప్రశ్నించారు. రాష్ట్రం ఏర్పడిన ఈ ఏడాదిన్నర కాలంలో ఆంధ్రావారిపై ఈగ వాలనివ్వలేదని మంత్రి చేశారు. ఉప్పల్ నియోజకవర్గానికి చెందిన వివిధ పార్టీల నేతలు, కార్యకర్తలు గురువారం తెలంగాణ భవన్‌లో మంత్రి సమక్షంలో టిఆర్‌ఎస్ పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ, పేదవాళ్లు ఏ ప్రాంతం వారైనా తమకు అందరూ సమానమేనన్నారు. హైదరాబాద్‌లోని సీమాంధ్ర వారిలో ఏ ఒక్కరికైనా నష్టం జరిగిందా? సంక్షేమ పథకాల అమలులో ఏ ఒక్కరి పట్లనైనా పక్షపాతం చూపించామా? అని మంత్రి ప్రశ్నించారు. ఇక్కడున్న ఆంధ్రవాళ్లకు పెన్షన్లు ఇవ్వవద్దని కానీ, ఇళ్ల స్థలాలు ఇవ్వవద్దని కానీ ఎవరైనా అన్నారా అని మంత్రి కెటిఆర్ ప్రశ్నించారు. రాష్ట్రం విడిపోవడం వల్ల రెండు ప్రాంతాలు లబ్ధి పొందుతున్నాయి, లేకుంటే ఆంధ్రప్రదేశ్‌లో కొత్త నగరాలు వచ్చేవా? అని మంత్రి కెటిఆర్ అన్నారు. తెలంగాణలో ప్రాంతీయ విబేధాలు లేకుండా అంతా కలిసే ఉన్నారని, అయితే గతంలో నాయకులే ప్రజల మధ్య చిచ్చు పెట్టాలని చూశారని మంత్రి కెటిఆర్ విమర్శించారు. హైటెక్ సిటీ కట్టించాం అనేవాళ్లు మరి నగరంలో మురికి కాలువలను ఎందుకు కట్టించలేకపోయారని మంత్రి ప్రశ్నించారు.
నగరంలో పేదలకు నల్లా, కరంట్ బిల్లు మాఫీ చేయించిన ఘనత ముఖ్యమంత్రి కెసిఆర్‌కే దక్కుతుందన్నారు. ఆంధ్రవాళ్లు సంక్రాంతి పండుగకు వారి సొంత ఊళ్లకు వెళ్లి వచ్చిన తర్వాతనే జిహెచ్‌ఎంసి ఎన్నికలు జరుగుతాయన్నారు. ఆంధ్రవాళ్ల ఓట్లతోనే జిహెచ్‌ఎంసి పీఠాన్ని కైవసం చేసుకోబోతున్నామని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. గ్రేటర్ ఎన్నికల్లో తమకు ఎవరితోనూ పొత్తులు ఉండవని మంత్రి స్పష్టం చేశారు.