కర్నూల్

ఘనంగా శ్రీ వాగీశతీర్థుల ఆరాధన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంత్రాలయం, ఏప్రిల్ 15: కర్నాటకలోని పవిత్ర తుంగాతీరాన అణుగొంది క్షేత్రమైన నవ బృందావనాల్లో ఒకటిగా వెలసిన శ్రీ వాగీశ తీర్థుల ఆరాధన వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. మంత్రాలయం మఠం పీఠాధిపతి శ్రీ సుభుదేంద్ర తీర్థులు ఆధ్వర్యంలో శ్రీ వాగీశ తీర్థుల బృందావనానికి తులసి అర్చన, నిర్మల్య విసర్జన, విశేష పంచామృతాభిషేకం, తదితర ప్రత్యేక పూజలు చేసి హారతి ఇచ్చారు. అనంతరం శ్రీ మూల రామదేవతామూర్తులకు వివిధ ప్రత్యేక పూజలు చేసి ధూప దీప నైవేద్యాలు సమర్పించి హారతి ఇచ్చారు. అనంతరం శ్రీవాగీశ తీర్థుల బృందావనానికి ప్రత్యేక అలంకరణ చేసి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు.
కేంద్ర నిధులపై రాష్ట్రం
శే్వతపత్రం విడుదల చేయాలి
* బిజెపి జిల్లా అధ్యక్షుడు హరీష్‌బాబు
హొళగుంద, ఏప్రిల్ 15: రాష్ట్ర విభజన తరువాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రూ. 16 వేల కోట్లు లోటు బడ్జెట్‌లో ఉంటే అధికారంలోకి వచ్చిన బిజెపి రాష్ట్ర ప్రభుత్వానికి రూ.13వేల కోట్లు విడుదల చేసిందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు హరీష్‌బాబు అన్నారు. శనివారం విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్రం నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఎలా వినియోగించుకుందో తెలియదని, అందుకే రాష్ట్ర ప్రభుత్వం వెంటనే శే్వత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాయలసీమ జిల్లా అభివృద్ధికి జిల్లాకు రూ.50 కో ట్లు విడుదల చేసిందని, ట్రిబుల్ తలక్‌పై ముస్లిం మహిళల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని స్పష్టం చేశారు. ప్రధాన మంత్రి నరేంద్రమోదీ చేస్తున్న సంక్షేమ పథకాల వల్ల ఉత్తరప్రదేశ్‌లో బిజెపి అధికారంలోకి వచ్చిందని, జిల్లాలో 3,500 పోలింగ్ కేంద్రాల కమిటీలు ఉన్నాయని, కమిటీల బలోపేతానికి కృషి చేస్తామన్నారు. హొళగుందలో గ్యాస్ ఏజెన్సీ, బిఎస్‌ఎన్‌ఎల్ టవర్ సమస్యను కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారిస్తామన్నారు. ఎల్లార్తిలో బిజెపి జెండా ఆవిష్కరించామని, బిజెపి నాయకులు తిమ్మప్ప ఆధ్వర్యం లో 50 మంది పార్టీలో చేరారని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు రవీంద్రరావు, రాష్ట్ర బిజెపి కౌన్సిల్ సభ్యులు చిదానంద, తాలూకా పార్టీ ఇన్‌ఛార్జి నవీన్‌కిశోర్, నాగరాజుస్వామి, బెణకప్ప, మల్లికార్జున, నాగప్ప, రమేష్, ఉమామహేశ్వరప్ప, నర్సప్ప పాల్గొన్నారు.
పశువసతి గృహం ఏర్పాటుకు
గ్రామాల ఎంపిక
* జెడిఏ సుదర్శన్‌కుమార్
కర్నూలుటౌన్, ఏప్రిల్ 15:జిల్లాలో రెండవ పశువసతి గృహం ఏర్పాటు చేసేందుకు నంద్యాల, బనగానపల్లి, కర్నూలు డివిజన్ పరిధిలో పలు గ్రామాలను సందర్శించామని, అందులో సిద్దాపురం, పాతపాడు గ్రామాలను ఎంపిక చేశామని ఆ నివేదికను కలెక్టర్ విజయమోహన్‌కు పంపామని పశుసంవర్ధక శాఖ సంయుక్త సంచాలకులు డా. సుదర్శన్‌కుమార్ తెలిపారు. నగరంలో శనివారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ కల్లూరు మండలంలోని తడకనపల్లిలో ప్రథమంగా పశువసతి గృహం ఏర్పాటుచేసి సిఎం చంద్రబాబు చేత ప్రారంభించగా రాష్ట్రంలోనే కర్నూలు జిల్లాకు గుర్తింపు వచ్చిందన్నారు. ఇక రెండవ వసతి గృహాన్ని ఏర్పాటు చేసేందుకు కర్నూలు డివిజన్ పరిధిలోని నన్నూరు, ఉయ్యాలవాడ, కాల్వ గ్రామాల్లో పరిశీలించామని, అయితే అక్కడ సౌకర్యాలు లేకపోవడంతో నంద్యాల డివిజన్ పరిధిలోని సిద్దాపురం గ్రామ సమీపంలో పరిశీలించగా అక్కడ ప్రభుత్వ భూమి 10 ఎకరాలు వుందని నిర్మాణానికి అవసరమైన వౌలిక వసతులు కూడా ఉన్నాయన్నారు. బనగానపల్లి డివిజన్‌లోని పాతపాడు గ్రామ శివారులో 10 ఎకరాల భూమి ఉందని సౌకర్యాలు కూడా కొంత వరకూ పుష్కలంగా ఉన్నాయన్నారు. వసతులు ఉన్న గ్రామాలకు సంబంధించిన నివేదికను కలెక్టర్‌కు పంపుతున్నామన్నారు. ప్రస్తుతం తడకనపల్లి వసతి గృహంలో 120 పశువులు ఉన్నాయని, త్వరలో నూతనంగా ఏర్పాటుచేసే గృహంలో కూడా 160 పశువులు వుండేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. సమావేశంలో పశుసంవర్ధక శాఖ సిబ్బంది పాల్గొన్నారు.
ఆరుగురు సిడిపిఓలకు చార్జ్జిమెమో..
* ఇన్‌చార్జి పిడి అరుణ
కర్నూలుటౌన్, ఏప్రిల్ 15:సిఎం చంద్రబాబు ఈ నెల 17వ తేదీ విజయవాడలో శిశుసంక్షేమ శాఖకు సంబంధించి నిర్వహించనున్న సమీక్ష సమావేశానికి సంబంధించిన నివేదికలు ఇవ్వడంలో నిర్లక్ష్యం వహించిన ఆరుగురు సిడిపిఓలకు చార్జిమెమో ఇస్తున్నట్లు ఇన్‌చార్జి పీడి అరుణ తెలిపారు. ఆమె శనివారం విలేఖరులతో మాట్లాడుతూ సిఎం సమీక్షకు సంబంధించిన నివేదికను ఆరుగురు సిడిపిఓలు సకాలంలో అందజేయకపోవడంతో వారికి చార్జీ మెమోలు జారీ చేసేందుకు కలెక్టర్‌కు నివేదిక పంపుతున్నామని తెలిపారు. ఎమ్మిగనూరు, నంద్యాల అర్బన్, డోన్, నందికొట్కూరు, ఆళ్లగడ్డ, గూడూరు సిడిపిఓలు నివేదికల విషయంలో అలసత్వం వహిస్తున్నారని, గతంలో కూడా నివేదికలు అందించడంలో అంసతృప్తి చెందానని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. సకాలంలో నివేదిక ఇవ్వకుంటే జిల్లాలో సాధించిన ప్రగతిపై ఉన్నతాధికారులకు తెలియకపోవడంతో జిల్లాకు రావాల్సిన నిధులు కూడా వృథా అవుతాయని ఆమె తెలిపారు. సమావేశంలో శిశు సంక్షేమ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.