కర్నూల్

అత్తింటి ఆరళ్లకు అబల బలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోవెలకుంట్ల, మే 3:అదనపు కట్నం కోసం అత్తవారి ఇంటి వేధింపులు తాళలేక పట్టణానికి చెందిన దూదేకుల దస్తగిరమ్మ(24) ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్‌ఐ మంజునాథ్ తెలిపారు. పట్టణంలోని కుమ్మరివీధిలో నివాసం ఉంటున్న శ్రీనివాసులు, లక్ష్మిదేవి పెద్దకుమారుడు దూదేకుల కమాల్‌కు ఉయ్యాలవాడ మండలం రూపనగుడి గ్రామానికి చెందిన దూదేకుల చిన్న దస్తగిరి కుమార్తె దస్తగిరమ్మకు నాలుగేళ్ల క్రితం వివాహం జరిగింది. వివాహం సమయంలో రూ. 2లక్షలు విలువ చేసే బంగారు ఆభరణాలు, రూ. 50 వేలు నగదును కట్నకానుకలుగా ఇచ్చారు. కొద్దికాలం వారి కాపురం సజావుగానే సాగింది. వారికి మూడేళ్ల కుమార్తె, 8 నెలల కుమారుడు సంతానం. అయితే అదనపు కట్నం తేవాలని గత 4 నెలల నుంచి అత్త మహాలక్ష్మి, భర్త కమాల్ ఆమెను వేధింపులకు గురిచేస్తుండేవారు. దీంతో దస్తగిరిమ్మ ఈ విషయం తల్లిదండ్రులకు చెప్పడంతో గత నెలలో రూ. 5 వేలు కమాల్‌కు ఇచ్చారు. అయినా వేధింపులు ఆగకపోవడంతో జీవితంపై విరక్తి చెందిన దస్తగిరిమ్మ మంగళవారం ఉదయం ఇంటిలో సీలింగ్ రాడ్‌కు చీరతో ఉరివేసుకుంది. విషయం తెలుసుకున్న స్థానికులు ఆమెను క్రిందికి దింపి పోలీసులకు సమాచారం అందించారు. అలగే ఆమె తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కోవెలకుంట్ల ప్రభుత్వ వైద్యశాలకు తరలించినట్లు ఎస్‌ఐ తెలిపారు.