కర్నూల్

అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, జూలై 19 : వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించాలని కలెక్టర్ సత్యనారాయణ ఆదేశించారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో గురువారం వ్యవసాయ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్ ప్రారంభమైంది, వర్షాలు కూడా ఆశాజనకంగా కురుస్తున్నాయి, కావున వ్యవసాయ అధికారులందరూ క్షేత్రస్థాయిలో పర్యటించి పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించి అధిక దిగుబడులు సాధించేలా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో దాదాపు 38వేల మంది కౌలు రైతులు ఉన్నారని, వీరందరికీ తప్పనిసరిగా బ్యాంకర్లు రుణాలు అందించాలన్నారు. కౌలు రైతుల వివరాలను వెంటనే ఎల్‌డీఎంకు ఇవ్వాలని వ్యవసాయశాఖ అధికారులను ఆదేశిస్తూ, ఆ వివరాలను కంట్రోలింగ్ బ్యాంకు ఆధికారుల ద్వారా అన్ని బ్యాంకు శాఖలకు తక్షణమే పంపించాలని ఎల్‌డీఎంను ఆదేశించారు. కౌలు రైతులకు గత ఏడాది రూ. 20కోట్ల దాకా రుణాలు ఇచ్చారని, ఈమారు రూ. 70కోట్లు ఇవ్వాలన్నారు. జిల్లాలో మొత్తం 10వేల జేఎల్‌జీ గ్రూపులు ఉండగా ఇప్పటివరకూ 1785 గ్రూపులకు మాత్రమే రుణాలు ఇచ్చారని మిగిలిన వారికి వెంటనే అందించాలన్నారు. అధికారుల నుంచి మండలాల వారీగా సాగు చేసిన భూమి వివరాలు తెలుసుకున్న కలెక్టర్ సాగు భూమి విస్తీర్ణం తక్కువగా ఉండటంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్యాబ్‌లు ఇచ్చాం.. ఎంపీఈవోలను నియమించాం.. అయినప్పటికీ ఖచ్చితమైన వివరాలను సకాలంలో ఇవ్వలేకపోతున్నారని మండిపడ్డారు. సరైన వివరాలు వెంటనే ఇవ్వాలని లేకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రతి నియోజకవర్గానికి 50 రైతు రుణాలు మంజూరయ్యాయని, అర్హత కలిగిన రైతు ఉత్పత్తిదారుల సంఘానికి, రైతులకు పారదర్శకంగా వాటిని పంపిణీ చేయాలన్నారు.