కర్నూల్

భక్తులతో పోటెత్తిన శ్రీశైలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీశైలం, మార్చి 26:శ్రీశైలం మహాక్షేత్రంలో ఆదివారం ఉగాది ఉత్సవాలు ప్రారంభం కావడంతో లక్షల సంఖ్యలో కన్నడ భక్తులు శ్రీశైలం చేరుకున్నారు. అధిక సంఖ్యలో భక్తులు శ్రీశైలం చేరుకోవడంతో ఆలయ అధికారులు ఆలయ వేళల్లో మార్పులు చేసి భక్తుల సౌకర్యార్థం రాత్రి 2గంటల వరకు దర్శనానికి అనుమతిస్తారు. కర్నాటక రాష్ట్రం నుంచి వచ్చిన పలు భక్త బృందాలు, స్వచ్ఛంద సంస్థల సహకారంతో దేవస్థానం వారు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా దర్శనం, లడ్డూ ప్రసాదాలను అందిస్తున్నారు. అధిక సంఖ్యలో భక్తులు ఉత్తరవాహినీగా ప్రవహిస్తున్న పవిత్ర పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి వేకువజాము నుంచే స్వామి అమ్మవార్లను దర్శించుకునేందుకు పోటీపడుతున్నారు. సుమారు లక్షన్నరకు పైగా భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారని అంచనా.
అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు
ఉగాది మహోత్సవాలలో భాగంగా దేవస్థానం వారు భక్తులను అలరించేందుకు పలు ధార్మిక, సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగింది. భ్రామరీ కళామందిరంలో, శివదీక్ష శిబిరాల వద్ద, పుష్కరిణి వద్ద భక్తుల సౌకర్యార్థం పలు సాంస్కృతిక కార్యక్రమాలను సాయంత్రం 6.30నిమిషాల నుంచి ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా శ్రీభ్రామరీ కళామందిరంలో కర్నాటక వారిచే భక్తి సంగీతం బెల్గాం జిల్లా వారిచే జగత్‌జ్యోతి బసవేశ్వర నాటకం, శివదీక్ష శిబిరాలలో బెంగుళూరుకు చెందిన వినోద్ బృందంచే లావణ్య వాయిద్య విన్యాసం, మహారాష్ట్ర వారిచే రాజా హరిశ్చంద్ర పౌరాణిక నాటకం భక్తులను ఎంతగానో అలరించాయి. ఈవిశేష కార్యక్రమంలో భక్తులు చూసి ఆధ్యాత్మిక భావనలకు లోనయ్యారు.
పెంచిన ఆర్టీఏ ఫీజులు తగ్గించాలి
* 30న లారీల బంద్..
* సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గఫూర్
కర్నూలు, మార్చి 26:రవాణా రంగంలో పెంచిన ఆర్టీఏ ఫీజులను వెంటనే తగ్గించాలని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంఏ గఫూర్ డిమాండ్ చేశారు. నగరంలోని కెకె భవన్‌లో ఆదివారం రాయలసీమ జిల్లాలతో పాటు నెల్లూరు జిల్లా ప్రైవేట్ ట్రాన్స్‌పోర్టు వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రవాణా రంగంలో ఫీజులను పెంచడం అన్యాయమన్నారు. ఇప్పటికే పెద్దనోట్ల రద్దు, పెట్రోల్, డిజిల్ ధరల పెంపుతో రవాణా రంగంపై ఆధారపడిన వారి జీవితాలు సంక్షోభంలోకి నెట్టివేయబడ్డాయన్నారు. దేశంలో డ్రైవర్ కం ఓనర్‌గా ఉంటున్న లక్షలాది మందిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలు రోడ్డు పాలు చేస్తున్నాయని వాపోయారు. ఈ పరిస్థితుల్లో రవాణా రంగాన్ని పరిరక్షించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలకు వ్యతిరేకంగా దక్షిణ భారత లారీ ఓనర్స్ అసోసియేషన్ ఈ నెల 30వ తేదీ లారీల బంద్‌కు పిలుపునిచ్చిందన్నారు. ఈ బంద్‌కు ట్రాన్స్‌పోర్ట్ కార్మికులందరూ సహకరించి విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి రాధాకృష్ణ, ట్రాన్స్‌పోర్ట్ యూనియన్ చిత్తూరు నాయకులు గంగాధర్, నెల్లూరు జిల్లా నాయకులు శ్రీనివాసులు, కర్నూలు జిల్లా నాయకులు పుల్లారెడ్డి, ఆటో యూనియన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రాధాకృష్ణ, కె.ప్రభాకర్ పాల్గొన్నారు.