కర్నూల్

హోదాపై బీజేపీని ప్రశ్నించే ధైర్యం వైసీపీకి ఉందా.

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

.ఆళ్లగడ్డ, ఏప్రిల్ 14: రాష్ట్రానికి ప్రత్యేకహోదా కోసం ప్రధాని మోదీని ప్రశ్నించే ధమ్ము, ధైర్యం వైకాపా నాయకులకు ఉందా అని రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి భూమా అఖిలప్రియ అన్నారు. పట్టణంలోని నాలుగురోడ్ల కూడలిలో డా. బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ డా. అంబేద్కర్ అందరివాడని, ఆయన ఆశయసాధనకు అందరం కృషి చేయాలన్నారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి ఎంతో కృషి చేశారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు ప్రవేశపెట్టారన్నారు. దళితుల సంక్షేమమే ధ్యేయంగా టీడీపీ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణాలు ఇస్తున్నామన్నారు. ఆళ్లగడ్డలో అంబేద్కర్ భవన నిర్మాణానికి చర్యలు తీసుకుంటామన్నారు. ముఖ్యంగా దళిత తేజం ద్వారా దళితుల వద్దకు వెళ్లి వారి సమస్యలను తెలుసుకొని సమస్యలను పరిష్కరిస్తున్న ఘనత చంద్రబాబుదే అన్నారు. ఈనెల 30న తిరుపతిలో జరిగే భహిరంగసభకు భారీగా తరలిరావాలన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం చిత్తశుద్ధితో కృషి చేసే పార్టీ టీడీపీయే అన్నారు. ప్రత్యేకహోదా కోసం నరేంద్రమోదీ ఇంటిని టీడీపీ ఎంపీలు ముట్టడించారన్నారు. చీటికి మాటికి చంద్రబాబును విమర్శించే వైకాపా నాయకులు ప్రత్యేకహోదా ఇవ్వని బీజేపీని విమర్శించే దమ్ము వుందా అని ఎద్దేవా చేశారు.
శ్రీశైలం డ్యాంను సందర్శించిన ట్రైనీ కలెక్టర్లు
శ్రీశైలం టౌన్, ఏప్రిల్ 14: శ్రీశైలం డ్యాంను ఆంధ్రక్యాడర్‌కు చెందిన 2016 బ్యాచ్ ట్రైనీ ఐఏఎస్‌లు శనివారం సందర్శించారు. ఈ మేరకు డ్యాం వద్ద డీఈ శయనానంద్ వారికి డ్యాం యొక్క నీటి నిల్వలు, స్థితిగతులు, 2009లో సంభవించిన వరదలు తదితర వివరాలు తెలిపారు. అలాగే డ్యాం గ్యాలరి, క్లస్ట్ గేట్లు తదితర వాటిని వారు పరిశీలించారు. అనంతరం ఆంధ్ర ప్రాంతంలోని కుడిగట్టు జల విద్యుత్ కేంద్రాన్ని, తెలంగాణ ప్రాంతంలోని ఎడమ గట్టు భూ గర్భ జల విద్యుత్ కేంద్రాన్ని కూడా వారు పరిశీలించారు. వారి వెంట తహశీల్దార్ శ్రీనివాసులు తదితరులు ఉన్నారు. అనంతరం వారు శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్లను దర్శించుకొని సేవించుకున్నారు.