కర్నూల్

నంద్యాల రైల్వేస్టేషన్‌లో ఎస్కలేటర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నంద్యాల, జనవరి 17: నంద్యాల రైల్వే స్టేషన్‌లో ఎస్కలేటర్ ఏర్పాటు చేస్తామని, మూలసాగరం రైల్వే గేటు వద్ద అండర్ వే నిర్మాణం చేపడతామని దక్షిణ మధ్య రైల్వే జీఎం వినోద్‌కుమార్ యాదవ్ హామీ ఇచ్చారు. బుధవారం ఉదయం ప్రత్యేక రైలులో నంద్యాల చేరుకున్న జీఎం వినోద్‌కుమార్‌యాదవ్ నంద్యాల రైల్వే స్టేషన్‌ను జోనల్ అధికారులతో కలసి, గుంటూరు డీఆర్‌ఎం జ్యోతి భూమా ఆధ్వర్యంలో తనిఖీ చేసి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. రెండున్నర గంటల పాటు స్టేషన్‌లో, స్టేషన్ బయటి ప్రాంతంలో తనిఖీలు నిర్వహించి రైల్వే కార్మికుల సంక్షేమం గురించి, ప్రయాణికుల సౌకర్యాల కల్పన గురించి పలువురిని అడిగి తెలుసుకున్నారు. జీఎం వినోద్‌కుమార్‌యాదవ్‌ను నంద్యాల ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి కలసి రైల్వేస్టేషన్ పరిధిలో సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఎంపీ ఎస్పీవైరెడ్డి అనారోగ్య పరిస్థితుల కారణంగా ఆయన రాకపోవడంతో ఎస్పీవై రెడ్డి అల్లుడు శ్రీ్ధర్‌రెడ్డి ఎంపీ వినతిపత్రాన్ని జీఎంకు అందించి వివరించారు. నంద్యాల రైల్వేస్టేషన్‌లో విజయ డెయిరీ సౌజన్యంతో ప్రయాణికులకు ఉచిత మినరల్ వాటర్ ప్లాంటును జీఎం ప్రారంభించారు. అనంతరం క్రూ బుకింగ్ లాబీని పరిశీలించి రైల్వే డ్రైవర్లకు అందుతున్న సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. రన్నింగ్ రూములో రైల్వే కార్మికులకు ఏర్పాటు చేసిన వసతి సౌకర్యాలను పరిశీలించడమేకాక లోకో పైలెట్ ఉమా మహేశ్వరరావుతో కలసి జీఎం అల్పాహారం తీసుకుని కార్మికుల కోసం అందజేస్తున్న ఆహార నాణ్యత గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. రన్నింగ్ రూములో మొక్కలు నాటిన అనంతరం రైల్వే స్టేషన్ బయట రామాలయం ఎదురుగా నూతనంగా నిర్మించిన చిన్న పిల్లల పార్కును, పార్కు నిర్వాహకులు అయిన బాలగుర్రం భార్యతో ప్రారంభించారు. పదవీ విరమణ చేసిన బాలగుర్రం దంపతులు పార్కు నిర్వహణ బాధ్యతలను తీసుకోవడం పట్ల అభినందించి వారికి చేరో రూ.5 వేలు అవార్డుగా నగదు అందజేశారు. అనంతరం రైల్వే ఆసుపత్రిలో కార్మికులకు అందుబాటులో ఉన్న సౌకర్యాలను, రెఫరల్ కేసుల పట్ల వైద్యులతో, సిబ్బందితో రైల్వే కార్మికులతో చర్చించారు. అలాగే కార్మికుల వసతి గృహాన్ని పరిశీలించి రైల్వే కార్మికుల కుటుంబ సభ్యులతో నంద్యాలలో అందుబాటులో ఉన్న సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. అలాగే నంద్యాల రైల్వేస్టేషన్ ప్రధాన భవనంపై ఏర్పాటు చేసిన నంది విగ్రహానికి విద్యుత్ వెలుగులు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. రైల్వేస్టేషన్ ఎదురుగా రైల్వే స్థలంలో చిన్న వ్యాపారాలు చేసుకుంటున్న వారికి ప్రత్యేక స్థలం కేటాయించి వ్యాపార సముదాయాన్ని నిర్మించి ఇస్తామని రోడ్డును ఆక్రమించుకున్న వ్యాపారులు ఆ స్థలాన్ని ఖాళీ చేయాలని ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి సమక్షంలో కోరారు. అలాగే రైల్వే క్యాంటిన్, స్టేషన్ మేనేజర్ రూము వద్ద సౌకర్యాలను పరిశీలించారు. అనంతరం జీఎం మాట్లాడుతూ మూలసాగరం రైల్వే గేటు వద్ద ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉందని, ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి వినతికి స్పందించి అక్కడ అండర్‌వే బ్రిడ్జి నిర్మాణానికి పరిశీలించాలని కోరారు. రన్నింగ్ రూముపై మొదటి అంతస్తు భవనం నిర్మించి రైల్వే కార్మికులకు మరిన్ని సౌకర్యాలు కల్పిస్తామన్నారు. రైల్వే స్టేషన్ ఎదురుగా దక్షిణం వైపు సిమెంటు స్లాగ్ అన్‌లోడింగ్ కారణంగా స్టేషన్ ప్రాంతం కాలుష్యంతో నిండిపోతోందని ఎమ్మెల్యే వినతికి స్పందించిన జీఎం పక్కా ప్రణాళికతో గూడ్స్‌షెడ్‌ను నిర్మించాలని ఆదేశించారు. నూనెపల్లె ఆర్‌ఓబీకి మెట్ల సౌకర్యం కల్పించాలని కోరగా అందుకు అంగీకరించారు. విజయ డెయిరీ నుండి నంద్యాల పట్టణంలోకి దారి తీసే 80 అడుగుల రోడ్డు మధ్యలో రైల్వే గేటు ఏర్పాటు చేయాలని కోరగా కొత్త రైల్వే గేట్లు ఏర్పాటు చేసే ఆలోచన ఏదీ లేదని, నిధులు అందుబాటులోకి వస్తే ఉపరితల వంతెనకు కృషి చేస్తామన్నారు. జీఎంకు సీపీఎం నాయకులు రమేష్‌కుమార్, మస్తాన్‌వలి, శ్రీనివాసమూర్తి, కేఎండి గౌస్, తోట మద్దులు తదితరులు కలసి నంద్యాల రైల్వేస్టేషన్ సమస్యల గురించి వినతిపత్రం అందజేశారు. చివరలో గుంటూరు డీఆర్‌ఎం జ్యోతి భూమా చేస్తున్న కృషిని ఆయన అభినందించారు.