కర్నూల్

భూమా చివరి కోరికలపై సర్వత్రా చర్చ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, మార్చి 13 : హఠాన్మరణానికి గురైన నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి చివరి కోరికలపైనే సోమవారం ఆళ్లగడ్డలో ప్రధానంగా చర్చించుకున్నారు. ఆయన చివరి ఘడియ ల్లో కూడా తాను నంద్యాల ప్రజలకు ఇచ్చిన హామీలపైనే ఆలోచించడం వెనుక పట్టుదల ఏంటో అందరికీ అర్థమవుతోందని ఆళ్లగడ్డకు వచ్చిన ప్రముఖులతో పాటు సామాన్య జనం చెప్పుకోవడం గమనార్హం. భూమా నాగిరెడ్డి ఏడాది కాలంగా ఆరోగ్య సమస్యను ఎదుర్కొంటున్నట్లు సన్నిహితుల ద్వా రా తెలుస్తోంది. గతంలో గుండె శస్తచ్రికిత్స చేయించుకున్నా ఇంకా కొంత ఇబ్బందిగానే ఉన్నారని, దీంతో నిత్యం ఏదో ఒక ఆలోచన చేస్తూ ఆందోళనతో గడిపేవారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తన పిల్లల భవిష్యత్తుపై దృష్టి సారించిన భూమా ఒక దశలో రానున్న ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయానికి కూడా వచ్చారంటే అనారోగ్య సమస్యే కారణమని వెల్లడిస్తున్నారు. అయితే వచ్చే ఎన్నికల నాటి కి తాను నంద్యాల ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు పట్టణంలో రహదారుల విస్తరణ, అర్హులైన వారందరికీ పక్కా గృహాల మంజూరుపై ఎక్కువగా శ్రమిస్తున్నట్లు సన్నిహితులు వెల్లడిస్తున్నారు. ఈ రెండింటినీ నెరవేర్చి ఆళ్లగడ్డకు వెళ్లి కుమార్తె అఖిలప్రియను రాజకీయంగా ఉన్నతస్థాయికి తీసుకెళ్లడానికి అవరసమైన కార్యక్రమం చేపడుతూ కుమారుడు జగత్‌విఖ్యాత్‌రెడ్డిని వ్యాపార రంగంలో స్థిరపడేందు కు అవసరమైన ప్రణాళిక సిద్ధం చేయాలని ఆయన భావించినట్లు తెలుస్తోం ది. గత మూడేళ్లలో తన హామీల అమలుకు ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోయానని పదేపదే ప్రజలకు ఏం చెప్పాలో అర్థం కావడం లేదని సన్నిహితుల వద్ద అనే వాడని చర్చించుకుంటున్నారు. ఇక ముందు ఎన్నికల్లో హామీలు ఇవ్వకూడదని తనకు తెలిసొచ్చిందని వాపోయేవారంటున్నారు. నంద్యాల రహదారుల విస్తరణ, పక్కా గృహాల విషయంలో శిల్పా సోదరులతో విభేదాలు ఉన్నాయని అంతకు మించి ఏమీ లేదని భూమా అభిమానులు వెల్లడిస్తున్నారు. అయితే తన హామీలపై శనివారం చంద్రబాబు ఇచ్చిన భరోసాతో కొంత ఆనందంగా ఉన్నారని, అయితే ఆదివారం అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో మరణించడం అందరినీ కలచివేస్తోంది.
బాబుతో భూమా చివరి మాటలు.!
‘ఆరోగ్యం సరిగ్గా లేదు.. పిల్లల భవిష్యత్తుపై దృష్టి పెట్టాలి.. గత ఎన్నికల్లో ఇచ్చిన రెండు ప్రధాన హామీలు నెరవేర్చాల్సి ఉంది.. అవి నెరవేరితే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలన్న ఆలోచన లేదు.. ఈ పరిస్థితుల్లో ఎవరితోనూ విబేధాలు పెంచుకోదల్చుకోలేదు.. ఎవరు నమ్మినా నమ్మకపోయినా పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటా.. శిల్పా విజయానికి నావంతు కృషి చేస్తా.. ఇంత కంటే నేనేమీ చెప్పలేను.. ప్రజల కోరిక మేరకు విస్తరణ కార్యక్రమం చేపడతానని హామీ ఇస్తే ఆపని చేయకుండా అడ్డుకుంటున్నారు.. ఇదేమని ప్రశ్నిస్తే వైకాపాలో ఉన్నపుడు కేసులు, ఇపుడు మీకు ఫిర్యాదులు.. పార్టీలో చేరి ఏడాది గడిచినా ఇంత వరకు ఒక అడుగు రహదారి కూడా విస్తరించలేకపోయా.. ఒక్క పక్కాగృహం ఇవ్వలేకపోయా.. ఈరెండే నాకు అత్యంత ప్రధానం.. ఆరోగ్యం బాగుంటే 2019 ఎన్నికల్లో పోటీ గురించి ఆలోచిస్తా.. ఇపుడైతే ఏమీ చెప్పలేను’ అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి అన్న చివరి మాటలు. కర్నూలు జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి శిల్పా చక్రపాణిరెడ్డికి సహకరించడం లేదన్న ఫిర్యాదు మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు భూమా నాగిరెడ్డికి కబురుపెట్టడంతో శనివారం పలువురు జెడ్పీటీసీలు, ఎంపిటీసీలు, పురపాలక సంఘ సభ్యులతో కలిసి అమరావతి వెళ్లి సీఎంను కలిశారు. ఈ సందర్భంగా ఆయన అనేక అంశాలపై విడిగా మాట్లాడి చివర్లో తన వెంట వచ్చిన స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి చంద్రబాబుతో మాట్లాడి తిరిగి వచ్చే సమయంలో అన్న మాటలివేనని ఇప్పుడు చర్చించుకుంటున్నారు. 2014 ఎన్నికల్లో నంద్యాల ప్రజలకు ఇచ్చిన హామీ ప్రకారం పట్టణంలో రహదారుల విస్తరణ, ఇందిరమ్మ పక్కాగృహాల్లో జరిగిన అవకతవకలపై విచారణ నిర్వహించి అనర్హుల స్థానంలో కొత్తగా అర్హులైన వారికి 10వేల పక్కాగృహాలు మంజూరు చేయాలని, అలాగే నంద్యాల, ఆళ్లగడ్డ నియోజకవర్గాల్లో తాగునీటి సమస్య పరిష్కారానికి నిధులు విడుదల చేయాలని కోరినట్లు తెలుస్తోంది. దీనిపై చంద్రబాబు స్పందించి ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే తగిన చర్యలు తీసుకుంటానని, ఆందోళన చెందవద్దని పేర్కొంటూ ఆరోగ్య పరిస్థితులపై విచారించినట్లు తెలుస్తోంది. అంతా విన్నాక ఎక్కువ విశ్రాంతి తీసుకుంటూ ప్రశాంతంగా ఉండాలని సూచించినట్లు తెలుస్తోంది. అంతేగాక మీ హామీలునెరవేర్చడానికి తగిన చర్యలు తీసుకుంటానని భరోసా ఇచ్చి పంపారని ఆయన వెంట వెళ్లిన స్థానిక ప్రజాప్రతినిధులు వెల్లడించినట్లు ఆళ్లగడ్డలో చర్చించుకుంటున్నారు.