కర్నూల్

స్వామివారికి అశ్వవాహన సేవ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆళ్లగడ్డ, మార్చి 11: పుణ్యక్షేత్రమైన దిగువ అహోబిలంలో ఉత్సవమూర్తి శ్రీ ప్రహ్లాదవరదుడు అశ్వవాహనంపై విహరించాడు. ప్రహ్లాద వరదునికి ప్రత్యేక అలంకారం చేసి ప్రధాన అర్చకులు వేణుగోపాలన్ ప్రత్యేక పూజలనంతరం అశ్వవాహనంపై ఆశీనులను చేసి గ్రామోత్సవం నిర్వహించారు. కలియుగంలో నరులను రక్షించడం కోసం భగవంతుడు కల్కి అవతారం ఎత్తి అశ్వంపై విహరిస్తారు. అందువల్ల అశ్వవాహనంపై కొలువుదీరిన స్వామిని దర్శిస్తే జ్ఞానం సిద్ధిస్తుందని ప్రతీతి. ఆలయ ఇఓ మల్లికార్జున ప్రసాద్ ఆధ్వర్యంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి.
స్వర్ణ శోభిత ఆభరణాలు విరాళం
స్వర్ణ తాపిత ఆభరణాలను వెంకటవరదన్ దంపతులు ఎగువ, దిగువ అహోబిలాల్లో కొలువైన రామానుజాచార్యులు, వేదాంత దేశికులు, మొదటి జియ్యర్ ఆదివన్ శఠగోప యతీంద్ర మహాదేశికన్‌స్వామి, 6వ జ్యియర్ షష్ట పరాంకుశ యతీంద్ర మహాదేశికన్ స్వామికి అలంకరంచేందుకు కవచములు, కిరీటాలు స్వర్ణతాపితములను ఆలయ జిపిఎ సంపత్, ఇఓ మల్లకార్జున ప్రసాద్ చేతుల మీదుగా ఆలయ ప్రధానార్చకులు కిడాంబి వేణుగోపాలాచార్యులకు అందజేశారు.
ఎన్నికల విధుల పట్ల
నిర్లక్ష్యం వహిస్తే జైలుశిక్ష
కర్నూలుటౌన్, మార్చి 11: స్థానిక సంస్థల ఎన్నికల్లో విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే బాధ్యులైన వారికి జైలు శిక్షనేనన్ని జాయింట్ కలెక్టర్ హరికిరణ్ అన్నారు. శనివారం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో స్థానిక సంస్థల ఎన్నికల విధులు నిర్వహించే పిఓ, ఎపిఓలకు శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈసందర్భంగా జెసి మాట్లాడుతూ సాధారణ ఎన్నికలకు, స్థానిక సంస్థల ఎన్నికలకు చాలాతేడా అని సాధారణ ఎన్నికల్లో ఓటువేసిన వారికి వేలుకు సిరాగుర్తు వేస్తారని, ఈ ఎన్నికల్లో అలాంటిది ఏమి వుండదన్నారు. ముఖ్యంగా పిఓలు, ఎపిఓలు పోలింగ్‌కేంద్రాల్లో విధులు నిర్వహించే సిబ్బంది కలిసి కట్టుగా విధులు నిర్వహించాలని, ఎవరికి వారు నిర్ణయం తీసుకుంటే నష్టపోయే ప్రమాదం వుందన్నారు. పిఓ 1,2 ఇద్దరు పోలింగ్ ఏజెంట్లపై నిఘా వుంచాలని, ఏజెంట్లను ప్రతి కేంద్రం బయటికి వెళ్లకుండా చూడాలన్నారు. ముఖ్యంగా మద్యాహ్నాం 2.30 తర్వాత పోలింగ్ ఏజెంట్లను బయటికి పంపకూడదని, దీని వల్ల పెద్ద ప్రమాదం వుంటుందన్నారు. ఏజెంట్ల ఏర్పాట్లలో కూడా ఎన్నికల నిబంధనల మేరకు పాటించాలని, ఏజెంట్ల యొక్క నడవడికను పరిశీలించి అవసరమైతే ఆర్‌ఓ దృష్టికి తీసుకరావాలన్నారు. పోలింగ్ ప్రారంభం నుండి ముగిసే వరకు ఎన్నికల విధులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ఎన్నికల నిబంధనలపై నంద్యాల ఆర్డీఓ రామసుందర్‌రెడ్డి, కర్నూలు ఆర్డీఓ హుసేన్ సాహెబ్, ఆదోని ఆర్డీఓఓ ఓబులేసులు వివరించారు. పిఓలు అడిగిన ప్రశ్నలకు జెసి, ఆర్డీఓలు సమాధానం ఇచ్చారు. గతంలో ఎన్నికల విధులో ఎదురైన సంఘటనలు కూడా ఈసందర్భంగా వివరించారు. ఈ శిక్షణ తరగతులో డిఆర్‌ఓ గంగాధర్‌గౌడ్, జడ్పీ సిఇఓ ఈశ్వర్, సిపిఓ కార్యాలయ సిబ్బంది, పిఓలు, ఎపిఓలు తదితరులు పాల్గొన్నారు.
పాఠశాలలో
హోలీ సంబరాలు
నందికొట్కూరు, మార్చి 11 : పట్టణంలోని స్కాలర్స్ హైస్కూల్‌లో శనివారం ముందస్తు హోలీ సంబరాలు నిర్వహించా రు. వివిధ రకాల రంగులను విద్యార్థులకు అందజేసి ఒకరికొకరు రంగులు పూసుకుం టూ హోలీ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. పాఠశాల డైరెక్టర్ కాళ్లూరి శివప్రసాద్, కరస్పాండెంట్ కాళ్లూరి లక్ష్మి హోలీ పండుగ విశిష్టతను విద్యార్థులకు వివరించారు.