కర్నూల్

పెరిగిన పత్తి ధర..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదోనిటౌన్, జనవరి 13: ఆదోని మార్కెట్‌యార్డులో ఈ సీజన్‌గాను పత్తి ధరలు భారీగా పెరిగి శనివారం మార్కెట్‌లో అమ్మకానికి వచ్చిన పత్తి క్వింటాల్ గరిష్ట ధర రూ.5489లకు చేరి రికార్డు సృష్టించింది. 15 రోజుల క్రితం రూ.5446లకు చేరిన క్వింటాల్ గరిష్ట పత్తి ధర రూ.5350లకు చేరి శనివారం మళ్లీ ధరలు పుంజుకుని క్వింటాల్ గరిష్ట ధర రూ.5489లకు ధర చేరింది. శనివారం మార్కెట్‌యార్డులో సుమారు 2వేల 150క్వింటాళ్ల పత్తి అమ్మకానికి రాగా అందులో గరిష్ట క్వింటాల్ ధర రూ.5489లు, కనిష్ట ధర రూ.3609లు కాగా మధ్య రకం ధర రూ.4969లు ధర పలికినట్లు మార్కెట్‌యార్డు గ్రేడ్ 1 కార్యదర్శి లావణ్య తెలిపారు. పత్తి ధరలు తగ్గి మళ్లీ పెరగడంపై రైతులు హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యంగా పత్తి బెళ్లు ధరలు కండికి ధర భారీగా వరకు పెరగడంతో పత్తిచెక్కుల ధరలు భారీగా పెరిగినట్లు వ్యాపారస్థులు పేర్కొంటున్నారు. ఇంక దూది ధరలు పెరిగే అవకాశం ఉందని, అందువల్లే పత్తికి కూడా డిమాండ్ పెరుగుతోందని, ధరలు కూడా భాగా వస్తాయని వ్యాపారస్థులు వివరిస్తున్నారు.