కర్నూల్

డోన్ ఎస్‌ఐను విధుల నుంచి తొలగించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు సిటీ, డిసెంబర్ 11:డోన్ పట్టణంలో చిరు వ్యాపారిని దారుణంగా కొట్టి ఆయన మరణానికి కారణమైన ఎస్‌ఐను వెంటనే విధుల నుంచి తొలగించాలని సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు టి.షడ్రక్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం కలెక్టర్ సత్యనారాయణకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత నెల రోజుల నుంచి వ్యాపారుల మధ్య జరుగుతున్న తగాదాను ఆసరాగా చేసుకుని వరదరాజులును పోలీస్‌స్టేషన్‌కు పిలిపించుకుని కుటుంబ సభ్యుల మధ్యనే చితకబాదడంతో మనస్థాపానికి గురైన వరదరాజులు యాసిడ్ తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఆవేదన వ్యక్తం చేశారు. చిరు వ్యాపారి వరదరాజులు చనిపోవడంతో ఆయన కుటుంబం రోడ్డున పడిందని, ఎస్‌ఐ దురాఘతాలపై నెల రోజుల క్రితమే అతడి కుటుంబ సభ్యులు జిల్లా పోలీసు అధికారికి వినతి పత్రం ఇచ్చినా ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం వల్లే చిరువ్యాపారి చనిపోయాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించి స్థానిక పోలీసులు, ఎస్‌ఐపై చర్యలు తీసుకోవడంతో పాటు ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా గట్టి చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే చనిపోయిన చిరు వ్యాపారి వరదరాజులు కుటుంబానికి రూ. 20లక్షల ఎక్స్‌గ్రేషియో చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు శేషయ్య, అంజిబాబు పాల్గొన్నారు.
చిరు వ్యాపారుల సంఘంఆధ్వర్యంలో..
కర్నూలు ఓల్డ్‌సిటీ : చిరు వ్యాపారి వరదరాజులు ఆత్మహత్యకు కారణమైన డోన్ పట్టణ ఎస్‌ఐ శ్రీనివాసులును వెంటనే విధుల నుంచి తొలగించాలని కోరుతూ సోమవారం రోడ్డు సైడు చిన్న వ్యాపారుల సంఘం ఆధ్వర్యంలో ఎస్పీ గోపీనాథ్‌జెట్టీకి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆ సంఘం నగర కార్యదర్శి షరీఫ్ మాట్లాడుతూ చిరు వ్యాపారి ఆత్మహత్యకు కేవలం పోలీసుల జులుమే కారణమన్నారు. స్టేషన్ ఆవరణలో ఎస్‌ఐ వరదరాజులును చితకబాదడం వల్లనే ఈ సంఘటన జరిగిందన్నారు. కార్యక్రమంలో నగర నాయకులు శివ, ఇలియాస్, విజయ్, జాఫర్‌గౌస్, రాజేష్, గోపాల్ తదితరులు పాల్గొన్నారు.
కల్లూరు తహశీల్దార్ కార్యాలయంలో
దళారుల హవా!
* పట్టించుకోని అధికారులు.. * ఇబ్బందుల్లో సాధారణ ప్రజలు..
కల్లూరు, డిసెంబర్ 11: కల్లూరు తహశీల్దార్ కార్యాలయంలో ఏ చిన్న పని పడి వెళ్లినా దళారులను ఆశ్రయించకతప్పడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కలెక్టరేట్‌కు కూత వేటు దూరంలో ఉన్న కల్లూరు తహశీల్దార్ కార్యాలయంలో దళారులు చక్రం తిప్పుతుండడంతో ప్రజలు అధికారుల వద్దకు వెళ్లినా పని జరగడం లేదు. ఈ క్రమంలోనే గత సోమవారం మండల పరిధిలోని వివిధ గ్రామాల నుంచి ప్రజలు తహశీల్దార్‌ను కలిసి వినతులు ఇచ్చేందుకు వెళ్తుండగా తహశీల్దార్ గది తలుపు వద్ద ఉన్న దళారులు అయ్యవారు బిజీగా ఉన్నారు. తర్వాత రావాలంటూ సాయంత్రం వరకూ కార్యాలయం చుట్టూ తిప్పుతున్నారు. మరోవైపు ఏదైనా క్యాడర్ ఉన్న వ్యక్తులు వచ్చినా, సిఫారసు చేయించే వ్యక్తులు వస్తే మాత్రం తహశీల్దార్‌ను కలిసేందుకు అవకాశం కల్పిస్తున్నారు. సాధారణ ప్రజలకు తహశీల్దార్‌ను కలిసేందుకు అవకాశం రాకపోవడంతో ఉదయం నుంచి సాయంత్రం వరకూ కార్యాలయం వద్దనే పడిగాపులు కాయాల్సిన పరిస్థితి నెలకొంది. ఉదయం నుంచి సాయంత్రం వరకూ వివిధ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు, ప్రజాసంఘాల నాయకులు, తదితరులు ఒకొక్కరు గంటల తరబడి కలిసి వెళ్తున్నారే తప్ప సాధారణ ప్రజలకు మాత్రం తహశీల్దార్‌ను కలిసే అవకాశం రాలేదు. ఈ పరిస్థితుల్లో చేసేదేమీ లేక ప్రతి రోజూ తమ పనులు వదులుకుని తహశీల్దార్ కార్యాలయం రాలేక సాధారణ ప్రజలు దళారులను ఆశ్రయించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇదిలా ఉండగా మండల పరిధిలోని యాపర్లపాడు, పందిపాడు, లక్ష్మీపురం, సల్కాపురం, ఉలిందకొండ, చిన్నటేకూరు, తదితర గ్రామాల్లో తలారులు వారి స్థానాల్లో వారి కుటుంబ సభ్యులను నియమించుకున్నారు. ఏదేమైనా కల్లూరు తహశీల్దార్ కార్యాలయంలో దళారుల వ్యవస్థ పూర్తిస్థాయిలో పెరిగిపోయిందని వీరి ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని ప్రజలు కోరుతున్నారు.