కర్నూల్

కేంద్ర మంత్రులు, ఎంపీలతో రాజీనామా చేయించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నందికొట్కూరు, ఫిబ్రవరి 23 : ప్రత్యేక హోదా కోసం సీఎం చంద్రబాబునాయుడు కేంద్ర మంత్రులు, ఎంపీలచే రాజీనామా చేయించాలని ఎమ్మెల్యే ఐజయ్య డిమాండ్ చేశారు. శుక్రవారం పట్టణంలోని తన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రత్యేక హోదా కోసం ప్రతిపక్షంలో వున్న వైకాపానే గట్టిగా కృషి చేస్తుంటే అధికారంలో వున్న టీడీపీ కేంద్రానికి దాసోహం పలుకడం శోచనీయమన్నారు. ఓటుకునోటు కేసులో ఇరుక్కున్నందునే సీఎం చంద్రబాబునాయుడు కేంద్రం ఎలా చెబితే అలా వ్యవహరిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధికి ఆమడ దూరంలో నిలుపుతున్నాడని ఆరోపించారు. నాడు హోదా వద్దు ప్యాకేజీ ముద్దు అన్న చంద్రబాబునాయుడికి నేడు కేంద్ర ప్రకటనతో నోరు మెదిపే అవకాశం లేకుండా పోయిందన్నారు. తేదేపా నాయకులు తమ వ్యక్తిగత వ్యాపార సామ్రాజ్యం విస్తరించుకునేందుకు తమ పదవులకు కేంద్రం వద్ద తాకట్టు పెట్టడంతోనే హోదా కోసం పోరాటం చేయలేదన్నారు. ఇప్పటికైనా తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాలంటే ప్రత్యేక హోదా కోసం కలిసి రావాలని హితవు పలికారు. హోదా కోసం వైకాపా ఆధ్వర్యంలో మార్చి 5వతేదీన ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ఆందోళన చేస్తున్నామన్నారు.

వేడినీళ్లు మీదపడి నలుగురు చిన్నారులకు తీవ్రగాయాలు

బనగానపల్లె, ఫిబ్రవరి 23: పట్టణంలోని కొండపేట 10వ మినీ అంగన్‌వాడీ స్కూల్‌లో శుక్రవారం ఉదయం అంగన్‌వాడీ వర్కర్ వెంకటరమణమ్మ వేడినీటి గినె్న తీసుకుపోతుండగా చెయ్యి జారి పడిపోవడంతో వేడినీళ్లు అక్కడే వున్న చిన్నారులపై పడగా నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాల మేరకు అంగన్‌వాడీ కేంద్రానికి స్వంత భవనం లేకపోవడంతో 10వ కేంద్రాన్ని వెంకటరమణమ్మ ఇంటివద్దనే నిర్వహిస్తోంది. ఆమె స్నానం చేసేందుకు వేడినీరు పెట్టుకుని గినె్నను తీసుకుపోతున్న సమయంలో చెయ్యిజారి గినె్నపడిపోవడంతో ఈ సంఘటన జరిగింది. ఈ సంఘటనలో హర్షవర్ధన్, సుదర్శన్, సుజాత, ప్రసన్న అనువారి శరీరంపై పడి చాలా వరకు బొబ్బలు ఎగిశాయి. వారిని చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా వారి గాయాల తీవ్రతను పరిశీలించిన వైద్యులు నంద్యాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. చిన్నారుల శరీరంపై తీవ్ర బొబ్బలు రావడంతో వారిబాధ వర్ణణాతీతం. ఈ సంఘటన ఎరుకలి సంఘం, సీపీఐ నేతలు వైద్యశాలకు వెళ్లి చిన్నారులను పరామర్శించి ఇలాంటి సంఘటనలకు సీడీపీఓ కేంద్రాలను పర్యవేక్షణ సరిగా లేకపోవడమే కారణంగా విమర్శించారు.