కర్నూల్

ఆదోని మున్సిపాలిటీలో పేరుకుపోయిన మార్కెట్ బకాయిలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదోని, మార్చి 25: ఆదోని మున్సిపాలిటీలో ఇంటి పన్ను, నీటి పన్ను ప్రజల వద్ద నుండి వసూళ్లు చేయడానికి ప్రత్యేక బృందాలను వేసి వసూళ్లుకు పూనుకున్న మున్సిపల్ అధికారులు రూ.కోటి 66లక్షలకు చేరుకున్న వివిధ మార్కెట్ల కాంట్రాక్టర్ల బకాయిలను వసూళ్ళు చేయడంలో ఒత్తిళ్ళకు గురై నిర్లక్ష్యం వహిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. రాజకీయాలకు తలొగ్గి ఏమీచేయలేకపోతున్నారు. దీంతో మార్కెట్ కాంట్రాక్టర్ల బకాయిలు రూ.కోటి 66లక్షలకు చేరుకున్నాయి. ఇంటి పన్ను, నీటి పన్నులు కట్టని ప్రజల ఇండ్లకు తాళం వేస్తున్నారు. ఇటీవలనే రాయలసీమ మిల్ యజమానులు ఇంటి పన్ను కట్టనందున మిల్ గేట్ సీజ్ చేశారు. అయితే 2000 సంవత్సరం నుండి 2016 సంవత్సరం వరకు మొత్తం 39 మంది కాంట్రాక్టర్లు ఝాన్సీ లక్ష్మీబాయి కూరగాయాల మార్కెట్, గొర్రెలు, పశువుల మార్కెట్, బస్టాండ్ మార్కెట్లను పోటీ పడి వేలం పాటలో అధిక సొమ్ముకు పాడి వేలంను దక్కించుకున్నారు. ఆతరువాత మార్కెట్లలో రుసుములను చిన్న వ్యాపారుల నుండి వసూళ్ళు చేసి జేబులు నింపుకున్నారు. కాని మున్సిపాలిటీకి కట్టాల్సిన సొమ్మును కట్టకుండా బకాయి పడ్డారు. బకాయి పడిన వారంతా అధికార పార్టీలో లేదా ఇతర పార్టీలో చేరిపోయి తాము మున్సిపాలిటీకి బకాయి పడిన సొమ్మును కట్టకుండా ఆయా పార్టీల నాయకులతో అధికారులపై ఒత్తిడి తేవడంతో మున్సిపల్ అధికారులు వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యం చేశారు. అందువల్ల బకాయిలు బాగా పెరిగిపోయాయి. వాస్తవానికి మున్సిపల్ మార్కెట్ల వేలంలోపాట పాడటానికి వచ్చిన వారు సాల్వెసీగా తమ ఆస్తులను పెట్టి వేలం పాట పడడం జరుగుతుంది. వేలం పాటలో పాడిన మేరకు సొమ్ము చెల్లించకుంటే ఆ కాంట్రాక్టర్‌పై మున్సిపల్ అధికారులు కోర్టుకు వెళ్లి చర్యలు తీసుకోవచ్చు. లేదా సాల్వెసీగా పెట్టిన ఆస్తిపై కేసు వేసి స్వాధీనం చేసుకోవచ్చు. కాని ఇంత వరకు బకాయిపడిన కాంట్రాక్టర్లపై మున్సిపల్ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోక పోవడంపై పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి. అందులో మొత్తం కాంట్రాక్టర్లలో ముస్త్ఫా రూ. 1,27,099, సిద్ద రూ. 82,088, శ్రీనివాసులు రూ. 55,818, హనుమన్న రూ. 33వేలు, మాదన్న రూ. 24,167, జి.హనుమన్న రూ. 74,080, ఈరమ్మ రూ. 68,585, అబ్దుల్‌బాసీద్ రూ. 36,268లు, గౌస్‌ముద్దీన్ రూ.1,60,000, లక్ష్మన్న రూ. 45,240, రమేష్ రూ. 40,499, కె.బేగం రూ. 1,87,000, అంజప్ప రూ. 22,495, హుసేన్‌సాబ్ రూ. 1,89,018, మన్సర్ అహ్మద్ రూ.4లక్షల 42వేల 180లు, బిజి.బేగం రూ.39వేలు, బిజి.బేగం రూ.24వేల 317, గోపాల్‌రెడ్డి రూ.5లక్షల 38వేలు, సీతారామిరెడ్డి రూ.లక్ష 86వేలు, హెచ్.సీతారామిరెడ్డి రూ.5లక్షల 73వేలు, చిన్న లక్ష్మయ్య రూ.2లక్షల 97వేలు, గోపాల్ రూ.లక్ష 24వేల 275లు, శ్రీనివాసచౌదరి రూ.లక్ష 11వేలు, మునెప్ప రూ.2లక్షల 40వేలు, కాసన్న రూ.లక్ష 46వేలు, నరసింహులు రూ.11లక్షల 79వేల 60లు, శంకరమ్మ రూ.20లక్షల 53వేలు, పెద్ద వెంకటేష్‌లు రూ.26లక్షలు, శేషావలి రూ.22లక్షల 30వేలు, ఇలియాజ్ రూ.లక్ష 90వేలు, రాఘవేంద్ర రూ.6లక్షల 92వేలు, విజయ్‌కుమార్ రూ.2లక్షల 60వేలు, బుడ్డారెడ్డి రూ.26లక్షల 10వేలు, ముజూబ్ అహ్మద్ రూ.6లక్షల 78వేలు ఈవిధంగా రూ.కోటి 66లక్షల 60వేల 860లు వివిధ మార్కెట్ల నుంచి కాంట్రాక్టర్లు బకాయి పడ్డారు. బకాయిలను వసూళ్ళు చేయాలని ఇటీవలనే కాంగ్రెస్ నాయకులు విలేఖర్ల సమావేశంలో అధికారులను కోరిన విషయం కూడా పాఠకులకు విధితమే. అధికారులు ఇటు కోర్టుకు పోకుండా, వసూళ్ళు చేయకుండా కాలయాపన చేయడం వెనుక రాజకీయ ఒతిళ్ళు కారణమని స్పష్టం అవుతుంది. మార్కెట్లు సొమ్ము మున్సిపాలిటీకి కట్టకుండా కాంట్రాక్టర్లు రాజకీయ పార్టీల్లో చేరిపోవడం నాయకులతో ఒత్తిడి తెప్పించడం ఆదోనిలో షరామాములుగా మారిపోయింది. ఇప్పటికైనా బకాయిలు వసూళ్ళు చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉంది.
తీవ్రమైన కరవు..
ఆగని వలసలు!
* జఠిలం కానున్న నీటి ఎద్దడి..
* నేడు జడ్పీ సర్వసభ్య సమావేశం..
కర్నూలు సిటీ, మార్చి 25:జిల్లాలో గత రెండేళ్లుగా ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో తీవ్రమైన కరవు పరిస్థితులు నెలకొన్నాయి. పచ్చని పొలాలతో కళకళలాడాల్సిన నేల వర్షాలు లేక ఎండిన పంటలతో నెర్రెలు చీలి నోరు తెరుస్తోంది. జిల్లాలో ప్రధానంగా పశ్చిమ ప్రాంతంలో రోజురోజుకూ సమస్య తీవ్ర రూపం దాల్చుతోంది. రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలోని 54 మండలాల్లో 36 మండలాలను కరవు ప్రాంతాలుగా ప్రకటించింది. అయితే కరవు నివారణ చర్యలు ఆశించిన స్థాయిలో చేపట్టకపోవడంతో రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 26వ తేదీ జరగనున్న జడ్పీ సర్వసభ్య సమావేశంలో ప్రధానంగా ఆర్‌డబ్ల్యుఎస్, నీటి పారుదల, వ్యవసాయ, విద్యుత్, విద్య, తదితర శాఖల్లో చేపడుతున్న అభివృద్ధిపై చర్చించనున్నారు. జిల్లాలో తాగునీటి నీటి సమస్య కూడా జఠిలమైంది. అధిక శాతం తుంగభద్ర జలాల పైనే ఆధారపడి ఉండటం వల్ల సమస్య ఎక్కువగా ఉంది. గత ఏడాది, ఈ ఏడాది వాటా మేరకు జిల్లాకు నీరు కేటాయించకపోవడంతో చేతికొచ్చే దశలో నీరు అందని పరిస్థితులు నెలకొన్నాయి. ఎల్‌ఎల్‌సి కాలువ కింద గత ఏడాది 1.2 టిఎంసిల నీటిని ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం కారణంగా కోల్పోవాల్సి వచ్చింది. ఈ ఏడాది మరికొంత నీటిని కోల్పోయే ప్రమాదం పొంచి ఉంది. జిల్లాలోని పశ్చిమ ప్రాంతాల ప్రజలు ఉంగభద్ర జలాలపైనే ఆధారపడి జీవిస్తున్నారు. ఈ ప్రాంతంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితుల వల్ల స్థానికంగా వ్యవసాయ పనులు లేకపెద్ద రైతులు సైతం కూలీలుగా మారి పనుల కోసం వలస బాట పట్టారు. వర్షాలు ఆశించిన స్థాయిలో కురవకపోవడంతో కుటుంబ పోషణ భారంగా మారింది. రైతులు అర్ధాకలితో అలమటిస్తూ తట్టాబుట్టా సర్ధుకుని సుదూర ప్రాంతాలకు ఉపాధి కోసం వలస పోతున్నారు. వలసలను ఆపేందుకు ఉపాధి పనులు కల్పించాల్సి ఉన్నా సక్రమంగా పనులు చేపట్టడం లేదు. ఉపాధి పనికి వెళ్లినా నెలల తరబడి కూలి డబ్బులు మంజూరు చేయడం లేదు. పూర్తిస్థాయిలో ఉపాధి పనులను ప్రారంభించకపోవడంతోనే పశ్చిమ ప్రాంతంలో రోజురోజుకూ వలసలు పెరుగుతున్నాయి. నియోజకవర్గం, జిల్లా సమస్యలపై చర్చించేందుకు ఎమ్మెల్యేలకు రాష్టస్థ్రాయి వేదిక అసెంబ్లీ. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలను ప్రస్తావిస్తారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యలను అధికారులు, ప్రజాప్రతినిదుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం పొందవచ్చని జడ్పీటిసి సభ్యుల భావన. కానీ ఇప్పటివరకూ జరిగిన సమావేశాల్లో సభ్యులకు మాట్లాడే అవకాశం రాలేదు. తమకు ఎప్పుడు అవకాశం వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. ఇప్పటి వరకూ కేవలం 5శాతం మందికి మాత్రమే సమస్యలను వినిపించే అవకాశం వచ్చింది. ఒక్క అవకాశం కోసం సభ్యులు ఎంతోమంది ఎదురు చూస్తున్నారు. మరి జడ్పీ చైర్మన్ ఏ మేరకు వారికి అవకాశం కల్పిస్తారో వేచి చూడాల్సిందే.
ఉర్దూ యూనివర్శిటీ
విసిగా ముజఫర్‌అలీ
కర్నూలు ఓల్డ్‌సిటీ, మార్చి 25:జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన డాక్టర్ అబ్దుల్ హక్ ఉర్దూ యూనివర్శిటీ మొదటి విసిగా హైదరాబాద్‌లోని కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఉర్దూ శాఖ అధిపతిగా పని చేస్తున్న ప్రొఫెసర్ కె.ముజఫర్‌అలీని నియమిస్తూ శనివారం సాయంత్రం రాష్ట్ర ప్రభుత్వం జీఓ విడుదల చేసింది. ప్రస్తుతం రాయలసీమ యూనివర్శిటీ విసి వై.నరసింహులు ఇన్‌చార్జి విసిగా వ్యవహరిస్తున్నారు. నూతనంగా నియమితులైన ముజఫర్‌అలీ నాలుగేళ్లపాటు విసిగా వ్యవహరిస్తారు. త్వరలోనే ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు.
డిగ్రీ పరీక్షల్లో జోరుగా
మాస్‌కాపీయింగ్!
* కొరవడిన వర్శిటీ అధికారుల పర్యవేక్షణ..
కోడుమూరు, మార్చి 25:పట్టణంలోని డిగ్రీ పరీక్ష కేంద్రంలో జోరుగా మాస్ కాపీయింగ్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. పట్టణంలోని ఒక కళాశాలలో శనివారం యాజమాన్యం బయటి వ్యక్తులు లోపలికి రాకుండా కాలేజీ క్యాంపస్ గేట్లకు తాళం వేసి విద్యార్థులకు బుక్కులు చేతికి ఇచ్చి మాస్ కాపీయింగ్ చేయిస్తున్న విషయం వెలుగుచూసింది. ఈ విషయం తెలిసి ఒక మీడియా ప్రతినిధి ఆ కళాశాలకు వెళ్లగా సదరు కాలేజీ యాజమాన్యం అతడిని నానా దుర్భుషలాడినట్లు సమాచారం. ఈ విషయం తెలిసిన ఏఐఎస్‌ఎఫ్ నాయకులు మాట్లాడుతూ కోడుమూరులో ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించే డిగ్రీ కళాశాలల గుర్తింపును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పరీక్ష జరిగే సమయంలో కాలేజీ యాజమాన్యం క్యాంపస్‌లో ఎందుకు ఉన్నారని, క్యాంపస్ గేట్లకు తాళం వేయడం ఏంటని శ్రీరాములు, మధు, సుంకన్న, వీరశేఖర్ ప్రశ్నించారు. యూనివర్శిటీ అధికారుల పర్యవేక్షణ లోపం వల్లే ఇలాంటి అక్రమాలు జరుగుతున్నాయని వారు ధ్వజమెత్తారు.
శ్రీగిరిపై ఉగాది శోభ
* భక్తజనంతో పోటెత్తిన శ్రీశైలం..
* ఆలయ వేళల్లో మార్పులు
* స్వామి వారి దర్శనానికి 5 గంటల సమయం..
శ్రీశైలం, మార్చి 25: శ్రీశైల మహాక్షేత్రంలో శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్ల ఉగాది మహోత్సవాలు నేటి నుండి ప్రారంభం అవుతున్నాయి. అందుకు దేవస్థానం వారు కావాల్సిన అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. పొరుగు రాష్టమ్రైన కర్నాటక నుండి లక్షల సంఖ్యలో భక్తులు శ్రీశైలం చేరుకున్నారు. ఇంకా భీముని కొలను నుండి కాలినడకన భక్తులు వస్తున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఆలయ అధికారులు ఆలయ వేళల్లో మార్పులు చేశారు. ఉదయం 3 గంటలకకు ఆలయ ద్వారాలు తెరచి ఆర్జిత సేవల అనంతరం భక్తులను దర్శనానికి అనుమతించనున్నారు. అధిక సంఖ్యలో భక్తులు శ్రీశైలం చేరుకోవడంతో శ్రీశైల పురవీదులు, ఖాళీ ప్రాంతాలు అన్నీ జనసంద్రంగా మారాయి.
కాలినడకన వస్తున్న భక్తులు
ఉగాది మహోత్సవాలు ప్రారంభం కానుండడంతో భీముని కొలను నుండి కైలాస ద్వారం మీదుగా అధిక సంఖ్యలో భక్తులు శ్రీశైలం చేరుకున్నారు. కాలినడకన వచ్చే భక్తులకు కైలాస ద్వారం వద్ద భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండ ట్యాంకర్ల ద్వారా దేవస్థానం వారు నీటిని అందిస్తున్నారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీశైల మహాక్షేత్రంలో భక్తుల తాకిడి పెరగడంతో పలు ప్రాంతాల్లో భక్తులు, సత్రాల సమాఖ్య వారు, కర్నాటకకు చెందిన పలు భక్త బృందాల వారు అన్నదాన కార్యక్రమాలను కైలాస ద్వారం వద్ద, అటకేశ్వరం వద్ద, పాలదార పంచదార వద్ద, సాక్షి గణపతి వద్ద, శివదీక్ష శిబిరాల వద్ద, పాతాళగంగ రోడ్డులో అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తూ మజ్జిగ, మంచినీరు పంపిణీ చేస్తు భక్తులకు సేవలు అందిస్తున్నారు.
వైద్యశిబిరాలు..
ఉగాది మహోత్సవాన్ని దృష్టిలో ఉంచుకొని శ్రీశైలంకు వచ్చే భక్తుల కోసం దేవస్థాన ఆసుపత్రి వద్ద, కైలాస ద్వారం వద్ద, పాతాళగంగ రోడ్డులో, నంది సర్కిల్ వద్ద ఉచిత మెడికల్ క్యాంపులు నిర్వహిస్తూ భక్తులకు కావాల్సిన ప్రథమ చికిత్సను కాలినడకన వచ్చే భక్తులకు పెయిన్ కిల్లర్స్‌తోపాటు విరేచనాలు, వాంతులకు మాత్రలను అందిస్తున్నారు. అధిక సంఖ్యలో భక్తులు శ్రీశైలం చేరుకోవడంతో శ్రీశైల క్షేత్రం కన్నడ భక్తులతో నిండిపోయింది. సుమారుగా లక్ష మందికి పైగా భక్తులు శ్రీశైలం చేరుకున్నారని అంచనా. అలాగే భక్తులు స్నానం ఆచరించేందుకు పాతాళగంగ వద్ద దేవస్థానం వారు ప్రత్యేక ఏర్పాట్లతో పాటు కళ్యాణ కట్ట వద్ద ప్రత్యేక షవర్ బాత్‌లను, మొబైల్ టాయిలెట్లను శ్రీశైల పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు.
204 మద్యం దుకాణాలు మంజూరు
* దరఖాస్తులు ఆహ్వానం
* 31న లాటరీ పద్ధతిన షాపుల కేటాయింపు
కర్నూలు, మార్చి 25:జిల్లాలో మద్యం షాపుల నిర్వహణకు గడువు ముగియడంతో రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మద్యం దుకాణాల కేటాయింపు ప్రక్రియను ప్రారంభించింది. జిల్లాలో 204 మద్యం దుకాణాలకు ఈ నెల 24 నుంచి 30వ తేదీ వరకూ ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చునని కర్నూలు ప్రొహిబిషన్, ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ శ్రీరాములు శనివారం ఒక ప్రటనలో తెలిపారు. ఈ నెల 31వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు నగరంలోని జిల్లా పరిషత్ హాలులో కలెక్టర్ ఆధ్వర్యంలో జనాభా ప్రాతిపదికన లాటరీ పద్ధతిలో మద్యం షాపులు కేటాయిస్తారని తెలిపారు. మొత్తం 204 మద్యం దుకాణాల్లో కర్నూలుకు 102, నంద్యాలకు 102 చొప్పున షాపులు కేటాయించినట్లు తెలిపారు. మండల, పంచాయతీ, మున్సిపాలటీ, మున్సిపల్ కార్పొరేషన్లలో జనాభా ప్రాతిపదికన ఏడాదికి గానూ మద్యం షాపులకు లైసెన్స్ ఫీజు చెల్లించాల్సి వుందన్నారు. 5వేల జనాభాకు రూ. 7.5 లక్షలు, 5001 నుంచి 10వేల జనాభాకు రూ. 8.5లక్షలు, 10,001-25వేల వరకూ రూ. 9.25లక్షలు, 25,001-50వేల వరకూ రూ. 10లక్షలు, 50,001-3లక్షల వరకూ రూ. 11.25లక్షలు, 1,00,001- 5లక్షల వరకూ రూ. 12.5 లక్షల ఫీజు చెల్లించాల్సి ఉందన్నారు. రూ. 5 వేల ఫీజు చలానా రూపంలో కర్నూలు, నంద్యాల ఎక్సైజ్ సూపరింటెండెంట్ వారి పేరున తీయాలన్నారు. అలాగే మున్సిపల్ కార్పొరేషన్ సరిహద్దు నుంచి 5 కి.మీ పరిధిలో ఉన్న షాపులకు రూ. లక్ష, మున్సిపాలిటీ సరిహద్దు నుంచి 2 కి.మీ పరిధిలో ఉన్న షాపులకు రూ. 75వేలు, మండల సరిహద్దుల నుంచి 2 కి.మీ పరిధిలో ఉన్న షాపులకు రూ. 50వేలు కేటాయిస్తామన్నారు. దరఖాస్తుదారులు తప్పనిసరిగా ఇటీవల తీసిన 2 పాస్‌ఫొటోలు, పాన్‌కార్డు, ఆధార్‌కార్డు, రెండేళ్ల ఆదాయ పన్ను రిటర్న్స్ జిరాక్స్ కాపీలు సమర్పించాలన్నారు. ఒకే వ్యక్తి ఎన్ని షాపులకైనా దరఖాస్తు చేసుకోవచ్చు, అయితే ఒక షాపు లాటరీ ద్వారా వస్తే మిగతా దరఖాస్తులు రద్దు చేస్తామన్నారు. లాటరీ ద్వారా ఎన్నికైన అభ్యర్థి దుకాణాలకు సంబంధించిన పర్మిట్ రూమ్ లైసెన్స్ ఫీజు రూ. 5లక్షలు, దరఖాస్తు ఫీజు రూ. 10వేలు చెల్లించాలన్నారు. ఇతర వివరాల కోసం కర్నూలు ఎక్సైజ్ స్టేషన్ హౌస్ ఆఫీసర్, ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయంలో సంప్రదించవచ్చన్నారు.
శాంతి భద్రతల పరిరక్షణలో
సర్కారు విఫలం
* డోన్ వైస్ చైర్మన్‌ను పదవి నుంచి తొలగించాలి
* పిఎసి చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి
కర్నూలు సిటీ, మార్చి 25:శాంతి భద్రతలను కాపాడటంలో రాష్ట్ర ప్రభు త్వం ఘోరంగా విఫలం చెందిందని డోన్ ఎమ్మెల్యే, పిఎసి చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి విమర్శించారు. నగరంలోని వైకాపా కార్యాలయంలో శనివారం బుగ్గన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు. డోన్ మున్సిపల్ టెండర్లలో వైస్‌చైర్మన్ అనుచరులు వైకాపా నాయకులపై మారణాయుధాలతో దాడికి పాల్పడుతుంటే పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడం దారుణమన్నారు. ఒకవైపు టెండర్ల కోసం ప్రాణాలు తీసుకుంటుంటే మరొక వైపు టెండర్లు నిర్వహించడం ఏంటని ప్రశ్నించారు. మున్సిపల్ వైస్ చైర్మన్ మాఫీయాను పెంచి పోషిస్తూ తనకు ఎవరైనా అడ్డువస్తే వారిపై దాడి చేయించడం పరిపాటిగా మారిందన్నారు. డిప్యూటీ సిఎం కెఇ కృష్ణమూర్తి తాను 4 పర్యాయాలు నియోజకవర్గం నుంచి గెలిచి డోన్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేశానని గొప్పలు చెబుతున్నార ని, ఆయనే మాఫియాను పెంచి పోషిస్తున్నారని అందుకు మొన్న జరిగిన సంఘటనే నిదర్శనం అన్నారు. మున్సిపల్ టెండర్లలో ప్రతి ఏడాది సిండికేట్‌గా మారి సమానంగా పంచుకునే వా రని ఈ ఏడాది కూడా అలాగే చేయాలని చెబితే అందుకు ఒప్పుకోకపోవటంతోనే వైకాపా నాయకులపై దాడి చేశారని ఆరోపించారు. మున్సిపల్ వైస్ చైర్మన్ ఒక రౌడీ షీటర్ అని అటువంటి వ్యక్తిని ఏవిధంగా వైస్ చైర్మన్ చేశారని ప్రశ్నించారు. దాడికి వైస్ చైర్మన్‌ను బాధ్యులుగా చేసి వెంటనే పదవి నుంచి తొలగించాలని, లేనిపక్షంలో డోన్ మున్సిపాలిటీలో ఏమైనా జరిగితే అందుకు డిప్యూటీ సిఎం కెఇనే బాధ్యత వహించాలన్నారు. డోన్‌లో శాంతి భద్రతలు అదుపులో లేవని పోలీసులు ఒక పార్టీ వైపు మొగ్గు చూపి మరొకరికి ఆటంకం కలిగిస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. ఆయనతో పాటు జడ్పీటిసి సభ్యుడు శ్రీరాములు, నాయకులు ఉన్నారు.
చౌడేశ్వరీమాతకు
మంగళసూత్రం వితరణ
* విలువ రూ. 10 లక్షలు
బనగానపల్లె, మార్చి 25:మండల పరిధిలోని నందవరం శ్రీచౌడేశ్వరీమాతకు శనివారం బెంగళూరుకు చెందిన కెవి ప్రసాద్, ఆయన సతీమణి శశికళ రూ. 10 లక్షల విలువ చేసే మంగళసూత్రాలను ఇఓ రామానుజన్, ఆలయ కమిటీ చైర్మన్ పివి కుమార్‌రెడ్డిలకు అందజేశారు. అంతకుముందు వారికి ఇఓ, చైర్మన్ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఆ దంపతులు అమ్మవారికి పూజలు నిర్వహించిన అనంతరం ఇఓ, చైర్మన్ మంగళసూత్రాన్ని అమ్మవారికి అలంకరించారు. వీరే గతంలో కూడా రేకుల షెడ్ ఏర్పాటుకు రూ. 20 లక్షల అందజేసినట్లు చైర్మన్ గుర్తుచేశారు. కాగా ఆలయం వద్ద తలనీలాలు పోగుచేసుకునేందుకు శనివారం దేవాదాయశాఖ అధికారి రఘురామ్ సమక్షంలో వేలం నిర్వహించగా రూ. 4.06 లక్షల ఆదాయం సమకూరినట్లు ఇఓ తెలిపారు. చెప్పుల స్టాండ్ వేలాన్ని తాత్కాలికంగా వాయిదా వేశామని తెలిపారు. తలనీలాలు పోగు చేసుకునే హక్కును ల బనగానపల్లెకు చెందిన పి.హనుమంతు దక్కించుకున్నాడు.
అభివృద్ధిని అడ్డుకుంటే
పుట్టగతులుండవు
* జడ్పీ చైర్మన్ మల్లెల, కెఇ ప్రతాప్
డోన్, మార్చి 25:రాష్ట్భ్రావృద్ధి కోసం సిఎం చంద్రబాబు అహర్నిశలు కృషి చేస్తుంటే ప్రతిపక్ష నేత జగన్ అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నారని జడ్పీ చైర్మన్ మల్లెల రాజశేఖర్, నియోజకవర్గ టిడిపి ఇన్‌చార్జి కెఇ ప్రతాప్ విమర్శించారు. మండల పరిధిలోని యు.కొత్తపల్లెలో రూ. 22లక్షల వ్యయంతో నిర్మించిన తాగునీటి పథకాన్ని శనివారం వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా రాజశేఖర్ మాట్లాడుతూ టిడిపి పాలనలో కుగ్రామాలు సైతం అభివృద్ధి సాధిస్తున్నాయన్నారు. అయితే ఓర్వలేని ప్రతిపక్ష పార్టీల నేతలు అభివృద్ధికి ఆటంకం కలిగిస్తున్నారని ధ్వజమెత్తారు. కొత్తపల్లె ప్రజల దాహార్తి తీర్చడానికి కెఇ ప్రతాప్ చేసిన కృషి ప్రశంసనీయమన్నారు. గత 15 ఏళ్లుగా పరిష్కారం కాని సమస్యను 10 నెలల్లో పూర్తి చేసిన ఘనత కెఇకే దక్కిందన్నారు. ప్రజల కోసం అహర్నిశలు పాటు పడుతున్న చంద్రబాబు ప్రభుత్వానికి, కెఇ సోదరులకు ప్రజలు అండగా నిలవాలని కోరారు. కెఇ ప్రతాప్ మాట్లాడుతూ గతంలో కొత్తపల్లెలో తాగునీటి సమస్యను తీర్చిన తర్వాతే గ్రామంలోకి వస్తానని ఇచ్చిన మాటను నిలుపుకున్నానని తెలిపారు. వేసవిలో ఎక్కడా తాగునీటి సమస్య లేకుండా చేస్తామని స్పష్టం చేశారు. అలాగే గ్రామాల్లో పెండింగ్‌లో వున్న మరుగుదొడ్ల బిల్లులను త్వరలోనే మంజూరు చేయిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం కెఇ ప్రతాప్, మల్లెల రాజశేఖర్‌లను గ్రామస్థులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో టిడిపి జిల్లా కార్యదర్శి, గొర్రెల సహకార సంఘం అధ్యక్షుడు వై.నాగేశ్వరరావు, మార్కెట్‌యార్డు చైర్మన్ మురళీకృష్ణగౌడ్, మున్సిపల్ చైర్‌పర్సన్ కొట్రికె గాయత్రీదేవి, ఎంపిపి టిఇ లక్ష్మిదేవి, నాయకులు టిఇ శేషఫణి గౌడ్, కెఇ జయన్న, చండ్రపల్లెఆచారి, టిఇ కేశవయ్యగౌడ్, ఆంజనేయగౌడ్, వలసల రామకృష్ణ, అర్జున్‌రెడ్డి పాల్గొన్నారు.