కర్నూల్

టీడీపీ హయాంలోనే బీసీల అభివృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆత్మకూరు, జూలై 19:టీడీపీ హయాంలోనే బీసీలు అభివృద్ధి చెందుతున్నారని రాష్ట్ర వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ దేవళ్ల మురళీ పేర్కొన్నారు. స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో గురువారం ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. చంద్రబాబు ప్రభుత్వం కుల వృత్తులు చేసుకునే వారికి రూ. 10వేలు, రూ. 20, రూ.30 వేల యూనిట్లను మంజూరు చేసిందని, వీటి వల్ల వారికి జీవనోపాధి కలుగుతుందన్నారు. గత 70ఏళ్ల నుంచి వడ్డెర్లను ఎస్సీ జాబితాలో చేర్చాలని పోరాటం చేస్తున్నామని, దీంతో స్పందించిన సీఎం చంద్రబాబు మహానాడులో వడ్డెర్లను ఎస్సీ జాబితాలో చేర్చాలని నిర్ణయం తీసుకున్నారన్నారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో వడ్డెర్లను ఎస్సీ జాబితాలో చేర్చాలని తీర్మానం చేసి ఆమోదం కోసం పార్లమెంటుకు పంపిస్తారన్నారు. వడ్డెర్ల అభివృద్ధి కోసం రూ. 750 కోట్లు మంజూరు చేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. లబ్ధిదారులకు 50శాతం సబ్సిడీ ఇస్తున్నారన్నారు. వడ్డెర్లు గనుల్లో పని చేస్తూ ప్రమాదవశాత్తూ మరణిస్తే రూ. 5లక్షల ప్రమాదబీమా అందిస్తున్నారన్నారు.
వైసీపీకి పెరుగుతున్న ఆదరణ
* ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్‌రెడ్డి
ఉయ్యాలవాడ, జూలై 19: రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం అనుసరిస్తున్న విధి విధానాలు నచ్చక వైకాపాలో వలసలు వస్తున్నారని, దీంతో వైకాపాకు రాష్ట్రంలో మంచి ఆదరణ లభిస్తోందని ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్‌రెడ్డి అన్నారు. గురువారం దొర్నిపాడు మండలం చాకరాజువేముల గ్రామానికి చెందిన ఏపీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమా చెంచిరెడ్డితో పాటు సోదరులు శంకర్‌రెడ్డి, రుద్రారెడ్డి, శ్రీనివాసరెడ్డి, రామమోహన్‌నాయుడు, చిన్నన్న, మహబూబ్‌బాషా, అల్లాబకాష్, మహమ్మద్ప్రీతో పాటు దాదాపు 200 కుటుంబాలు టీడీపీ నుండి గంగుల సమక్షంలో వైకాపాలో చేరాయి. ఈ సందర్భంగా గంగుల మాట్లాడుతూ భూమా చెంచిరెడ్డి కుటుంబం టీడీపీలో కొనసాగలేకనే వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాలకు ఆకర్షితులై మా పార్టీలో చేరారన్నారు. మంత్రి భూమా అఖిలప్రియ, మంత్రి అనుచరులు నియోజకవర్గ అభివృద్ధి మరచి ధనార్జనే ధ్యేయంగా పనులు చేస్తున్నారని విమర్శించారు. భూమా కుటుంబానికి ప్రతి ఎన్నికల్లో గెలుపుకు కృషి చేసిన భూమా చెంచిరెడ్డి కుటుంబం వైకాపాలో చేరడం దొర్నిపాడు మండలంలో పార్టీ బలోపేతానికి ఇదొక నిదర్శనమన్నారు. ఈ కార్యక్రమంలో నంద్యాల వైకాపా ఇన్‌చార్జి శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డి, ఆళ్లగడ్డ ఇన్‌చార్జి గంగుల బిజేంద్రారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి కర్రా హర్షవర్ధన్‌రెడ్డి, ఆళ్లగడ్డ మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ పలచాని బాలిరెడ్డి, శింగం భరత్‌కుమార్‌రెడ్డి, దొర్నిపాడు మాజీ సర్పంచ్ బత్తుల నాగేశ్వరరావు, కార్యకర్తలు పాల్గొన్నారు.