కరీంనగర్

గతమెంతో ఘనకీర్తి.. నేడేమో అపకీర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, డిసెంబర్ 14: వారంతా ఒకప్పుడు తమ ఇలాకాల్లో ఎదురులేని నాయకులు. వారు చెప్పిందే వేదం..వారు చేసిందే పని అన్నట్లుగా రాజకీయ పటాటోపం సాగించారు. వారు లేకుంటే ఆయా నియోజకవర్గాల్లో పార్టీ పనులు స్థంభించినట్లే.కార్యకర్తలు కూడా వారి మాట వేదవాక్కులా పాటించారు. వారి వారి అసెంబ్లీనియెజకవర్గాల్లో అన్నీ తామై పార్టీని పెంచి పోషించారు. ఎన్నికల్లో అయితే వారు, లేకుంటే వారి అనుచరులను మాత్రమే బరిలో నిలిపి, గెలిపించుకునేవారు. వారంతా పలుమార్లు పోటీ చేసి ఓటమి పాలైనా, ఆతర్వాత జరిగే ఎన్నికల్లో అధిష్టానం తిరిగి వారికే అవకాశం కల్పించేది. అయితే, కాలక్రమేణా పరిస్థితులు తారుమారయ్యాయి. యువరక్తం పార్టీలోకి ప్రవేశిస్తుండగా, వారి చతురత చెల్లాచెదురవుతుండగా, విసిరే పాచికలు పారటం లేదు. రాజకీయంగా సీనియర్లైనా, వయసు మీరుతుండటంతోజాతీయ, రాష్ట్ర నాయకత్వం వీరికి ప్రాధాన్యత తగ్గిస్తూ, గత కొంతకాలంగా ఆయా సెగ్మెంట్లలో యువ నేతలను ప్రోత్సహిస్తోంది. పట్టువదలని విక్రమార్కుల్లా వీరు తమ ప్రాధాన్యతను పెంచుకుంటూ, పార్టీలో, తమ సెగ్మెంట్లలో పూర్వ వైభవం పొందేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. తాజాగా ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సైతం తమకే టికెట్లు కేటాయించాలంటూ రాష్ట్ర నాయకుల నుంచి మొదలు అగ్రనాయకుల వద్దకు వెళ్ళి ధరఖాస్తులు చేసుకున్నారు.అయినా, అధిష్టానం మాత్రం వారి పట్ల సానుకూల ధోరణితో లేకపోవటంతో ఇక తాము విశ్రాంతి తీసుకోకతప్పదేమోననే వైరాగ్యంలోకొట్టుమిట్టాడుతున్నారు. మరి కొద్దిరోజుల్లో తమ రాజకీయ భవితవ్యంపై స్పష్టమైన నిర్ణయం కూడా తీసుకునేందుకు వారి వారి అనుచర గణంతోచర్చలు జరుపుతున్నట్లు తెలుస్తుండగా, వారిలో ప్రముఖులు పశ్చిమ డివిజన్‌లో పేరు గాంచిన సీనియర్ కాంగ్రెస్ నేత కొమొరెడ్డి రామ్‌లు, మరొకరు రాజకీయ దురంధరుడు, ఎర్రజెండా జోరుకు ఎదురొడ్డి పోరాడిన అపర చాణక్యుడు బొమ్మ వెంకటేశ్వర్లు, ఇంకొకరు సీనియర్ నాయకునిగా కొనసాగుతున్న సుద్దాల దేవయ్య. వీరు ముగ్గురు ప్రతికూల పరిస్థితుల్లో సైతం రాజకీయ పోరాటాల్లో ఎదురీదుతూ, ఆయా సెగ్మెంట్లలో తమ కార్యకర్తలను కాపాడుకుంటూ, పార్టీని ముందుకు నడిపిన రోజులు కోకొల్లలుగా ఉన్నాయి. 1983లో తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన కొమొరెడ్డి రామ్‌లు 1985లోసంజయ్ విచార్ మంచ్ నుంచి మెట్‌పల్లి ఎమ్మెల్యే అభ్యర్థిగా, 1994లో కాంగ్రెస్ పార్టీనుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. 2004లో జనతా పార్టీ నుంచి గెలుపొంది, తిరిగి కాంగ్రెస్‌లో చేరారు. అనంతరం 2014లో కూడా మరోసారి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోగా, ఈసారి కూడా బరిలోకి దిగేందుకు చివరి వరకు యత్నించినా, టికెట్ లభించలేదు. ఇందుర్తిఅసెంబ్లీ నియోజకవర్గం నుంచి జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలైన బొమ్మ వెంకటేశ్వర్ అనంతర కాలంలో కాంగ్రెస్‌లో చేరారు. 1989, 1994లో కాంగ్రెస్ అభ్యర్థిగా రెండు సార్లు పోటీ చేసి ఓడిపోగా, 1999లో మాత్రం బరిలోకి దిగి గెలిచాడు. 2004లో కూడా పోటీ చేసి, పరాజయం పాలయ్యాడు. 2009లోమరోసారి తీవ్ర యత్నాలు చేయగా, ఫలించలేదు. 2014లోవేములవాడ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. ఈసారి జరిగిన ముందస్తు ఎన్నికల్లో కూడా హుస్నాబాద్ అసెంబ్లీ నుంచి పోటీ చేసేందుకు తనవంతు ప్రయత్నాలు చేయగా, ఫలించలేదు. 1985లో రాజకీయాల్లోకి వచ్చిన సుద్దాల దేవయ్య 1994లో నేరెళ్ళ నుంచి అసెంబ్లీ బరిలోకి దిగాడు. గెలిచాడు. అనంతరం 1999లో కూడా నిలిచి, గెలిచాడు. నియోజకవర్గాల పునర్విభజన చొప్పదండి సెగ్మెంట్ నుంచి 2004,2009లోబరిలోకి దిగి గెలిచి, తన ఆధిపత్యాన్ని చాటుకున్నాడు. 2014లో కూడా పోటీ చేసినా ఓటమి పాలయ్యాడు. అనంతరం ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మరోసారి టికెట్ కోసం ప్రయత్నం చేసినా, ఫలితం లేకపోవటంతోమిన్నకుండి పోయారు. అయితే, వీరిని ప్రచారంలో కానీ, ఇతరత్రా పార్టీ కార్యక్రమాల్లో కానీ ఉపయోగించుకోవటంలో పార్టీ నాయకత్వం పట్టించుకోలేదు. సేవలందించేందుకు వారు కూడా అంతగా ఆసక్తి కనబర్చటం లేదు. దీంతోవారి రాజకీయ శకం ఇక ముగిసినట్లేనా అనే చర్చ కొద్దిరోజులుగా ఉమ్మడి జిల్లాలో కొనసాగుతుండగా, వారి స్తబ్ధతతోకాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది.

తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టి మిల్లులకు తరలించాలి
-జాయింట్ కలెక్టర్ శ్యాం ప్రసాద్‌లాల్

కరీంనగర్, డిసెంబర్ 14: అన్నదాతలు ఆరుగాలం శ్రమించి అనేక కష్టనష్టాలకోర్చి పండించిన పంటలను విక్రయించేందుకు ఐకెపి కేంద్రాలలోకి తీసుకురాగా తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టి రైస్‌మిల్లులకు పంపించాలని జాయింట్ కలెక్టర్ జి.వి.శ్యాం ప్రసాద్‌లాల్ అన్నారు. శుక్రవారం పౌరసరఫరాల శాఖ డిప్యూటి తహశీల్దార్లు, టెక్నికల్ అసిస్టెంట్లు ఇన్‌స్పెక్టర్లతో కరీంనగర్ కలెక్టరేట్ క్యాంపు కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైస్‌మిల్లులకు తీసుకువచ్చిన సిఎంఆర్ బియ్యం నాణ్యతను నిర్ధిష్ట ప్రణాళికలను కలిగి ఉన్న వాటిని మాత్రమే తీసుకోవాలని సూచించారు. బియ్యం నాణ్యత నిర్ధిష్ట ప్రమాణాలు లేని వాటిని ఆంగీకరించవద్దని ఆదేశించారు. ఒకవేళ అంగీకరించినట్లు తెలిస్తే వారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. సరియైన ప్రమాణాలతో రాని బియ్యాన్ని గుర్తించినట్లయితే మిల్లర్లకు వెంటనే తిరస్కరణ నోట్ ఇవ్వాలని జాయింట్ కలెక్టర్ శ్యాం ప్రసాద్‌లాల్ సంబంధిత అధికారులకు సూచించారు. ఈ సమీక్షా సమావేశంలో ఫౌరసఫరాల శాఖ డిప్యూటి తహశీల్దార్లు, టెక్నికల్ అసిస్టెంట్లు, ఇన్‌స్పెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.