కర్నూల్

ఆర్టీసీ బస్సు, కారు ఢీ... ముగ్గురి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాణ్యం/మహానంది, జనవరి 17: కర్నూలు-చిత్తూరు జాతీయ రహదారిపై బుధవారం మధ్యాహ్నం పాణ్యం సమీపంలోని నూలు మిల్లు వద్ద ఆర్టీసీ బస్సు, కారు ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు మృతిచెందారు. ఇద్దరు గాయపడ్డారు. అందులో పద్మావతి (25) అక్కడికక్కడే మృతి చెందగా, తీవ్రంగా గాయపడిన కారు డ్రైవర్ రవికుమార్ (22), చంద్రవౌళి, హేమచంద్ర నాయు డులను కర్నూలుకు తరలిస్తుండగా మార్గమధ్యలో రవికుమార్ మృతిచెందాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ హేమచంద్రగౌడు చనిపోయాడు. తోట హరిప్రసాద్ (18), చంద్రవౌళిలు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వివరాలిలా ఉన్నాయి. మహానంది మండలం తిమ్మాపురం గ్రామానికి చెందిన సైనికుడు చంద్రవౌళితోపాటు ఆయన భార్య పద్మావతి, వారి స్నేహితుడు హేమచంద్ర, చంద్రవౌళి చిన్నాన్న కొడుకు తోట హరిప్రసాద్‌లు కలసి కర్నూలులో మిలిటరీ క్యాంటిన్ నుండి వస్తువులు తీసుకోవడానికి కారు తీసుకుని ప్రయాణమయ్యారు. మార్గమధ్యలో నూలుమిల్లు వద్దకు రాగానే కర్నూలు నుండి కడపకు వెళ్తున్న ఆర్టీసీ బస్సును ఎదురుగా వేగంగా వస్తున్న కారు ముందున్న వాహనాన్ని తప్పించబోయి ఢీకొంది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడి చేరుకుని 108లో చికిత్స నిమిత్తం గాయపడిన వారిని స్థానిక శాంతిరామ్‌కు తరలించారు. అటు నుంచి చంద్రవౌళిని కర్నూలుకు తరలించారు. గాయపడిన తోట హరిప్రసాద్ అందించిన సమాచారం మేరకు చంద్రవౌళి పూనేలో సైనికుడిగా ఉంటున్నాడని, సెలవులపై తమ స్వగ్రామానికి వచ్చాడు. మరణించిన హేమచంద్రగౌడులో నంద్యాలలోని విజయవాడ పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తున్నాడు. ఈ ప్రమాదానికి అతివేగం కారణంతోపాటు ప్రస్తుతం జాతీయ రహదారి విస్తరణలో భాగంగా కి.మీ మేరా ఒక వైపు వాహనాలు ప్రయాణిస్తుండడంతో డ్రైవర్ రవికుమార్ ఎడమవైపు వెళ్తూ ముందున్న వాహనం తప్పించబోయి ఈ ప్రమాదానికి గురయ్యారు. ఆర్టీసీ బస్సు డ్రైవర్ కృష్ణారెడ్డికి స్వల్ప గాయాలు కాగా శాంతిరామ్‌లో చికిత్స పొందుతున్నాడు. పాణ్యం సీఐ పార్థసారథిరెడ్డి, ఎస్‌ఐ చిరంజీవిలు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈమేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పాణ్యం పోలీసులు తెలిపారు.

బ్రహ్మోత్సవాలకు పూర్ణాహుతి

* సంప్రదాయబద్ధంగా ధ్వజావరోహణ
* నేటితో ముగియనున్న ఉత్సవాలు
శ్రీశైలం, జనవరి 17: శ్రీశైల మహాక్షేత్రంలో సంక్రాంతి బ్రహ్మో త్సవాలను పురస్కరించుకుని బుధ వారం ఉదయం బ్రహ్మోత్సవాలకు పూర్ణాహుతి కార్యక్రమాన్ని అర్చక వేదపండితులు శాస్త్రోక్తంగా నిర్వ హించారు. స్వామివార్ల యాగశాలలో పూర్ణాహుతి ద్రవ్యాలకు ఆలయ ఏవో నారాయణ భరత్‌గుప్తచే ఆలయ అర్చక వేదపండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పూర్ణాహుతి ద్రవ్యాలను హోమగుండానికి సమర్పించి పూర్ణాహుతి కార్యక్రమాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. అనంతరం చండీశ్వరునికి ప్రత్యేక పూజలు నిర్వహించి చండీశ్వరునికి సరస్వతి అంతర్‌వాహినిలో త్రిశూల స్నానం చేయించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వసంతోత్సవం, త్రిశూల స్నానం కార్యక్రమాలను సాంప్రదాయబద్దంగా నిర్వహించి సంక్రాంతి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ధ్వజావరోహణ చేశారు. ధ్వజస్తంభానికి బ్రహ్మోత్సవానికి ఆహ్వాన సూచకంగా ఎగురవేసిన పతాకాన్ని ధ్వజారోహనం చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గురువారం స్వామి అమ్మవార్లకు పుష్పోత్సవం, శయనోత్సవం, అశ్వవాహన సేవతో సంక్రాంతి బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.
వ్యవసాయ శాఖామంత్రిని కలిసిన ఎమ్మెల్యే బీసీ
బనగానపల్లె, జనవరి 17: అమరావతిలోని వెలగపూడిలో రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డిని ఎమ్మె ల్యే బీసీ. జనార్ధన్‌రెడ్డి బుధవారం కలుసుకుని నియోజకవర్గంలోని రైతుల సమస్యలపై చర్చించారు. ఈ ఏడాది నియోజకవర్గంలో మినుము పంట అధిక దిగుబడి వచ్చిందని, అయితే కొంతమంది రైతుల నుండి మా త్రమే మినుము కొనుగోలు చేయడం వల్ల మిగిలిన రైతులు ఆందోళన చెందుతున్నారని మంత్రి దృష్టికి తీసుకుపోయామన్నారు. మిగిలిపోయిన మి నుము పంటను కూడా గిట్టుబాటు ధరకు కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని, ఈ పంటను ప్రభుత్వ మే కొనుగోలు చే యాలని కోరామని అందు కు మంత్రి సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్యే తెలిపారు.
క్రిష్ణాపురంలో పూజలందుకున్న అహోబిలేసుడు

ఆళ్లగడ్డ, జనవరి 17: అహోబిలేసుని పార్వేట ఉత్సవాలలో భాగంగా బుధవారం ఉదయం శ్రీ లక్ష్మీనరసింహస్వామి పార్వేట ఉత్సవపల్లకి ఆర్ క్రిష్ణాపురం గ్రామం చేరుకుంది. ఈ సందర్భంగా పల్లకి గ్రామ పొలిమేరలకు చేరుకోగానే సర్పంచ్ సుబ్బరత్నమ్మ, నాయకులు రఘురామిరెడ్డి, వెంకట శివారెడ్డి, గ్రామపెద్దలు, వీఆర్వో మేళతాళాలతో స్వాగతం పలికారు. గ్రామంలోని తెలుపుల వద్ద ఆశీనులై పపల్లకిలో కొలువుదీరిన శ్రీ జ్వాలానరసింహస్వామి, శ్రీ ప్రహ్లాదవరదస్వామిలు భక్తుల నుండి పూజలందుకున్నారు. గ్రామంలో తిరుణాల వాతావరణం నెలకొంది
ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలి
కర్నూలు సిటీ, జనవరి 17: తెలుగు ప్రజల ఖ్యాతిని ఖండాతరాలకు చాటిచెప్పి, తెలుగుదేశం పార్టీని స్థాపించి అనతి కాలంలోనే రాష్ట్ర రాజకీయాల్లోనే మార్పులు తెచ్చిన నందమూరి తారక రామారావు(ఎన్టీఆర్)కు భారతరత్న అవార్డు ఇవ్వాలని రాష్ట్ర ఆర్‌ఎంపీ సంఘాల సమాఖ్య ప్రధాన సభ్యులు, సామాజిక కార్యకర్త పి.మహమ్మద్ రఫీ బుధవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. తెలుగు జాతి గర్వంచే విధంగా నటనా కౌసల్యాన్ని చాటి కళల్లో రాణించి కళారంగానికే పేరు తెచ్చాడన్నారు. ప్రజలే దేవుళ్లు, సమాజమే దేవాలయంగా భావించి పలు సంక్షేమ కార్యక్రమాలను ఆరంభించి బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేసిన మహానీయుడన్నారు. పార్టీని స్థాపించిన అనతి కాలంలోనే అధికారంలోకి వచ్చి రాజకీయాల్లో నూతన ఒరవడి సృష్టించి, సామాన్యుడికి సైతం రాజకీయాలు అర్థం అయ్యే విధంగా చేశాడన్నారు. పరిపాలన సౌలభ్యం కోసం మండల వ్యవస్థను ప్రవేశ పెట్టి సామాన్యుడికి న్యాయం చేసిన మహోన్నత వ్యక్తి అని, అటు వ్యక్తి ఎన్టీఆర్ అని కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి భారత రత్న అవార్డును ఇవ్వాలని కోరారు.

మండలధ్యక్షుని ఎంపిక ఉత్కంఠకు నేడు తెర...
* విజయం ఏ పార్టీని వరించేనో...? * టీడీపీతో వైకాపా చర్చలు విఫలం
కోడుమూరు, జనవరి 17: ఇప్పుడా.. అప్పుడా అనే రీతిలో ఉత్కంఠ భరితంగా సాగిన కోడుమూరు మండల అధ్యక్షుని ఎంపిక గురువారం జరిగే ఎన్నికతో ఉత్కంఠతకు తెరపడనుంది. ఎంపీపీ స్థానానికి ఇంకా ఏడాది కాలం ఉన్నప్పటికీ ఈ స్థానం కోసం కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల నేతలు సవాలుగా తీసుకున్నారు. కాగా వైకాపాకు చెందిన ఎంపీటీసీలతో టీడీపీ నేతలు జరిపిన చర్చలు విఫలం కావడంతో కాంగ్రెస్‌కు దాదాపుగా విజయం సాధించే దిశలో ఉన్నట్లు తెలుస్తోంది. రెండు బలమైన పార్టీల నడుమ సాగే ఈ ఎన్నికలు నువ్వా.. నేనా.. అనే రీతిలో సాగుతున్నాయి. మండలంలో మొత్తం 19 ఎంపీటీసీలు ఉండగా వీటిలో కాంగ్రెస్, టీడీపీ, వైకాపా పార్టీలు, ఇద్దరు స్వతంత్రులు, సీపీఎంకి చెందిన ఒక ఎంపీటీసీ ఉన్నారు. ఈ ఎన్నికల్లో వైకాపా తటస్థంగా ఉండటంతో కాంగ్రెస్, టీడీపీల మధ్యే పోటీ రసవత్తరంగా మారింది. ఎలాగైన మండల అధ్యక్ష స్థానంను దక్కించుకునేందుకు ఇరు పార్టీల అధినేతలు తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు సాగించినట్లు తెలుస్తోంది. ఎంపీపీ ఎన్నిక స్థానానికి నోటిఫికేషన్ విడుదలైన రోజు నుంచి నేటి వరకు నేతలు ఒక్క నిమిషం కునుకు లేకుండా ఎంపీటీసీలను కూడ గట్టుకునేందుకు ఎంతో శ్రమించి ఎవరికీ వారు రహస్య శిబిరాలను ఏర్పాటు చేసుకున్నట్లు సమాచారం. దీంతో ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయని చెప్పవచ్చు. గత పది రోజుల పాటు కాంగ్రెస్, టీడీపీలు సాగించిన రాజకీయ ఎత్తుగడలకు గురువారంతో తెరపడనుంది.