కర్నూల్

మార్కెట్ యార్డులకు కొత్త కార్యవర్గాలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, జనవరి 19:జిల్లాలోని మార్కెట్ యార్డులకు కొత్త కార్యవర్గాలను ఎంపిక చేయనున్నట్లు అధికారుల ద్వారా తెలుస్తోంది. ప్రస్తుత కార్యవర్గాలకు బుధవారమే పదవీ కాలం ముగిసినా గురువారం కొనసాగింపు ఉత్తర్వులు వస్తాయని ఆశతో ఎదురు చూశారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా మార్కెట్ యార్డులకు కొత్త పాలక మండళ్ల నియామకానికి ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలియడంతో ప్రస్తుత కార్యవర్గాలు నిరాశకు గురయ్యాయి. కొత్తగా పాలక మండళ్లను ఎంపిక చేయనున్నట్లు తెలియడంతో ఆయా పదవులను సొంతం చేసుకోవడానికి అధికార పార్టీలోని ద్వితీయ శ్రేణి నాయకులు, మండల, గ్రామ స్థాయి నాయకులు పోటీ పడుతున్నారు. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జిల వద్ద వారు ఇప్పటికే తమ వంతు ప్రయత్నాలను ముమ్మరం చేశారు. పాలకవర్గ చైర్మన్ పదవి కోసం ఒక్కో మార్కెట్ యార్డు నుంచి ముగ్గురు నుంచి అయిదుగురు వరకూ పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. వైకాపా నుంచి టిడిపిలో చేరిన ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో ఈ సంఖ్య మరింత ఎక్కువగా ఉన్నట్లు వెల్లడవుతోంది. ఈ నియోజకవర్గాల్లో తమ అనుచరులకు పదవిని దక్కించుకునేందుకు ఇరువర్గాలు తమ వంతు ప్రయత్నాలు తీవ్రతరం చేసినట్లు తెలుస్తోంది. పెద్ద మార్కెట్ యార్డుల్లో పదవుల కోసం పోటీ ఎక్కువగా ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. నిబంధనల ప్రకారం మార్కెట్ యార్డు పాలకవర్గంలో స్థానం దక్కించుకోవాలంటే ఖచ్చితంగా సొంతంగా సాగు భూమి ఉండాలని నిబంధన ఉండటంతో కొందరు పొలం కొనడానికి కూడా వెనుకాడటం లేదని వారంటున్నారు. ఈ సారి పాలకవర్గంలో స్థానం దక్కించుకోగలిగితే రానున్న 2019 ఎన్నికల వరకూ కొనసాగవచ్చని నాయకులు పేర్కొంటున్నారు. పాలకవర్గం పదవీకాలం రెండేళ్లు కావడంతో ఇప్పుడు ఎంపిక చేసినా 2019 ఫిబ్రవరి వరకూ కొనసాగవచ్చని ఆ సమయంలో ఎన్నికలు సమీపిస్తాయని దాంతో మరో 6 నెలల పొడగింపు తప్పదని లెక్కలు వేస్తున్నారు. అంతేగాక ఎన్నికల సమయంలో తమకు అధిక ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుందని భావిస్తూ పదవి దక్కించుకోవడానికి పోటీ పడుతున్నట్లు స్పష్టమవుతోంది. కాగా ప్రస్తుత మార్కెట్ యార్డుల పాలక మండళ్ల పదవీ కాలం ముగియడంతో ఒకటి, రెండు రోజుల్లో పర్సన్ ఇన్‌చార్జిలను ప్రభుత్వం నియమిస్తుందని కొత్త కార్యవర్గం ఎంపిక చేయడానికి నెల రోజుల కంటే ఎక్కువ సమయం పడుతుందని అధికార పార్టీ నాయకులు వెల్లడిస్తున్నారు.
మనోరంజకంగా
నంది నాటకోత్సవాలు

కర్నూలు, జనవరి 19:రాష్ట్ర స్థాయి నంది నాటకోత్సవాలు కర్నూలులో మనోరంజకంగా సాగుతున్నాయి. నాటకోత్సవాల రెండవ రోజైన గురువారం కళాకారులు 6 సాంఘిక నాటకాలను ప్రదర్శించారు. రాష్ట్రంలో 3 చోట్ల నిర్వహిస్తున్న నాటకోత్సవాలకు తొలిసారిగా కర్నూలును ఎంపిక చేశా రు. ఈ ఉత్సవాలను 18వ తేదీ ఉప ముఖ్యమంత్రి కెఇ కృష్ణమూర్తి ప్రారంభించారు. రాష్టస్థ్రాయిలో జరుగుతున్న పోటీల కారణంగా ప్రజలను విశేషం గా ఆకట్టుకుంటున్నాయి. నాటకాలు జరుగుతున్న కళాక్షేత్రం ఆడిటోరియంలో ప్రేక్షకులు నిండుగా కనిపిస్తున్నారు. ప్రేక్షకాదరణ బాగుండటంతో కళాకారులు సైతం తమ పాత్రల్లో లీనమై ప్రతిభను చూపేందుకు పోటీ పడుతున్నారు. ఈ ఉత్సవాల్లో మన రాష్ట్రం నుంచే కాకుండా పొరుగున్న ఉన్న తెలంగాణ నుంచి కూడా కళాకారులు వచ్చి పోటీ పడుతున్నారు. తొలి రోజున కళాకారులు 5 నాటకాలను ప్రదర్శించగా రెండవ రోజు నుంచి ప్రతి రోజూ 6 నాటకాలను ప్రదర్శించే లా అధికారులు ప్రణాళిక రూపొందించారు. రాష్ట్ర చలనచిత్ర, టీవి, నాటకరంగ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉత్సవాల్లో కళాకారులకు, వారి బృందాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అధికారులు ఏర్పా ట్లు చేశారు. కర్నూలు నగరంలో నాటకాల ప్రదర్శనకు సంబంధించి ప్రచా రం చేయడంతో ప్రజలు తిలకించడానికి వెళ్తున్నారు. ఉత్సవాల్లో బహుమతులు పొందడానికి పోటీ పడుతున్న కళాకారులకు నాటకాలకు వస్తున్న కళాప్రియుల నుంచి వస్తున్న ఆదరణతో మరింత ఉత్సాహంగా పోటీల్లో తమ ప్రదర్శన కొనసాగిస్తున్నారు. కర్నూలులో తొలిసారిగా నిర్వహిస్తున్న నాటకోత్సవాలు ప్రజాదరణ పొందటంతో అధికారులు సైతం ఉత్సాహంగా కనిపిస్తున్నారు. భవిష్యత్తులో నాటకోత్సవాలను కర్నూలులో నిర్వహించాలన్న ఆలోచన రావడానికి ప్రజాదారణ ఎంతో తోడ్పడుతుందని వారు వెల్లడిస్తున్నారు. నంది నాటకోత్సవాలను ఫిబ్రవరి 2వ తేదీ సాయంత్రం 5 గంటలకు ప్రదర్శించే గంగాంబిక అనే పద్యనాటకం ద్వారా ముగించనున్నారు.

పంటనష్ట పరిహారానికై
రూ. 247 కోట్లతో ప్రతిపాదనలు
* నెలాఖరులో కేంద్ర కరవు బృందం రాక
ఆదోనిటౌన్, జనవరి 19: జిల్లాలో ఏడాది 36 మండలాల్లో కరవు ఏర్పడిందని, రైతులకు సుమారు 2,64,654 హెక్టార్లలో పంట నష్టం జరిగిందని ఇందుకోసం రూ. 247కోట్ల పరిహారం 3.21 లక్షల మంది రైతులకు మంజూరు చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు జిల్లా వ్యవసాయ అధికారి ఉమామహేశ్వరమ్మ పేర్కొన్నారు. ఆమె గురువారం ఆదోని ఎడిఎ కార్యాలయంలో విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ జిల్లాలో పంట నష్టం పరిశీలనకై ఈనెల చివరిలో కేంద్ర బృందం రానున్నట్లు ఆమె స్పష్టం చేశారు. అందుకోసమే ముందస్తుగా తాను కోడుమూరు, ఆస్పరి, ఆలూరు, ఆదోని, మంత్రాలయం, ఎమ్మిగనూరు ప్రాంతాల్లో పర్యటిస్తున్నట్లు తెలిపారు. పంట నష్టపోయిన రైతులందరికి పరిహారం అందుతుందని, ముఖ్యంగా ఈక్రాప్ బుకిగ్ ద్వారా పంటనష్ట పరిహారం మంజూరవుతుందన్నారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా 81 శాతం ఈక్రాప్ బుకింగ్ నమోదు పూర్తి చేశామన్నారు. ప్రస్తుతం కరవు మండలాలకు పంటనష్ట పరిహారం హెక్టార్‌కు పత్తి, వేరుశెనగ పంటలకు రూ. 15వేలు, ఆముదాలుకు రూ. 6వేలు, కందికి రూ. 10వేలు, కొర్రకు రూ. 5వేలు, వాముకు రూ. 10వేలు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం పరిహారం మంజూరు అవుతుందని, ఇందులో ఎలాంటి అవినీతి అక్రమాలు ఉండవన్నారు. గత ఏడాది పరిహారం మంజూరులో అవినీతి జరిగిందన్న విషయంపై ప్రశ్నించగా దీనిపై జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా టీంలు వేసి విచారిస్తున్నారని, తాను ప్రస్తుతం అన్ని ప్రాంతాల్లో పర్యటిస్తున్నట్లు వివరించారు. ఈ సమావేశంలో ఎడిఎ చంగల్‌రాయుడు, తదితరులు పాల్గొన్నారు.
టిడిపి, బిజెపి దొందూ దొందే..
* కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి..
* తెలుగుతమ్ముళ్లు రాజ్యాంగేతర శక్తులు ..
* కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్య
డోన్, జనవరి 19 : కేంద్రంలోని బిజెపి, రాష్ట్రంలోని టిడిపి ప్రభుత్వాల వల్ల ప్రజలకు ఒరిగిందేమీ లేదని, కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని కేంద్ర మాజీ మంత్రి కోట్ల జయ సూర్యప్రకాష్‌రెడ్డి స్పష్టం చేశా రు. పట్టణంలోని డిసిసి అధ్యక్షుడు లక్కసాగరం లక్ష్మిరెడ్డి నివాసంలో గురువారం కోట్ల విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై నిప్పులు చెరిగారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీసుకున్న పెద్దనోట్ల రద్దు నిర్ణయం సామాన్యులను తీవ్ర ఇబ్బందులకు గురిచేసిందని విచారం వ్యక్తం చేశారు. తమ ఖాతాలోని డబ్బును కూడా తీసుకునే స్వేచ్ఛను బిజెపి ప్రభుత్వం హరించి వేసిందని, ఈ హక్కు మోదీకి ఎవరిచ్చారని ప్రశ్నించారు. ఇక రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం కాంగ్రెస్ హయాం లో చేపట్టిన పనులనే ప్రారంభిస్తోందని విమర్శించారు. కాంగ్రెస్ హయాంలోనే హంద్రీనీవా, ముచ్చుమర్రి ప్రాజెక్టులు చేపట్టామని తెలిపారు. అయితే తామేదో చేసినట్లు చంద్రబాబుతో పాటు టిడిపి నేతలు గొప్పలు చెప్పుకోవడం విడ్డూరంగా వుందన్నారు. ఇప్పటికీ చంద్రబాబు మోసపూరిత వాగ్దానాలు చేస్తూ ప్రజలను మోసగిస్తున్నారని ధ్వజమెత్తారు. ఎన్నికలకు ముందు బ్యాంకుల్లో వున్న రైతులు, మహిళల రుణాలన్నీ మాఫీ చేస్తామని వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిందేమిటని ప్రశ్నించారు. ఇక టిడిపి మాయమాటలను నమ్మేస్థితిలో ఎవ్వరూ లేరని, భవిష్యత్తులో టిడిపికి గడ్డురోజులేనని జోస్యం చెప్పారు. వచ్చే ఎన్నికల్లో టిడిపి అధికారం కోల్పోవడం ఖాయమన్నారు. గతంలో ఎవ్వరూ ఏనాడు చేయని విధంగా డోన్‌లో తాము అభివృద్ధి పనులు చేపట్టామని గుర్తుచేశారు. పట్టణంలో తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలనే ఉద్దేశ్యంతోనే జిడిపి ప్రాజెక్టును చేపట్టామని, అంతేగాక ఫ్లై ఓవర్ బ్రిడ్జిని తమ హయాంలోనే నిర్మించామని గుర్తుచేశారు. అయితే తామేదో చేసినట్లు టిడిపి నాయకులు చెప్పుకోవడం సిగ్గుచేటు అన్నారు. హంద్రీనీవా నీటితో డోన్ ప్రాంతంలోని చెరువులను నింపుతామని గత రెండేళ్లుగా ప్రజలను మోసం చేస్తున్నారని చేతనైతే చెరువులను నింపి చూపాలని సవాల్ చేశారు. హంద్రీనీవా నీటిని చెరువులకు వాడుకోవడానికి ప్రభుత్వం నుంచి జీఓ విడుదల చేయించాలని డిమాండ్ చేశా రు. మంచి పనులు చేపడితే తాము సహకరిస్తామని, మాయమాటలు చెబితే ఊరుకునేది లేదని హెచ్చరించా రు. తెలుగు తమ్ముళ్లు అధికారం అడ్డుపెట్టుకుని అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. అక్రమంగా మైనింగ్‌ను కొల్లగొడుతున్నా రెవెన్యూ, పోలీసు యంత్రాంగాలు చూస్తూ ఊరుకున్నారని విమర్శించారు. కమలాపురం, కన్నపుకుంట ప్రాంతాల్లో అక్రమంగా లీజులు పొంది రైతుల భూములను కొల్లగొట్టడానికి కొందరు వ్యక్తులు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. రైతుల భూములను తీసుకుంటే తాము చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. జన్మభూమి కమిటీల పేరుతో అధికార పార్టీ నాయకులు రాజ్యాంగేతర శక్తులుగా మారుతున్నారని విమర్శించారు. రాబోయే రోజులు కాంగ్రెస్ పార్టీవేనని, 2019 ఎన్నికల్లో తాము అధికారంలోకి రావడం ఖాయమని కోట్ల సూర్య ధీమా వ్యక్తం చేశారు. సమావేశంలో డిసిసి అధ్యక్షుడు లక్కసాగరం లక్ష్మిరెడ్డి, నాయకులు భాస్కర్‌నాయుడు, ఓంప్రకాష్, కమతం భాస్కరరెడ్డి, చిన్నపూజర్ల రామచంద్రారెడ్డి, మైనార్టీ సెల్ జిల్లా కార్యదర్శి బాబులాల్, తదితరులు పాల్గొన్నారు.
సీమ ప్రజలను మోసం చేస్తున్న సిఎం
* ఆర్పీఎస్ అధ్యక్షుడు బైరెడ్డి
నంద్యాల, జనవరి 19: అమలుకాని వాగ్ధానాలతో రాయలసీమ ప్రజలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మోసం చేస్తున్నారని, సీమ ప్రాంతానికి చెందిన రాజకీయ నాయకులు ఇప్పటికైనా నిద్రమేల్కొని తమ హక్కులు సాధించుకొనేందుకు కృషి చేయాలని రాయలసీమ పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి అన్నారు. గురువారం స్థానిక తెలుగుగంగ అతిథి గృహంలో పాత్రికేయులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి అమరావతిని ఫ్రీజోన్ చేస్తామని చెప్పగానే టిడిపి నాయకులు చంకలు గుద్దుకుంటున్నారని ఎద్దేవా చేశారు. అమరావతి జపం చేస్తున్న ముఖ్యమంత్రి సిఆర్‌డిఎ పరిధిలో ఇంతవరకు ఎన్ని పోస్టులు భర్తీ చేశారో చెప్పాలని ప్రశ్నించారు. జనాభా ప్రాతిపదికన రాజధాని అమరావతిలో సీమ ప్రాంతానికి 40శాతం పోస్టులు రిజర్వు చేసి వారికే కేటాయించాలని డిమాండ్ చేశారు. శ్రీశైలం జలాశయం నుంచి దిగువకు నీటిని తరలించే జిఓ 69ని వెంటనే రద్దు చేసి, ప్రాజెక్టులో 854 అడుగుల వరకు నీటిని స్థిరీకరించేలా చట్టం చేయాలని డిమాండ్ చేశారు. రాయలసీమ హక్కుల కోసం తాను చేపట్టదలచిన దీక్షకు అనుమతి లేదని దీక్ష జరగకుండా చూసేందుకు అధికారులు చేస్తున్న యత్నాలను ఆయన ఖండించారు. తన దీక్షను ఎవరు ఆపలేరని హెచ్చరించారు. కోర్టు ఆదేశాలతో త్వరలో వేలాదిమందితో అమరావతి ఫ్రీ జోన్ దీక్ష చేపడతామని ప్రకటించారు. సీమ ప్రాంతంలో ఖనిజాలు సమృద్ధిగా ఉన్నప్పటికీ పరిశ్రమల స్థాపన వైపు ముఖ్యమంత్రి దృష్టి సారించడం లేదన్నారు. కృష్ణా జలాలను సీమ ప్రాంతానికి హక్కు ప్రాతిపదికన తరలించి సాగుతాగు నీటికి కష్టాలు లేకుండా చూడాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిపై ఉందన్నారు. ముచ్చుమర్రి ఎత్తిపోతల ప్రారంభోత్సవం రోజున ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలన్నీ కల్లబొల్లి కబుర్లేనన్నారు. అమలుకాని, సాధ్యం కాని హామీలు ఇస్తూ సీమ ప్రజలను మోసం చేస్తున్నారని, ఇది ఎంతో కాలం సాగదని సీమ ప్రజలు ముఖ్యమంత్రికి సరైన గుణపాఠం నేర్పే రోజు దగ్గరలోనే ఉందన్నారు.
బైరెడ్డి దీక్షకు అనుమతికై ధర్నా
కర్నూలు ఓల్డ్‌సిటీ, జనవరి 19:అమరావతిని ఫ్రీజోన్ చేసి రాయలసీమ ప్రాంత ఉద్యోగాల వాటా ప్రకటించాలని ఆర్పీఎస్ వ్యస్థాపక అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖరరెడ్డి చేపట్టబోయే దీక్షకు అధికారులు అనుమతి నిరాకరించడాన్ని నిరసిస్తూ గురువారం రాయలసీమ పరిరక్షణ సమితి విద్యార్థి సంఘం(ఆర్పీఎస్‌ఎస్‌ఎఫ్) ఆధ్వర్యలో కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీరాములు మాట్లాడుతూ టిడిపి నాయకులు, సిఎం చంద్రబాబు అమరావతిని ఫ్రీజోన్‌గా ప్రకటించకుండా సిఆర్‌డిఎ పరిధిలో దాదాపు 3వేల ఉద్యోగాలు ఇచ్చారన్నారు. ఉద్యోగాల భర్తీలో రాయలసీమ వాటా 40 శాతం ఉద్యోగాలు ఇవ్వకుండా సిఎం మోసం చేస్తున్నారని ఆరోపించారు. దీంతో ఆర్పీఎస్ అధ్యక్షుడు బైరెడ్డి రెండు రోజుల దీక్షకు పూనుకుంటే పోలీసు అధికారులు అధికార పార్టీ తొత్తులుగా మారి దీకుకు అనుమతి ఇవ్వలేదని మండిపడ్డారు. రాయలసీమ హక్కుల పేరుతో పదవులు తెచ్చుకున్న నాయకులు సీమ వాటాపై ఎందుకు స్పందించడం లేదో అర్థం కావడం లేదన్నారు.
మల్లన్న సేవలో ఎమ్మెల్సీ శిల్పా
శ్రీశైలం, జనవరి 19: శ్రీశైల మహాక్షేత్రంలోని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్లను ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణిరెడ్డి గురువారం ఉదయం దర్శించుకొని సేవించుకున్నారు. వీరికి ఆలయ రాజగోపురం వద్ద ఆలయ అధికారులు స్వాగతం పలికారు. అనంతరం స్వామి వారికి అభిషేకం, అమ్మవారికి కుంకుమార్చనాది ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. అమ్మవారి ఆశీర్వచన మండపంలో ఆలయ వేదపండితులు ఎమ్మెల్సీని ఆశీర్వదించి స్వామి వార్ల తీర్థ ప్రసాదాలు అందించారు. వీరితోపాటు స్థానిక టిడిపి నాయకులు రజాక్, వెంకటరమణ, కార్యకర్తలు ఉన్నారు.
కెవిఆర్ జూనియర్ కళాశాల
విద్యార్థినుల నిరసన
కర్నూలు ఓల్డ్‌సిటీ, జనవరి 19:నగరంలోని కెవిఆర్ కళాశాలలో జూనియర్ కశాలకు కనీసం 4 ఎకరాల స్థలం కేటాయించి భవన నిర్మాణం, హాస్టల్ వసతి కల్పించాలని కోరుతూ గురువారం కెవిఆర్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా అసోసియేషన్ కార్యదర్శి సలాం మాట్లాడుతూ కెవిఆర్ జూనియర్ కళాశాల 1958లో పియుసి కాలేజీ అటాచ్ హాస్టల్‌తో నివాస కళాశాలగా ఏర్పడి డిగ్రీ కాలేజీగా అప్‌గ్రేడ్ అయిందన్నారు. 1996 వరకూ డిగ్రీ కాలేజీతో కాంపోజిట్‌గా ఉంటూ తర్వాత ఇంటర్ డిగ్రీ కాలేజీలుగా విభజించారన్నారు. జీఓ 197ను పక్కన పెడ్టి డిగ్రీ కళాశాల యాజమాన్యం జూనియర్ కాలేజీను నిర్వీర్యం చేస్తున్నారని, క్యాంపస్ మాది మేము చెప్పినట్లు వినాలని ఆంక్షలు పెడుతున్నారన్నారు. గత ఏడాది మార్చిలో కాలేజీకు స్థలం కేటాయించి తరగతి గదులు, వసతి గృహం అదే ప్రాంగణంలో కల్పించమని ఉన్నత విద్య ప్రధాన సంచాలకులకు, జిల్లా కలెక్టర్‌కు హైకోర్టు ఆదేశాలు ఇచ్చిందన్నారు. కానీ ఇంత వరకూ హైకోర్టు ఆదేశాలు అమలు కాకపోవడం శోచనీయమన్నారు. డిగ్రీ కళాశాల యాజమాన్యం వారు చట్టాన్ని బేఖతారు చేసి జూనియర్ కళాశాల విద్యార్థినులను బయటకు నెట్టారని ధ్వజమెత్తారు. తక్షణమే హైకోర్టు ఆదేశాలు అమలయ్యేలా చూడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ధర్నాలో కళాశాల విద్యార్థినులు పాల్గొన్నారు.
ఆధునిక వ్యవసాయంపై
రైతులకు అవగాహన కల్పించాలి
* ఎమ్మెల్యే బిసి జనార్ధనరెడ్డి
బనగానపల్లె, జనవరి 19:ఆధునిక వ్యవసాయంపై రైతులకు అవగాహన కల్పించేందుకు వ్యవసాయ విశ్వవిద్యాలయం, శాస్తవ్రేత్తలు కృషి చేయాలని ఆచార్య ఎన్‌జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ కమిటీ సభ్యుడు, ఎమ్మెల్యే బిసి జనార్ధనరెడ్డి కోరారు. తిరుపతిలో ఆచార్య ఎన్‌జి రంగా విశ్వవిద్యాల యం ఆధ్వర్యంలో గురువారం ‘ట్రెండ్స్ ఇన్‌ఫర్మేషన్, మెకనైజేషన్ అండ్ ఇంజినీరింగ్ ఇంటర్వెన్షన్స్ ఫర్ అగ్రికల్చర్’ అనే ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే బిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఆధునిక వ్యవసాయ పరికరాలైన మినీ ట్రాక్టర్లు, ట్రాన్స్‌ప్లాంట్లు తదితర వాటిని పరిశీలించారు. అనంతరం జరిగిన సదస్సులో ఎమ్మెల్యే బిసి మాట్లాడుతూ విభజన కారణంగా రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిందన్నారు. ముఖ్యంగా ఆర్థిక సమస్యలు ఎదురయ్యాయని ఇలాంటి తరుణంలో వ్యవసాయం వెనుకబడకుండా వుండేందుకు, తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి సాధించేందుకు రైతులకు శాస్తవ్రేత్తల సలహాలు, సూచనలు, ఆధునిక పనిముట్ల అవసరం వుందన్నారు.
అలాగే మేలురకం విత్తనాల సేకరణ, సేంద్రియ ఎరువుల వాడకం, రసాయనిక ఎరువులు, పురుగుల మందు వాడకం తగ్గింపుపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. ఎక్కువ దిగుబడి ఇచ్చే వంగడాలను శాస్తవ్రేత్తలు రైతులకు అందుబాటులోకి తీసుకురావాలన్నారు. అభివృద్ధి చెందాలంటే కొంతభూమిని కోల్పోవాల్సి వస్తుందని అందుకు వున్న నేలలోనే పంటల దిగుబడి పెంచుకోవాల్సి వస్తుందని దీనిని శాస్తవ్రేత్తలు దృష్టిలో వుంచుకోవాలన్నారు. సేంద్రియ పద్ధతుల వల్ల పర్యావరణ పరిరక్షణ జరుగుతుందని, రైతుమిత్ర కీటకాలకు ప్రమాదం వాటిల్లదని తెలిపారు. శాస్తవ్రేత్తల సూచనలను రైతులు కూడా పాటించినప్పుడే ప్రయోజనం వుంటుందని ఇందుకు రైతులకు విస్తృతంగా అవగాహన సదస్సులు నిర్వహించేందుకు వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వం నుంచి కావాల్సిన సహకారం, నిధులు అందిస్తామని ఎమ్మెల్యే బిసి తెలిపారు.
తాగునీటికి ప్రతిపాదనలు
గోనెగండ్ల, జనవరి 19: గాజులదినె్న ప్రాజెక్టు నుండి గోనెగండ్లకు తాగునీటినిచ్చేందుకు రూ.2కోట్లతో ప్రతిపాదనలు పంపుతున్నట్లు ఎమ్మెల్యే బివి జయనాగేశ్వర్‌రెడ్డి తెలిపారు. గాజులదినె్న ప్రాజెక్టులోని నీటిని ఎత్తిపోతల పథకం ద్వారా పొనకలదినె్న 86 కాలువలకు తాగునీరు ఇవ్వాలని మండల రైతుల వినతి మేరకు గురువారం పై కాలువలను ఆయన పరిశీలించారు. మొదట గోనెగండ్ల ఎస్‌ఎస్ ట్యాంకును పరిశీలించారు. అనంతరం ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ రూ.20లక్షలతో గోనెగండ్ల ఎస్‌ఎస్ ట్యాంకు ఫిల్టర్ మరమ్మతులకు నిధులు మంజూరు చేశామని, నెలరోజుల్లో కాంట్రాక్టు పనిని పూర్తి చేయాలని ఆదేశించారు. మండలంలోని ఆలువాల ఎస్‌ఎస్ ట్యాంకును ఫిల్టర్ మరమ్మతులకు రూ.32లక్షలు నిధులు మంజూరైనట్లు తెలిపారు. గోనెగండ్లలో జనాభా పెరుగుతుండడంతో ఎస్‌ఎస్ ట్యాంకు నీరు సరిపోదని, తాగునీటి సమస్య లేకుండా గాజులదినె్న ప్రాజెక్టు వద్ద ఇన్‌టెక్ ఏర్పాటు చేసి గోనెగండ్ల గ్రామంలో నాలుగు ఓవర్‌హెడ్ ట్యాంకులు నిర్మించేందుకు రూ.2కోట్లతో ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. ఇప్పటికే మండలంలో 11 గ్రామాలకు తాగునీటి సమస్య తీర్చేందుకు రూ.13కోట్ల 50లక్షల నిధులు మంజూరు చేశామన్నారు. ఈకార్యక్రమంలో టిడిపి నాయకులు ప్రభాకర్‌నాయుడు, పార్వతమ్మ, హనుమంతు, కృష్ణ, సంజీవయ్య ఆచారి, గోవిందరాజులు, తదితరులు పాల్గొన్నారు.
సల్కాపురం నుంచి షిరిడికి పాదయాత్ర
ఆదోని, జనవరి 19: కర్నూలు సమీపంలోని సల్కాపురం శ్రీషిరిడి సాయి ఆశ్రమం నుంచి ఈనెల 15వ తేదీన పాదయాత్రగా షిరిడికి బయలుదేరిన భక్త బృందం గురువారం ఉదయం ఆదోనికి చేరుకుంది. ఆదోనిలోని శ్రీ షిరిడి సాయిబాబా ఆశ్రమం భక్తులు, ప్రజలు పాదయాత్రకు అపూర్వసాగతం పలికి భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు. ఉదయం ఆదోనిలోని షిరిడిసాయి ఆశ్రమం నుంచి ఎన్జీహోస్ కాలనీ నుంచి హౌసింగ్ బోర్డుకు చేరుకున్న సాయిబాబా పాదయాత్ర భక్తులకు మహిళలు రోడ్లుపైన ముగ్గులు వేసి స్వాగతం పలికారు. అనంరతం దారి పొడవునా భక్తులు పల్లకిలో వస్తున్న సాయి పల్లకికి బిందెలతో నీటిని పోసి బాబా విగ్రహానికి పూజలు చేశారు. ఈ పాదయాత్ర 32రోజులపాటు ప్రయాణం చేసి ఫిబ్రవరి 15వ తేదీన షిరిడికి చేరుకుంటుందని, సాయిబాబా ఆశ్రమం నిర్వాహకులు మడ్డి ఈరన్న, శేషులు తెలిపారు. పాదయాత్ర కర్నాటక చేరుకుని అక్కడి నుండి షిరిడికి చేరుకుంటుందన్నారు.
పంటనష్ట పరిహారం జాబితాలో
తప్పులకు బాధ్యులెవరు : ఎమ్మెల్యే బాల
పెద్దకడబూరు, జనవరి 19: అధికారుల నిర్లక్ష్యంతో రైతులకు మంజూరైన పంటనష్టం పరిహారం జాబితాలో జరిగిన తప్పులకు బాధ్యులు ఎవరని ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి ఎఓ హేమలతను, తహశీల్దార్ నాగరాజును నిలదీశారు. గురువారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఎంపిపి రఘురామ్ అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం జరిగింది. సమావేశానికి ముఖ్య అతిథిగాఎమ్మెల్యే హాజరై మాట్లాడుతూ 2015 ఖరీఫ్ సీజన్‌లో వర్షాభావ పరిస్థితుల మూలంగా దెబ్బతిన్న పంటలకు ప్రభుత్వం మంజూరు చేసిన రూ.17.5కోట్ల పంట నష్ట పరిహారం జాబితా అవక తవకలపై సర్వసభ్య సమావేశం వాడి వేడిగా జరిగింది. పరిహారం జాబితా తయారీలో రాజకీయ జోక్యం ఉందా అని ఎమ్మెల్యే అధికారులను నిలదీశారు. మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో జాబితా తప్పుల తడకగా ఉందని ఆగ్ర హం వ్యక్తం చేశారు. సెంటు భూమి లేని వందల మందికి జాబితాలో చోటు కల్పించడం ఏమిటని, వేలాది రూపాయా లు అనర్హుల బ్యాంకు ఖాతాలకు జమ చేయడం అధికారుల నిర్లక్ష్యమేనన్నారు. జాబితాలో నిజమైన రైతుల పేర్లు ఎలా గల్లంతు అయ్యాయని ప్రశ్నించారు. హెచ్. మురవణిలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు, హనుమాపురం గ్రామ శివారులోని శివాల గార్డెన్‌కు పంటనష్టం పరిహారం మంజూరు కావడం అధికారుల అలసత్వమేనన్నారు. దీనిపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామన్నారు. అనంతరం ఎఓ, తహశీల్దార్ నాగరాజు మట్లాడుతూ 2015 పంట నష్టం పరిహారం జాబితా తయారీకి ఏర్పాటు చేసిన ప్రత్యేక టీఎంతో జాబితా తయారైందని, జరిగిన తప్పులపై విచారణ చేసి అనర్హులను జాబితా నుంచి తొలగిస్తామని తెలిపారు. మండల పరిధిలో వివిధ గ్రామాల్లో 10వేల 782 మంది రైతులకు పరిహారం మంజూరైందని, ఇందులో 6వేల 630 మంది రైతులకు రూ.11కోట్ల వారి ఖాతాల్లో జమ చేశామన్నారు. మిగిలిన రైతులకు వారంలోగా పరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ రేణుకాదేవి, సొసైటీ అధ్యక్షులు హనుమంతరెడ్డి, అధికారులు పద్మజ, వెంకటరమణయ్య, విజయమాదురి, నరేంద్రకుమార్, హేమసుందర్, పుష్పావతి, వేణుగోపాల్, నాగసుబ్బయ్య, యుగందర్‌రెడ్డి, సర్పంచులు, ఎంపిటిసిలు, విఆర్‌ఓలు, పంచాయతీ సెక్రటరీలు పాల్గొన్నారు.
అధికారులను సస్పెండ్ చేయాలి
పంట నష్ట పరిహారం జాబితా తయారిలో నిర్లక్ష్యం చేసిన అధికారులను సస్పెండ్ చేయాలని గురువారం స్థానిక మండల పరిషత్ కార్యాలయం ముందు ధర్నా చేసి ఆందోళన చేశారు. సర్వసభ్య సమావేశాన్ని రైతులు అడ్డుకు ని భవనం ముందు బైఠాయించారు. ఈసందర్భంగా సిపిఐ నాయకులు విజయభాస్కర్‌యాదవ్, హనుమంతు, పటేల్, అంజినయ్య మాట్లాడుతూ జాబితా అవక తవకలుగా ఉందని వందల మంది నిజమైన రైతులకు అన్యాయం జరిగిందని ఆరోపించారు. రైతులు కానీ వారినికి ఎక్కువ మొత్తంలోమంజూరైందని దీనికి ఎఓ, తహశీల్దార్, విఆర్‌ఓలు బాధ్యత వహించాలని, జిల్లా అధికారులు స్పందించి వారిని సస్పెండ్ చేయాలని చేస్తూ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈకార్యక్రమంలో మాబూసాహెబ్, రామాంజినేయులు, అబ్దుల్, రైతులు పాల్గొన్నారు.
తల్లిదండ్రుల ఆదరణతో
శతమానంభవతి విజయవంతం
ఆదోనిటౌన్, జనవరి 19: ప్రతి కుటుంబంలోని తల్లిదండ్రులు శతమానంభవతి చిత్రాన్ని చూసి ఆదరిస్తున్నారని, వారి ఆదరణే చిత్రం విజయం ప్రధాన కారణమని చిత్రం నిర్మాత దిల్‌రాజ్, హీరో శర్వానంద్, హీరోహిన్ అనుపమ పరమేష్, దర్శకుడు వేగ్నేశ సతీష్‌లు స్పష్టం చేశారు. గురువారం పట్టణంలోని ద్వారాక సినిమా కాంప్లెక్స్ ఆధునీకరణ అనంతరం వారు ప్రారంభించి శతమానంభవతి చిత్రాన్ని తిలకించారు. ఆదోనిలో హైదరాబాద్ స్థాయి కన్నా మించి థియేటర్లు నిర్మించారని, సినిమాలో విజివల్స్ చాలా బాగా ఉన్నాయన్నారు. ముఖ్యంగా సంక్రాంతి కానుకగా వచ్చిన శతమానంభవతి చిత్రం పెద్ద హీరోల చిత్రాలు ఉన్నా కూడా కేవలం కుటుంబాలలోని తల్లిదండ్రులు, తాత లు, అవ్వలు ఆదరించడంతోనే మంచి కలెక్షన్లు వస్తున్నాయన్నారు. వారే ఈ చిత్రానికి ప్రధాన ప్రచారకులని వివరించారు. మేగస్టార్ చిరంజీవి సైతం తనకు ఫోన్ చేసి చిత్రం భాగా ఉందని పేర్కొనడం గర్వకారణమని నిర్మాత దిల్‌రాజ పేర్కొన్నారు. త్వరలో తాను చిరంజీవితో చిత్రం నిర్మించడానికి ప్రయత్నిస్తానని, మంచి కథ దొరికితే వెంటనే ఆచరిస్తానన్నారు. ఈ సంవత్సరం తాను నిర్మిస్తున్న మూడు చిత్రా లు నేను లోకల్, ఫిదా, డిజేలు విడుదల అవుతున్నాయని తాను ఇప్పటి వరకు 22 చిత్రాలు నిర్మించానన్నారు. హీరో శర్వానంద్ మాట్లాడుతూ తాను ఇప్పటి వరకు 25 చిత్రాలు నటించానని, శతమానం భవతి చిత్రానికి వస్తున్న ఆదరణ విశేషమన్నారు. ఈ కార్యక్రమంలో సినిమా థియేటర్ యజమానులు, శర్వానంద అభిమాన సంఘం నాయకులు శాంతరామ్, ఈరన్న, రాజు, విష్ణు, ఖలందర్, తదితరులు పాల్గొన్నారు.
కోటకందుకూరులో పూజలందుకున్న ఉత్సవ పల్లకి
ఆళ్లగడ్డ, జనవరి 19: పారువేట ఉత్సవాల్లో భాగంగా గురువారం ఉదయం ఆర్ క్రిష్ణాపురం గ్రామంలో పూజలందుకొని అక్కడి నుండి కోటకందుకూరు గ్రామం చేరుకుంది. శ్రీ జ్వాలా నరసింహస్వామి, శ్రీ ప్రహ్లాద వరద స్వామిలు కొలువు దీరిన ఉత్సవ పల్లకికి గ్రామస్ధులు, అధికారులు పెద్ద ఎత్తున తరలివెళ్లి స్వాగతం పలికారు. గ్రామంలో ఉదయం నుండి రాత్రి వరకు ప్రజల నుండి పూజలందుకొని స్వామి పల్లకి తెలుపుల వద్ద ఆశీనులై ప్రజల నుండి పూజలందుకున్నారు. భక్తులు పల్లకిలో కొలువైన శ్రీ జ్వాలానరసింహస్వామిని, శ్రీ ప్రహ్లాదవరదున్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. స్వామి గ్రామంలోకి చేరుకోగానే తిరుణాల వాతావరణం నెలకొంది.
నియోజకవర్గం అన్నివిధాల అభివృద్ధి
ఎమ్మిగనూరు, జనవరి 19: టిడిపి అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాల్లో ఎమ్మిగనూరు పట్టణం, నియోజవర్గంలో అన్ని విధాల అభివృద్ధి చేయడం జరిగిందని, ఈ అభివృద్ధి దాదాపు రూ.75కోట్ల వరకు జరిగాయని ఎమ్మెల్యే డాక్టర్ బివి.జయనాగేశ్వర రెడ్డి అన్నారు. గురువారం మున్సిపల్ ఛాంబర్‌లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గోనెగండ్ల మండంలోని ఆర్‌డబ్ల్యూఎస్ సబ్ డివిజన్ కింద రూ.9కోట్ల 80 లక్షలు, అలాగే ప్రొవైడింగ్ స్కీం కింద రూ.5 కోట్లు, ఎమ్మిగనూరు మండలం వాటర్ సప్లై స్కీం కింద రూ.9కోట్ల 29లక్షలు, ఎమ్మిగనూరు పట్టణంలో ఐపిడిఎస్ స్కీం కింద రూ.కోటి 20 లక్షలు, కోటేకల్‌లో ఆర్‌ఇసి కింద రూ.కోటి, బాలికల హాస్టల్, మోడల్ స్కూల్ బిల్లిడింగ్‌కు రూ.కోటి 28లక్షలు, నాబార్డ్ కింద రు.3కోట్ల 50 లక్షలు, ఆర్‌అండ్‌బి కింద రూ.8కోట్ల 20 లక్షలు, ఎమ్మిగనూరు కాన్సిటెన్షన్ పనులు కింద రూ.7కోట్ల 14 లక్షలు, ఎమ్మిగనూరు మండలంకు ఇంఫ్రూమెంట్ కింద రూ.కోటి, నందవరం మండలంలో ఆర్‌ఆర్ ప్లాన్ కింద రూ.కోటి తదితర డెవలంప్‌మెంట్ కింద అభివృద్ధి పనులు పూర్తి అయ్యాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. చర్రితకు నిలయంగా నిలబెట్టుందుకు నా తండ్రి మాజీ మంత్రి బివి.మోహన్ రెడ్డి చివరి కోరికగా పట్టణంకు ఎస్‌ఎస్ ట్యాంక్ నిర్మాణం తీసుకురావడమే తమ లక్ష్యమన్నారు. చేనేతలకు త్వరలో టెక్స్‌టైల్ పార్క్‌కు సిఎం చంద్రబాబు శంకుస్థాపన చేస్తారన్నారు. ఇప్పటికే చేనేతలకు రెండు క్లస్టర్లు మంజూరయ్యాయని, తాను ఎన్నికల ముందు ఏవైతే హామీలు ఇచ్చానే అవి నెరవేరుస్తున్నానన్నారు. సిఎం చంద్రబాబు ఆశీర్వాదంతో ఆర్టీఎస్ కుడి కాలువ పనులు సర్వే పనులు జరుగుతున్నాయని, 10 సంవత్సరాలుగా ఎవరూ వేయని గంజళ్ల రోడ్డును తాము వేయిస్తే కొందరూ గిట్టని వాళ్లు పిటీషన్లు వేస్తున్నారని, అభివృద్థికి అడ్డుపడుకుంగా రాజకీయంగా ఎదుర్కోవాలని ఎమ్మెల్యే అన్నారు. నా తండ్రి బివి స్ఫూర్తితో ప్రజా సేవ, అభివృధ్ధి పనులు చేస్తున్నానన్నారు. మంత్రాలయం-కర్నూలు రైల్వే లైన్‌కు కేంద్ర మంత్రి సురేష్ ప్రభుకు కూడా తెలియజేశామని, త్వరలోనే రైల్వేలైన్ వస్తుందన్నారు. పట్టణంలో వేసవి కాలంలో ప్రజలకు నీటి సౌకర్యాంలో ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్ కొండయ్య చౌదరి, పట్టణ అధ్యక్షడు అజ్మతుల్లా,కౌన్సిలర్లు నాయకులు పాల్గొన్నారు.

వ్యక్తి ఆత్మహత్య
నంద్యాల టౌన్, జనవరి 19: నంద్యాల మూడవ పట్టణ పోలీసు స్టేషన్ పరిధిలోని నూనెపల్లెకు చెందిన బాలస్వామి (48) ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. రైల్వే కాంట్రాక్టర్‌గా పనిచేస్తున్న బాలస్వామి కొద్ది రోజుల నుండి ఏ పని దొరకక పోవడంతో మనస్థాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడినట్లు చెప్పారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. భార్య శాంతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
మాజీ సర్పంచ్‌పై హత్యయత్నాం
ఆస్పరి, జనవరి 19: మండల పరిధిలోని ములుగుందం గ్రామం మాజీ సర్పంచ్ మల్లికార్జునరెడ్డిపై కైరుప్పుల గ్రామానికి చెందిన మారెన్నతోపాటు మరో ఐదుగురు హత్యయత్నానికి పాల్పడ్డారని ఎస్‌ఐ వెంకటరమణ గురువారం తెలిపారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకోని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
మట్కాబీటర్లకు కౌనె్సలింగ్
మండలంలోని గ్రామాల్లో మట్కా నిర్వహిస్తున్న నిర్వాహకులకు ఎస్‌ఐ వెంకటరమణ గురువారం కౌనె్సలింగ్ ఇచ్చారు. అనంతరం ఎస్‌ఐ మాట్లాడుతూ మండలంలో ఎటువంటి వారైనా మట్కా, పేకాట నిర్వహిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గ్రామాల్లో శాంతిభద్రతలకు విఘాతం కల్గిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
సాయిబాబా ఆలయంలో హుండీ చోరీ
ఆళ్లగడ్డ, జనవరి 19: పట్టణ శివార్లలోని ఎంవి నగర్ వద్ద వున్న షిర్డీ సాయినాథుని ఆలయంలో రాత్రి గుర్తు తెలియని దుండగులు ప్రవేశించి హుండీని పగల గొట్టి అందులోని నగదును దోచుకెళ్లినట్లు ఎస్‌ఐ చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. ఎస్‌ఐ తెలిపిన వివరాల మేరకు బుధవారం రాత్రి 9.30 గంటలకు అర్చకులు ఆలయం తలుపులు మూసి వేసి ఇంటికి వెళ్లిపోయాడన్నారు. తెల్లవారుజామున 3 గంటలకు ఆలయం తెలుపులు తెరిచే సరికి ఆలయంలో వున్న హుండీ పగలగొట్టి అందులో వున్న నగదును గుర్తుతెలియని దుండగులు దోచుకొని వెళ్లారన్నారు. ఇందుకు సంబందించి ఆలయ కమిటీ కార్యదర్శి రాంమ్మోహన్‌మల్లిక్ పిర్యాదు చేశారన్నారు. హుండీలో దాదాపు రూ. 15 వేలు చోరీకి గురైవుంటుందని ఫిర్యాదులో పేర్కొన్నారన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు.
చాగలమర్రి తహశీల్దార్‌పై కేసు నమోదు
ఆళ్లగడ్డ, జనవరి 19: నియోజకవర్గంలోని చాగలమర్రి మండల తహశీల్దార్ మాలకొండయ్యపై కేసు నమోదు చేసినట్లు పట్టణ ఎస్ చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. ఇందుకు సంబందించి ఎస్ ఐ తెలిపిన వివరాల మేరకు ఆళ్లగడ్డ పట్టణంలోని పుల్లారెడ్డివీధికి చెందిన బర్నబాస్ అనే వ్యక్తి తహశీల్దార్‌పై పిర్యాదు చేశారన్నారు. 2013 వ సంవత్సరంలో ఆళ్లగడ్డ తహశాల్దార్ మాలకొండయ్య తాను ఎస్సీ మాల కులానికి చెందిన వాడైననూ, బిసి -సి ధ్రువీకరణ పత్రం మంజూరు చేశారన్నారు. తిరిగి 2015లో అదే తహశీల్దార్ ఎస్సీ మాల కుల ధ్రువీకరణ పత్రం మంజూరు చేశారన్నారు. దీంతో ఒకే తహశీల్దార్ ఒక కేసు విషయంలో వేరు వేరు ధ్రువీకరణ పత్రాలు మంజూరు చేయడం వల్ల తనకు అన్యాయం జరిగిందిని బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నారన్నారు. బర్నబాస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు తహశీల్దార్ మాలకొండయ్యపై కేసు నమోదుచేసినట్లు తెలిపారు.