క్రైమ్/లీగల్

ట్రాక్టర్‌పై నుంచి పడి వ్యక్తి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బనగానపల్లె, మార్చి 2:నందివర్గం పోలీస్‌స్టేషన్ పరిధిలోని వెంకటాపురం గ్రామ సమీపంలో శుక్రవారం ప్రమాదవశాత్తూ ట్రాక్టర్‌పై నుంచి పడి కమాల్‌బాషా(32) మృతిచెందాడు. పోలీసులు, మృతుడి బంధువులు తెలిపిన వివరాలు.. కమాల్‌బాషా ట్రాక్టర్‌ను కడిగేందుకు గ్రామ సమీపంలోని చేపలకుంట వద్దకు తీసుకెళ్తుండగా ప్రమాదవశాత్తూ ఎగిరి కిందపడడంతో ట్రాలీ టైర్లు అతడిపై వెళ్లడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. అతడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. విషయం తెలిసిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. అలాగే మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం బనగానపల్లె ప్రభుత్వ వైద్యశాలకు తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

భవనంపై నుంచి పడి వైద్యురాలి మృతి
నందికొట్కూరు, మార్చి 2:పట్టణంలోని శ్రీవిజయ హాస్పిటల్ నిర్వాహకుడు డా. గురవయ్య భార్య డా. అల్వాల ప్రభావతమ్మ(60) శుక్రవారం ఉదయం ప్రమాదవశాత్తూ ఆసుపత్రి 3 అంతస్తుల భవనంపై నుంచి కింద పడి మృతి చెందారు. వివరాలు.. విజయ ఆసుపత్రిలో 4వ అంతస్తు నిర్మాణం పనులు జరుగుతుండగా, నిర్మాణ పనుల వద్ద ఉన్న ట్యాంకులో నీరు వుందా లేదా అని పరిశీలించేందుకు ప్రభావతమ్మ భవనంపైకి వెళ్లింది. అయితే ఎంత సేపటికీ కిందికి దిగిరాకపోవడంతో అక్కడ పనిచేసే సిబ్బంది ఆమె కోసం చూడగా ఆసుపత్రి పక్కన వున్న మున్సిపాలిటీ ఆవరణలో పడి ఉండడం కన్పించింది. దీంతో వెంటనే కుటుంబ సభ్యులు ఆమెను ఆసుపత్రిలో చేర్చి చికిత్స చేసేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. అప్పటికే ఆమె మృతి చెందినట్లు గుర్తించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం నందికొట్కూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ లక్ష్మీనారాయణ తెలిపారు.