కర్నూల్

పండ్లతోటల సాగుతో అధిక లాభాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బనగానపల్లె, డిసెంబర్ 11:రైతులు ప్రతి ఏటా ఒకే పంట సాగుచేస్తూ చేజేతులా దిగుబడులను తగ్గించుకుంటున్నారని, అలాకాకుండా పంట మార్పు చేయడం, ముఖ్యంగా పండ్లతోటలు సాగు చేయాలని ఎమ్మెల్యే బీసీ జనార్ధనరెడ్డి సూచించారు. పట్టణంలోని మండల వ్యవసాయ కార్యాలయం వద్ద సోమవారం వ్యవసాయ శాఖ అధికారి విజయకుమార్ అధ్యక్షతన హార్టికల్చర్ అధికారులు, రైతులతో ఎమ్మెల్యే బీసీ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తుందన్నారు. రైతులు పండ్లతోటల పెంపకంపై ఆసక్తి పెంచుకుని సాగుచేసి లాభాలు గడించాలన్నారు. అవుకు మండలం సంగపట్నం సమీపంలో ఒక రైతు అంజీర పంట సాగు చేసి లాభాలు గడిస్తున్నారని తెలిపారు. ఈ పంట ఏడాది వుంటుందని కిలో రూ. 40కు విక్రయిస్తున్నారన్నారు. గతంలో ఈ పండ్లు మహారాష్ట్ర నుంచి మన రాష్ట్రానికి వచ్చేవని, ఇప్పుడు ఇక్కడి రైతుల అంజీర సాగు పట్ల ఆసక్తి చూపుతున్నారన్నారు. ప్రస్తుతం ఎన్నో రకాల పండ్లను మనమే పండించుకుంటున్నామని రాయలసీమలో రైతులు పండ్లతోటల సాగుతో ఆర్థికంగా పుంజుకున్నారని, బనగానపల్లె ప్రాంత రైతులు కూడా ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని కోరారు. ప్రభుత్వం రైతులకు 50 శాతం సబ్సిడీపై పరికరాలు, ఇతరత్రా సహాయం చేస్తుందన్నారు. ఈ ప్రాం తం రైతులకు గాలేరు, ఎస్‌ఆర్‌బీసీ కాలువలు అందుబాటులో వున్నందున పండ్లతోట సాగు విధానాన్ని అం దిపుచ్చుకోవాలన్నారు. ఇందుకు వ్యవసాయ అధికారులు నేలసారాన్ని బట్టి మండలంలోని సాగు నేలలను 4 రకాలుగా వర్గీకరించి రైతులకు ఎలాంటి పంటలు వేసుకుంటే ఎంత పెట్టుబడు లు వుంటాయి.. ఎంత మేరకు లాభా లు వస్తాయో అవగాహన కల్గించాలన్నారు. ఈ ప్రాంతంలో ఎక్కువగా సన్న, చిన్నకారు రైతులు వున్నారని వారికి ప్రభుత్వం నుంచి అందాల్సిన సహాయ, సహకారాలు అందించేలా చూస్తానన్నారు. రైతులు వారి పొలం లో 1,2 ఎకరాలు మాత్రమే సాగు చేకోమని సూచించారు. వ్యవసాయ అధికారులు కూడా రైతులకు అవసరమైన సమాచారంతో కరపత్రాలు ముద్రించి పంచిపెట్టాలని ఆదేశించారు. కార్యక్రమంలో హార్టికల్చర్ పీడీ ఠాగూర్‌నాయక్, నంద్యాల ఏడీ రమణ, ఏపీఎంఐపీ పీడీ శ్రీనివాసులు, ఏపీపీ ఫిరోజ్‌ఖాన్, ఎంపీఓలు వైష్ణవి, శ్రీనివాసులు, బాషా, హెచ్‌ఓ అనిల్‌కుమార్, వివిధ గ్రామాల రైతులు పాల్గొన్నారు.