కర్నూల్

విధుల పట్ల ఏ ఒక్కరిలోనూ చిత్తశుద్ధిలేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలుటౌన్, ఏప్రిల్ 29:జిల్లా స్థాయిలో నిర్వహించే సమీక్షలకు పూర్తి నివేదికతో హాజరుకావాలని, అయితే ఏ ఒక్క అధికారిలోనూ విధుల పట్ల చిత్తశుద్ధి కనపడటం లేదని కలెక్టర్ సత్యనారాయణ జిల్లా అధికరులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో శనివారం ఎంపి బుట్టా రేణుక అధ్యక్షతన జిల్లా దిశా కమిటీ సమావేశం నిర్వహించారు. తొలుత కేంద్ర ప్రభుత్వ నిధులతో జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనులపై 28 శాఖలతో సమీక్షించారు. అందులో డ్వామా శాఖ నుంచి ప్రారంభించారు. జిల్లాలో ఎన్‌ఆర్‌ఇజిఎస్ పని విధానంలో అసంతృప్తిగా ఉన్నామని ఎంపి రేణుక అన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాల్లో కూడా అర్హులను జన్మభూమి కమిటీ ఎంపిక చేయాలా అని డోన్, పాణ్యం, నందికొట్కూరు ఎమ్మెల్యేలు ప్రశ్నించారు. ఏ ఒక్క అధికారి చిత్తశుద్ధితో పని చేయడం లేదని ఎమ్మెల్యేలు నియోజకవర్గ సమస్యల పరిష్కారంలో అధికారుల తీరుపై ధ్వజమెత్తారు. పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి మాట్లాడుతూ కల్లూరు మండలంలోని 14వార్డుల్లో తాగునీటి సమస్య నెలకొన్నా ఏ ఒక్క అధికారి స్పందించడం లేదని ధ్వజమెత్తారు. పాణ్యం నియోజకవర్గంపై వివక్ష చూపుతున్నారని, నగరపాలక సంస్థ కమిషనర్ రవీంద్రబాబు ఏ ఒక్క సమావేశానికి తమను ఆహ్వానించడం లేదని తెలిపారు. ఎంపి రేణుక మాట్లాడుతూ నగరపాలక శాఖ ప్రొటోకాల్ విషయంలో నిబంధనలు పాటించడం లేదని, అధికార పార్టీ కనుసన్నల్లో పని చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. డోన్ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి మాట్లాడుతూ గ్రామాల్లో ఏ పథకానికి అర్హులను ఎంపిక చేయాలన్నా జన్మభూమి కమిటీదే బాధ్యత అని అధికారులు పేర్కొంటున్నారని, ఇకపై గ్రామీణ ప్రాంతాల్లో జన్మభూమి కమిటీ ఆమోదిస్తే తప్ప పెళ్లిళ్లు జరిగేలా ఉండదేమోనని ఎద్దేవా చేశారు. తమ నియోజకవర్గంలో నీటి సమస్యపై పలుమార్లు ఫిర్యాదులు చేసినా ఏ ఒక్కరూ స్పందించ లేదని, గతంలో ఉన్న కలెక్టర్ విజయమోహన్ నిర్లక్ష్యం వల్లే జిల్లాలో తాగునీటి సమస్య ఉత్పన్నమైందని వివరించారు.
నందికొట్కూరు ఎమ్మెల్యే ఐజయ్య నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలను వివరించారు. కల్లూరు మండలంలో నీటి సమస్య పరిష్కరించకుంటే 16 వార్డు ప్రజలు నగరపాలక సంస్థకు చెల్లించాల్సిన పన్నులు చెల్లించరని స్పష్టం చేశారు. ఎంపి రేణుక మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ పథకాలకు జన్మభూమి కమిటీ ఆమోదం ఏంటని ప్రశ్నించగా, కలెక్టర్ మాట్లాడుతూ ప్రస్తుతం జన్మభూమి కమిటీ ఆదేశాల మేరకు ఏ పథకం లేదన్నారు. కర్నూలు పార్లమెంట్ పరిధిలో అభివృద్ధి పనులు జరగలేదని, దత్తత గ్రామంలో తాగునీటి సమస్య పరిష్కరించమని నివేదికలు ఇచ్చినా స్పందించలేదని మండిపడ్డారు. దీంతో కలెక్టర్ ఆర్‌డబ్ల్యుఎస్ ఎస్‌ఇ ఎక్కడ అని అడగ్గా సమీక్షకు హాజరుకాలేదని తెలుపడంతో వెంటనే అతడికి షోకాజ్ నోటీసు జారీ చేయాలన్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందించాలని, ముఖ్యంగా సమీక్ష సమావేశాలకు పూర్తి నివేదికతో హాజరుకావాలన్నారు. ఎంపి రేణుక మాట్లాడుతూ నిరుపేద ప్రజల అభ్యున్నతి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ పథకాల కింద విడుదల చేసిన నిధులను సక్రమంగా వినియోగించి అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఈ సమావేశం ఉదయం 11 నుంచి సాయంత్రం 5.45 గంటల వరకూ జరిగింది. ఇందులో రాబోయే ఏడాదిలో చేపట్టాల్సిన అభివృద్ధి పనుల వివరాలను తెలిపారు. సమావేశంలో డిఆర్‌ఓ గంగాధర్‌గౌడ్, వెలుగు పిడి రామరకృష్ణ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. కాగా అనారోగ్యం కారణంగా నంద్యాల ఎంపి ఎస్పీవై రెడ్డి సమీక్షకు హాజరుకాలేదు. జిల్లాలోని టిడిపి ఎమ్మెల్యేల్లో కోడుమూరు ఎమ్మెల్యే మణిగాంధీ ఒక్కరే హాజరు కాగా, మిగిలిన వారు గైర్హాజరయ్యారు.
వ్యవసాయ పరిశోధనపై
2న జాతీయ సదస్సు
నంద్యాల, ఏప్రిల్ 29 :‘వ్యవసాయ రంగంపై వాతావరణ మార్పుల ప్రభావం’ అంశంపై నంద్యాల ప్రాం తీయ వ్యవసాయ పరిశోధనా స్థానం లో మే 2వ తేదీ జాతీయ స్థాయి వ్యవసాయ సదస్సు నిర్వహించనున్నట్లు నంద్యాల ఆర్‌ఎఆర్‌ఎస్ ఎడిఆర్ డా. గోపాల్‌రెడ్డి తెలిపారు. వ్యవసాయ పరిశోధనా స్థానంలో శనివారం ఆయ న మాట్లాడుతూ ఆ సదస్సులో సస్య విజ్ఞాన శాస్తవ్రేత్తల భూమిక ప్రధానం గా ఉంటుందన్నారు. సుమారు దక్షిణ భారతదేశంలోని అన్ని రాష్ట్రాల నుం చి 200 మంది ప్రతినిధులు హాజరవుతారన్నారు. పంటల సరళిపై వాతావరణ మార్పుల ప్రభావం, పోషక పదార్థాలపై వాతావరణ మార్పుల ప్రభా వం, సమన్విత, సమగ్ర వ్యవసాయం పై చర్చ జరుగుతుందన్నారు. వాతావరణ మార్పుల కారణంగా కలుపు నివారణపై కూడా ప్రత్యేక చర్చ జరుగుతుందన్నారు. శాస్తవ్రేత్తల పరిశోధనల ఫలితాలపై చర్చలు జరుగడంతోపాటు ప్రముఖ వ్యవసాయ శాస్తవ్రేత్తలు కర్నాటక రాష్ట్రానికి చెందిన వివ్రాంత పరిశోధన సంచాలకులు శంకర్, ఆచార్య ఎన్‌జి రంగా వ్యవసాయ వర్శిటీ సీనియర్ శాస్తవ్రేత్త ఎలమందారెడ్డి, డా. వీరరాఘవులు, ఒరిస్సాకు చెందిన డా.బ్రహ్మానంద్, డా. ఎఎస్ రావు తమ పరిశోధనా పత్రాలను సమర్పిస్తారన్నారు. వీరితోపాటు డా. రమణ వాతావరణ మార్పు ల కారణంగా యాంత్రీకరణపై ప్రత్యే క పరిశోధన పత్రం సమర్పిస్తారన్నా రు. సదస్సుకు ఆచార్య ఎన్‌జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిశోధనా సంచాలకులు ఎన్‌వి నాయుడు, విస్తరణ సంచాలకులు డా. రాజారెడ్డి, వ్యవసాయ శాఖ డీన్ రమేష్‌బాబు, రాష్ట్రంలోని వివిధ వ్యవసాయ కళాశాలల విద్యార్థులు కూడా తమ పరిశోధనా పత్రాలను సమర్పిస్తారన్నారు. జాతీయ సదస్సుకు రైతులు ఎక్కువగా హాజరై వాతావరణ పరిస్థితుల్లో వచ్చే మార్పులతో లాభదాయక వ్యవసాయం ఎలా చేయాలన్న విషయం పై అవగాహన పొందాలన్నారు. ప్రకృతి వ్యవసాయం, సేంద్రియ వ్యవసాయ విధానాలపై వాతావరణ మార్పుల ప్రభావంపై కూడా చర్చ జరుగుతుందన్నారు.
మహానందిలో గోశాల ప్రారంభం
* వేదమంత్రాలతో మహాలక్ష్మి యాగం
మహానంది, ఏప్రిల్ 29: మహానందిలో దాతల సహకారంతో నిర్మించిన గోశాలను అత్యంత వైభవంగా వేదపండితుల వేదమంత్రాలతో ప్రారంభించారు. శనివారం అక్షయ తృతీయ సందర్భంగా గోశాల ప్రారంభాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా గోశాల నిర్మాణానికి దాతలుగా వ్యవహరించిన హైదరాబాదుకు చెందిన రామరం శ్రీశైలం గౌడు, మహాలక్ష్మి దంపతులచే వేదపండితులు రవిశంకర్ అవధాని, నాగేశ్వర శర్మ, శాంతారామ్‌భట్‌లతో పాటు శరబయ్య లు దాతలతో నూతన గోశాల వద్ద గణపతి పూజ, పుణ్యాహవాచనం, కలశ పూజలు నిర్వహించారు. అనంతరం హైదరాబాదుకు చెందిన కూనా వెంకటేశం గౌడు, దాతలతో ఇఓ డా.శంకర వర ప్రసాద్, చైర్మన్ పాణ్యం ప్రసాదరావు, ధర్మకర్తలచే గోశాల ప్రారంభాన్ని నిర్మించారు. అక్షయ తృతీయ సందర్భంగా మహాలక్ష్మి యాగాన్ని నిర్వహించా రు. ముందుగా గణపతి హోమం, వాస్తు హోమాలు నిర్వహించి మహాలక్ష్మి హోమాన్ని వేదపండితులు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు మా ట్లాడుతూ హైదరాబాదుకు చెందిన శ్రీశైలం గౌడు రూ. 15 లక్షలతో గోశాలను అత్యంత సుందరంగా తీర్చిదిద్దారన్నారున. అలాగే మహానంది క్షేత్రంలో నిర్వహించే అన్నదాన కార్యక్రమంతోపాటు ప్రతి కార్తీకమాసంలో మాసం పొడవునా భక్తులకు అన్నదాన కార్యక్రమాలు చేయడం ఆయన భక్తికి నిదర్శనమన్నారు. ఇలాగే దాతలు దేవాలయాలకు సహకరిస్తే ఎంతో అభివృద్ధి చెందుతాయన్నారు. అనంతరం గోశాల నిర్మాణ దాతలను మండల గౌడ సంఘం సన్మానించింది. కార్యక్రమంలో ధర్మకర్తలు రామకృష్ణ, సీతారామయ్య, శివారెడ్డి, చంద్రవౌలీశ్వర్‌రెడ్డి, పర్యవేక్షకులు పరశురామ శాస్ర్తి, ఎఇ మురళీధర్‌రెడ్డి, నాయకులు భూమా సుబ్బరామయ్య, రమణగౌడు, నందిపల్లె చైర్మన్ సాయి ఈశ్వర్‌రెడ్డి, ఇన్‌స్పెక్టర్ ఆర్‌ఐ శ్రీనివాసులు పాల్గొన్నారు.