కర్నూల్

కల్లపారిలో విషాదం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోడుమూరు, జూన్ 24 : కళ్లకు మందు వేయించుకోవడానికి బయల్దేరిన పలువురు ఆదివారం తెల్లవారుజామున ఓర్వకల్లు మండలం సోమయాజులపల్లె సమీపంలో జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. వారిలో కోడుమూరు మండల పరిధిలోని కల్లపారి గ్రామం సర్పంచ్ గౌరమ్మతో పాటు గ్రామస్థులు బోయ మారెప్ప, సోమక్క, మాణిక్యమ్మ, గూడూరు మండలం చనుగొండ్ల గ్రామానికి చెందిన లక్ష్మిదేవి, రామళ్లకోటకు చెందిన మరొకరు మృతి చెందారు. దీంతో వారి వారి మృతదేహాలు సాయంత్రం కల్లపారి గ్రామానికి చేరుకోగా గ్రామమంతా శోకసంద్రంలా మారింది. గ్రామంలోని ప్రజలు మృతదేహాలను చూసేందుకు పెద్దఎత్తున తరలివచ్చి కన్నీటి పర్యంతమయ్యారు. అలాగే మృతుల బంధువులు కూడా గ్రామానికి చేరుకుని తమ వారికి ఇక దిక్కెవరని గుండెలవిసేలా రోదించారు.
బాధిత కుటుంబాలకు ఆర్టీసీ చైర్మన్ పరామర్శ
కాగా మృతుల కుటుంబాలను సాయంత్రం ఆర్‌టీసీ చైర్మన్ వర్ల రామయ్య, కలెక్టర్ సత్యనారాయణ, ఎమ్మెల్యే ఎం.మణిగాంధీ గ్రామానికి వచ్చి పరామర్శించారు. అనంతరం వర్ల రామయ్య మాట్లాడుతూ మృతుల కుటుంబాలకు ఆర్‌టీసీ సంస్థ నుంచి ఒక్కో కుటుంబానికి రూ. లక్ష, ప్రభుత్వం నుంచి మరో రూ. 2 లక్షలు, క్షతగాత్రులకు రూ. 25వేలు అందిస్తున్నట్లు ప్రకటించారు.
ఇదిలా ఉండగా రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన వారందరిలో ఏ ఒక్కరికీ చంద్రన్న బీమా వర్తించకపోవడం గమనార్హం. స్థానిక వెలుగు అధికారుల నిర్లక్ష్యం వల్ల మృతుల కుటుంబాలకు చంద్రన్నబీమా పథకం వర్తించకపోవడంతో గ్రామస్థులు అధికారుల చర్యలపై మండిపడ్డారు. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రభుత్వం రూ. 5 లక్షలు ఆర్థిక సహాయం అందించాలని స్థానికులు కోరారు. పరామర్శించిన వారిలో టీడీపీ నాయకులు యువి రాజారెడ్డి, వెంపేంట రవీంద్రగౌడ్, సుందర్‌రాజు ఉన్నారు.