కర్నూల్

రిజర్వేషన్లు రద్దు చేయాలని చూస్తే సహించం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు సిటీ, మార్చి 13:్భరత రాజ్యాంగ నిర్మాత డా. బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించి అందులో ఎస్సీ, ఎస్టీ, బిసిలకు రిజర్వేషన్ల సౌకర్యం కల్పించాలని రాస్తే, ఆ రిజర్వేషన్లను రద్దు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నుతుందని, రిజర్వేషన్లను రద్దు చేయాలని చూస్తే సహించేది లేదని సిపిఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి హెచ్చరించారు. నగరంలోని నంద్యాల చెక్‌పోస్ట్ నుంచి సి.క్యాంప్ వరకూ సోమవారం సామాజిక హక్కుల వేదిక ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి, అనంతరం అక్కడ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సభలో సురవరం ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో వెనుకబడిన సామాజిక ఓటర్ల సంఖ్య 85శాతం ఉంటే 15 శాతం అగ్రవర్ణాలకు చెందినవి ఉన్నాయన్నారు. కానీ 15శాతం ఉన్న వర్గాలే అధికారాన్ని దక్కించుకుని పాలన కొనసాగిస్తూ ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీలను అణగదొక్కాలనే ప్రయత్నం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సామాజిక న్యాయాన్ని పాటించకుండా ఎస్సీ, ఎస్టీ, బిసిలకు అన్యాయం చేయాలని చూస్తున్నాయని, ఖచ్చితంగా సామాజిక న్యాయాన్ని పాటించాలని డిమాండ్ చేశారు. అన్ని వర్గాలు ఒక తాటిపైకి వచ్చి చైతన్యవంతులై పోరాటాలు చేస్తేనే సామాజిక న్యాయం జరుగుతుందన్నారు. బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ దేశానికి స్వాంతంత్య్రం వచ్చి 70 ఏళ్లు దాటినా హక్కుల కోసం పోరాటం చేయాల్సిన పరిస్థితి ఉందన్నారు. కేవలం 5శాతం ఉన్న అగ్రవర్ణాలు దాదాపు 95శాతం ఉన్న సామాజిక వర్గాలను పాలించడం ఏంటని ప్రశ్నించారు. తక్షణమే అన్ని సామాజిక వర్గాలకు ఆర్థికంగా, రాజకీయంగా ఎవరి వాటా వారికి ఇవ్వాలని లేనిచో పెద్దఎత్తున ఆందోళనలు చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ సామాజిక వర్గాలకు అన్యాయం చేయాలని చూస్తే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు మనుగడే ఉండదని హెచ్చరించారు. కార్పొరేట్ సంస్థలకు వేలాది ఎకరాలను ధారాదత్తం చేస్తున్న ప్రభుత్వాలు పేద వాడికి సెంటు స్థలాన్ని ఇవ్వటానికి ఎందుకు నిరాకరిస్తున్నాయని ప్రశ్నించారు.
వెనుకబడిన సామాజిక వర్గాలకు చెందిన ప్రజలు రాజ్యాధికారం సాధించుకునే దిశగా చైతన్యవంతులను చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో సామాజిక శంఖారావం, ప్రజా చైతన్య యాత్ర చేపట్టామని స్పష్టం చేశారు. సభలో వేదిక రాష్ట్ర నాయకు లు సత్యనారాయణమూర్తి, ఏపి రైతు సంఘం నాయకులు పి.రామచంద్ర య్య, ఏపి గిరిజన సమాఖ్య రాష్ట్ర కా ర్యదర్శి గోవిందు, సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు షడ్రక్, బిసి జన సభ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శేషఫణి, ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లెనిన్‌బాబు, సామాజిక హక్కుల వేదిక జిల్లా కన్వీనర్ జగన్నాథం, సిపిఐ నగర కార్యదర్శి రసూల్ పాల్గొన్నారు.