కర్నూల్

మహానందీశ్వరుని సన్నిధిలో దివ్యదర్శనం భక్తులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహానంది, మార్చి 25: మహానందిలో దివ్యదర్శన భక్తులు శ్రీ కామేశ్వరి సమేత మహానందీశ్వర స్వామి వార్లను దర్శించుకున్నారు. శనివారం కడప జిల్లాకు చెందిన భక్తులు దాదాపు 200 మందికి పైగా స్వామి వార్ల దర్శనానికి రాగా పర్యవేక్షకులు ఈశ్వర్‌రెడ్డి, ఇన్‌స్పెక్టర్ సురేంద్రనాధరెడ్డిలు ఆవారికి స్వాగతం పలికారు. అనంతరం వారు పుష్కరిణిలలో పుణ్యస్నానాలు ఆచరించి శ్రీ స్వామి అమ్మ వార్లను దర్శించుకున్నారు. అభిషేక మండపంలో వేదపండితులు రవిశంకర్ అవధాని, నాగేశ్వర శర్మ, శాంతారామ్‌భట్‌లు భక్తులను ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందించారు.
కన్నడిగులతో కళకళ
మహానంది పుణ్యక్షేత్రం కన్నడిగులతో కళకళలాడింది. ఉగాది పర్వదినం పురస్కరించుకొని కర్నాటక, మహారాష్ట్ర నుండి వేలాది మంది భక్తులు శ్రీశైల భ్రమరాంబిక మల్లికార్జున స్వామి వార్ల దర్శనం అనంతరం శ్రీ మహానందీశ్వర స్వామి వార్లను దర్శించుకుంటారు. ఇందులో భాగంగానే శనివారం వేలాది మంది భక్తులు స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు భక్తులు నిర్వరామంగా దర్శనానికి బారులు తీరారు. ఆలయంలోని పుష్కరిణిలలో పుణ్యస్నానాలు ఆచరించి క్యూలైన్లలో వేచి ఉండి స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. అనంతరం మహానంది ప్రత్యేకత అయిన పట్టుడు కర్ర, బొమ్మలు, చాటలను కొనుగోలు చేశారు.
ఘనంగా పాపమ్మ అవ్వ
ఆరాధనోత్సవాలు
ఆదోని, మార్చి 25: ఆదోనిలో మరాట వాడిలో సర్కార్ వలీ స్వామి జ్ఞాన మందిరంలో ఉన్న పాపమ్మ అవ్వ మఠంలో శనివారం అవ్వ 61వ ఆరాధన మహోత్సవం ఘనంగా భక్తులు నిర్వహించారు. ముందుగా పాపమ్మ అవ్వ సమాధికి ఉదయం ఐదు గంటల నుండి 9 గంటల వరకు అభిషేకాలు, ఆలంకరణ, అర్చన, నైవేద్యం కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం శ్రీ సర్కార్ వలీ స్వామి మందిరం పాపమ్మ మఠం నుంచి పూల చద్దర్‌తో ఊరేగింపు నిర్వహించి సర్కార్ వలీ స్వామి దర్గా వద్దకు తీసుకొచ్చి అక్కడ సర్కార్ వలీ సమాధిపై పూల చద్దర్ వేసి ప్రార్థనలు చేశారు. మఠంలో భక్తులకు అన్నదానం చేశారు.
ఘనంగా రథోత్సవం
ఆదోనిలోమరాటి వీధిలో వెలసిన పాపమ్మ అవ్వ ఆరాధన సందర్భంగా శనివారం సాయంత్రం పాపమ్మ అవ్వ చిత్రపటాన్ని పూలరథంపై ఉంచి రథోత్సవాన్ని కన్నుల పండువగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని రథోత్సవాన్ని తిలకించారు. ఈ రథోత్సవంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకుకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
మత ఘర్షణ కేసులు ఎత్తివేయాలి
ఆదోని, మార్చి 25: ఆదోనిలో 2011లో జరిగిన మత ఘర్షణలో పెట్టిన కేసులను ఎత్తివేయాలని ఆదోనిలోని వివిధ రాజకీయ పార్టీల నాయకులు శనివారం ఎస్పీ రవికృష్ణను కలిసి వినతిపత్రం అందజేశారు. ఎస్పీతోనాయకులు అమాయకులపైన కేసులు పెట్టారన్నారు. ఎస్పీ వారితో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. బిజెపి నాయకులు కునిగిరి నాగరాజు, బిజెవైఎం నాయకులు నీలకంఠప్ప, కాంగ్రెస్ నాయకులు మాజీ కౌన్సిలర్లు దీలీప్‌డోకా, రామచంద్ర, మైనార్టీ నాయకులు ప్రముఖ న్యాయవాది మన్సూర్ అహ్మద్, యాసీన్‌బాషా, సౌదీరవూఫ్, షాషావలీ, ఎంఐఎం నాయకులు ఉమ్మిసోఫి, బిజెపి నాయకులు ఈరన్న, గోపాల్, నారాయణ, విజయ్‌కృష్ణ, జిందేసాయికుమార్, రాఘవేంద్రరావు, తదితరులు కలిసి కేసులు ఎత్తివేయాలని కోరారు.