కర్నూల్

కమ్ముకుంటున్న పొగమంచు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కల్లూరు, డిసెంబర్ 11 : కల్లూరు ప్రాంతంలో తెల్లవారుజామున పెద్దఎత్తున పొగమంచు కమ్ముకుంటుండడంతో పాటు చలి తీవ్రత ఎక్కువగా ఉండడంతో ప్రజలు వణికిపోతున్నారు. ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురవడంతో వాగు లు, వంకలు, కుంటలు, ఎక్కడ పడితే అక్కడ నీరు నిల్వ ఉండడంతో పాటు భూగర్భ జలాలు పెరిగాయి. దీనికి తోడు హంద్రీ నది, చెరువుల్లో కూడా నీరు అధికంగా ఉండటంతో గ్రామీణ ప్రాంతాల్లో తెల్లవారుజామున పొగమంచు దట్టంగా కమ్ముకుంటుంది. అలాగే చలి తీవ్రత కూడా ఎక్కువగా ఉండడంతో ఆయా ప్రాంతాల్లోని ప్రజలు ఉదయం 7 గంటలైనా ఇళ్ల నుండి బయటకు రావడానికి జంకుతున్నారు. హంద్రీనీవా కాలువ నీరు మండల పరిధిలోని వామసముద్రం, తడకనపల్లి, చిన్నటేకూరు, కొంగనపాడు, ఉలిందకొండ, చెట్లమల్లాపురం, బస్తిపాడు, నాయకల్లు, తదితర గ్రామాల మీదుగా ప్రవహి స్తుండడంతో భూగర్భజలాలు బారిగా పెరిగాయి. హంద్రీనీవా నీటిని కూడా గాలి పైపుల ద్వారా హంద్రీనదికి వదలడంతో హంద్రీనదిలో నీరు బాగా ప్రవహిస్తుంది. ఈ నీటితో రైతులు వేసిన పంటలు పచ్చగా ఉన్నాయి. గత ఏడు సంవత్సరాలతో పోల్చుకుంటే ఈ ఏడాది చల్లి తీవ్రత కూడా ఎక్కువగా ఉందని ప్రజలు చర్చించుకుంటున్నారు. దట్టంగా కమ్ముకుంటున్న పొగమంచుతో రోడ్లపై వెళ్లే వాహనాదారులు ముందు వెళ్లే వాహనాలు కనిపించకపోవడంతో లైట్లు వేసుకుని వెళ్తున్నారు. ఇక చలి తీవ్రతకు కూడా ఎక్కువగా ఉండటంతో చిన్నపిల్లలు, వృద్ధులను అత్యవసరం ఉంటే తప్ప ఇళ్ల నుంచి బయటకు పంపడం లేదు.
తెలుగు భాషను విస్మరిస్తే..
కన్నతల్లిని విస్మరించినట్లే..
* మారిషస్ ప్రతినిధి సంజీవ నరసింహ అప్పడు
కర్నూలు సిటీ, డిసెంబర్ 11 : తెలు గు భాషను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి తెలుగు వాడిపై ఉందని, తెలుగు భాషను విస్మరిస్తే కన్నతల్లిని విస్మరించినట్లేనని మారిషస్ ప్రతినిధి సంజీవ నరసింహ అప్పడు పేర్కొన్నారు. నగరంలోని ఉస్మానియా కళాశాల తెలుగుశాఖ ఆధ్వర్యంలో సోమవారం తెలుగు బ్రహ్మోత్సవాలు కార్యక్రమం నిర్వహించగా ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. మారిషస్ దేశంలో 90శాతం మంది ప్రజలు భారతీయులేనని, అన్ని భాషలతో పాటు తెలుగు భాషాభివృద్ధికి అక్కడి ప్రభుత్వం ప్రత్యేకంగా కృషి చేస్తుందన్నారు. అలాగే రోజుకు 3 గంటల పాటు రేడియోలో తెలుగు కార్యక్రమాలు ఉంటాయన్నారు. ప్రత్యేకమైన తెలుగు సాంస్కృతిక సంస్థ, తెలుగు భాష సంఘం మారిషస్ దేశంలో తెలుగును ప్రోత్సహిస్తున్నామని, వేమన పద్యాలు, ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. భాషతో పాటు తెలుగు వారి సంస్కృతి, సంప్రదాయాలను అక్కడ ఆదరిస్తున్నారన్నారు. తెలుగు వారికి ఆ దేశంలో మంచి అవకాశాలు ఉన్నాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రపంచ తెలుగు మహాసభలను మరికొన్ని రోజుల్లో ప్రారంభిస్తుండగా ఉప్మానియా కళాశాలలో ఒక అంతర్జాతీయ వ్యక్తితో తెలుగు బ్రహ్మోత్సవాలు నిర్వహించడం తెలుగు వారికే గర్వ కారణమన్నారు. తెలుగు శాఖ అధ్యక్షుడు డా. ఎం. అన్వర్ హుస్సేన్ మాట్లాడుతూ సంజీవ నరసింహ అప్పడు తమ కళాశాలకు రావడం నాల్గవ సారని, వారి సహాయ సహకారాలతో గతంలో తెలుగులో అంతర్జాతీయ సదస్సు నిర్వహించామన్నారు. కార్యక్రమంలో ఉస్మానియా కళాశాల ప్రిన్సిపాల్ అజ్రాజావేద్, జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ డా. అహమ్మద్, తెలుగు సహాయాచార్యులు డా. టి.సూర్యనారాయణరెడ్డి, హిందీ శాఖ అధ్యక్షుడు డా. సలీంబాషా, ఆంగ్ల అధ్యాపకులు మహబూబ్‌బాషా, సాహితీ స్రవంతి కార్యదర్శి జంద్యాల రఘుబాబు, తదితరులు పాల్గొన్నారు.