కర్నూల్

ముక్కతో రోగం పక్కా..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు సిటీ, జనవరి 17: ప్రజలు ఏదైన పెద్ద, చిన్న పంక్షన్ ఏర్పాటు చేసినా విందులో ఎక్కువ శాతం మాంసం ముక్కనే ఏర్పాటు చేయాలని కోరుతుంటారు. ప్రస్తుతం ఇది ఒక సంప్రదాయంగా భావిస్తూ ఖచ్చితంగా చికెన్, మటన్ కాని ఏర్పాటు చేస్తున్నారు. కొందరికైతే ముక్కలేనిదే ముద్ద దిగని పరిస్థితి. అలాంటి ముక్కతో మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం వల్ల పలు రోగాలు పొంచి ఉన్నాయన్న వాస్తవాన్ని గ్రహించలేక పోతున్నారు. ఫలితంగా నిత్యం రోగాలతో కాలం వెల్లదీస్తున్నారు. నగరంలో మాంసం విక్రయాలు గాడి తప్పుతున్నాయి. పర్యవేక్షణ లేమి పరిశుభ్రత వాతావరణంలో చేస్తున్న మాంసం విక్రయాలు ప్రజారోగ్యానికి పెద్ద సవాల్‌గా మారాయి. జంతు వధ, మాంసపు విక్రయాలకు సంబంధించి ప్రత్యేకంగా వేదికలను ఏర్పాటు చేసిన చాల మంది వ్యాపారులు రోడ్డు పక్కన మురుగు కాల్వలకు చేరువలో చుట్టూ వీధి కుక్కలు, ఈగల మోత మధ్యనే జంతు వధ చేస్తూ కలుషిత ప్రదేశంలోనే అమ్మకాలను చేపడుతూ రోగాలను అంటగడుతున్నారు. కారణం నగర పాలక సంస్థలోని ప్రజారోగ్య ఉద్యోగులతో మాంసపు విక్రేతలతో కుమ్మకై చనిపోవటానికి సిద్ధంగా ఉన్న గొర్రెల మాంసం బజార్లో ప్రత్యక్షమవుతుంది. మార్కెట్‌లో మటన్ ధర దాదాపు రూ.500 వరకు పలుకుతుంది. స్వార్థ పరులైన వ్యాపారులు అనారోగ్యంతో చనిపోవడానికి సిద్ధంగా ఉన్న మూగజీవాల్ని తక్కువ ధరకు కొనుగోలు చేసి వాటిని కోసి ప్రజలకు విక్రయించి సొమ్ము చేసుకొంటున్నారు. అధికారుల పర్యవేక్షణ, నియంత్రణ లోపించడంతో ఏది మంచో ఏది చెడో తెలియని పరిస్థితి నెలకొంది. ఆరోగ్యవంతమైన గొర్రెలు, మేకలను వధ శాలల్లో అనుమతించాక దుకాణాల్లో మాంసాన్ని విక్రయించాలన్న నిబంధనలు ఆచరణ కావడం లేదు. నగరంలో చిన్న, పెద్ద కమేళాలున్నాయి. గడ్డా వీధికి సమీపంలో ఉన్న ఈ ప్రాంతంలో వ్యాపారులదే ఇష్టారాజ్యం. వాస్తవానికి జంతు వధకు ముందు పశువైద్యాధికారి చేత ఆరోగ్య పరీక్షలు చేయించి ఆ తర్వాత కమేళాలోనే వధించాలి. ఈయన నగరంలో క్షేత్రస్థాయిలో తనిఖీలు చేసే సమయంలో కమేళాలో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల కాలంలో మున్సిపల్ హెల్త్ అధికారి తన బృందంతో మాంసపు దుకాణాలపై దాడులు నిర్వహించగా ఒక్కొక్కటి అక్రమాలు బయటకు వస్తున్నాయి.
మున్సిపల్ ఆరోగ్యాధికారి డా. ఉస్మాన్ ఆలీఖాన్...
ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదుల మేరకు నగరంలోని పలు కాలనీల్లోని చికెన్, మటన్ దుకాణాలపై దాడులు నిర్వహించి జరిమానా విధిస్తున్నాము. బుధవారం బళ్లారి చౌరస్తా ప్రాంతంలో ముబారక్ మటన్ సెంటర్, మహాబూబ్ బాషా మటన్ అండ్ చికెన్ సెంటర్లపై దాడులు నిర్వహించి రూ. 6వేల దాక జరిమానా విధించాము. బళ్లారి చౌరస్తాలోని 4వ పట్టణ పోలీస్ స్టేషన్ సమీపంలో ఒక మురుగు కాల్వపైనే జంతు వధ చేయడమే కాక ప్లాస్టిక్ కవర్లను కూడా వాడుతున్నారని, వాటిని పట్టుకొని వారిపై కేసు నమోదు చేసి జరిమానా కూడ విధించాం. ఖచ్చితంగా నిబంధనలను పాటించాలని లేని పక్ష్యంలో చర్యలు తప్పవు.