కర్నూల్

భృంగి వాహనంపై విహరించిన ఆది దంపతులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీశైలం, జనవరి 13 : సంక్రాంతి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం శ్రీశై లంలో శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్లు భృంగి వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. పంచాహ్నిక దీక్షతో 7 రోజుల పాటు నిర్వహించే ఈ సంక్రాంతి బ్రహ్మోత్సవాల్లో రెండవ రోజు భృంగి వాహనంపై స్వామి అమ్మవార్లు భక్తులకు దర్శనమివ్వడంతో అధిక సంఖ్యలో భక్తులు బృంగి వాహనంపై వేచివున్న స్వామి అమ్మవార్లను దర్శించుకొని తమ మొక్కులు తీర్చుకున్నారు. శనివారం ఉదయం లోక కల్యాణం కోసం జపాలు, పారాయణలు, మండపారాధనలు, పంచవరణార్చనలు, నిత్య హవనాలు, రుద్రహోమం, ఆగమ శాస్త్రానుసారంగా అర్చక వేదపండితులు నిర్వహించారు. సాయంత్రం పూజల అనంతరం స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను అక్క మహాదేవి అలంకరణ మండపంలో ఉత్సవ మూర్తులకు ప్రత్యేక పలతో అలంకరించి అలంకరణ పూజలను అర్చక వేదపండితులు నిర్వహించారు. భృంగివాహనంపై వేచివున్న ఉత్సవమూర్తులకు అర్చక వేదపండితులు మంగళ వాయిద్యాల నడుమ వాహన పూజలు నిర్వహించి మహామంగళహారతులు ఇచ్చి స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను గర్భాలయం గుండా మాడావీధుల్లోకి తోడ్కొని వచ్చారు. దేవస్థానం వారు ఏర్పాటు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఎంతో ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో నారాయణ భరత్‌గుప్తా దంపతులు, అధికారులు, అర్చక వేదపండితులు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.