కర్నూల్

నంద్యాలలో నీటి ఎద్దడికి నిర్లక్ష్యమే కారణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నంద్యాల, ఏప్రిల్ 30: నంద్యాల పట్టణానికి ఎన్నడూలేని విధంగా నీటి ఎద్దడి సమస్య ఉత్పన్నం కావడానికి మున్సిపల్ యంత్రాంగం, చైర్ పర్సన్ల నిర్లక్ష్యమే కారణమని కౌన్సిలర్లు ధ్వజమెత్తారు. నీటి ఎద్దడి నివారణకు రూ.3 కోట్లు నిధుల దుర్వినియోగం జరిగిందని ప్రశ్నించారు. శనివారం నంద్యాల మున్సిపల్ కౌన్సిల్ సమావేశం చైర్ పర్సన్ దేశం సులోచన అధ్యక్షతన జరిగింది. సమావేశం ప్రారంభంలోనే వైస్ చైర్మన్ గంగిశెట్టి విజయకుమార్ నీటి ఎద్దడిపై చైర్‌పర్సన్‌ను నిలదీశారు. నంద్యాల పట్టణానికి తాగునీటి వనరుల వినియోగం మున్సిపల్ యంత్రాంగానికి తెలియదా? అని ప్రశ్నించారు. ప్రతి ఏడాది ఫిబ్రవరి నెలలోనే ఎస్‌ఎస్ ట్యాంకు, చిన్న ఎస్‌ఎస్ ట్యాంకు, చిన్న చెరువులను నింపేవారని, అయితే ఈ ఏడాది ఉద్దేశ్య పూర్వకంగానే నీటి వనరులకు నీటిని నింపడంలో విఫలమయ్యారని ఎద్దేవా చేశారు. ఫిబ్రవరి నెలాఖరులో జరిగిన సమావేశంలో నీటి సమస్యపై అజెండాలో చేర్చలేదని, నిధుల అవసరాన్ని తెలుపలేదని ధ్వజమెత్తారు. ఈ విషయంపై చైర్‌పర్సన్ జవాబు ఇస్తూ నీటి ఎద్దడి నివారణ కోసం కలెక్టర్‌తో చర్చించేందుకు రమ్మని కౌన్సిలర్లను ఆహ్వానిస్తే నామమాత్రంగా ఐదుగురు మాత్రమే వచ్చారని, కౌన్సిల్ సమావేశంలో ప్రశ్నలు కురిపిస్తున్న కౌన్సిలర్లు అప్పుడు ఏమి చేశారని ప్రశ్నించారు. అనంతరం కమిషనర్ సత్యనారాయణ మాట్లాడుతూ నంద్యాల పట్టణానికి తాగునీటి సరఫరా చేసే వనరులను కెసి కెనాల్ ద్వారా ఫిబ్రవరి నెలాఖరు నాటికి నింపే వారని, అయితే ఈ ఏడాది కెసి కెనాల్‌కు డిసెంబర్ నెలలోనే నీటిని నిలిపి వేయడం వల్ల సాధ్యం కాలేదన్నారు. చిన్న ఎస్‌ఎస్ ట్యాంకులో, ఎస్‌ఎస్ ట్యాంకులో ఉన్న నీటిని రోజు మార్చి రోజు వినియోగిస్తూ కొంత మంది కౌన్సిలర్ల సహకారంతో వ్యవసాయానికి వినియోగించే చిన్న చెరువు నీటిని కూడా పట్టణ ప్రజల దాహార్తి తీర్చేందుకు ఉపయోగించుకోవడం జరిగిందన్నారు. అజెండాలోని 18వ అంశంపై ఎమ్మెల్యే భూమానాగిరెడ్డి వర్గానికి చెందిన కౌన్సిలర్లు తాగునీటి ఎద్దడి నివారణలో కౌన్సిల్‌తోపాటు మున్సిపల్ యంత్రాంగం విఫలమైందని, ప్రజలు తమను నిలదీస్తున్నారని ప్రశ్నించారు. అజెండాలో చేర్చిన విధంగా పట్టణ ప్రజల దాహార్తి తీర్చేందుకు ట్యాంకర్ల ద్వారా సరఫరా చేసే నీటి వనరులు ఎక్కడ ఉన్నాయని ప్రశ్నించారు. అజెండాలో చూపిన విధంగా నీటి ఎద్దడి నివారణకు రూ.3 కోట్లు ఖర్చులు చూపించడం స్వాహా చేసేందుకేనని ఆరోపించారు. కమిషనర్ మాట్లాడుతూ నెల రోజుల నుండి వెలుగోడు రిజర్వాయర్‌లో డెడ్ స్టోరేజ్‌లో ఉన్న నీటిని తరలించేందుకు మున్సిపల్ యంత్రాంగం రాత్రింబవళ్లు అష్టకష్టాలు పడుతోందని, ఎస్‌ఎస్ ట్యాంకుకు మరో 15 రోజులు నీటి సరఫరా జరిగితే ఇంకో నెల రోజుల పాటు ప్రజలకు ఏ ఇబ్బంది లేకుండ నీటి సరఫరా చేయవచ్చన్నారు. కాలనీల్లో నీటి కొళాయిలకు రాని ప్రాంతాలకు ట్యాంకర్లతో సరఫరా చేయడమేకాక బోర్లకు మోటార్లు బిగించి సింటెక్స్ ట్యాంకుల్లో నీటిని నింపి వార్డుకు రెండు మూడు చోట్ల ఏర్పాటు చేశామని, ప్రజలు వాడుకోవచ్చన్నారు. అనంతరం మార్కెట్ వేలాలపై కౌన్సిలర్లు ఇచ్చిన సలహాలను ఆమోదిస్తూ సమావేశం ముగించారు.